Scooter | ఎలక్ట్రిక్ బైక్స్ తయారు చేసే హార్విన్ కంపనీ తాజాగా అదిరిపోయే స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈఐసీఎంఏ 2022లో ఫస్ట్ మ్యాక్సి స్కూటర్‌ను (Scooter) ప్రదర్శించింది. దీని పేరు సెన్మెన్టి జీరో. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter). ఈ స్కూటర్ ఫీచర్లు తెలిస్తే వారెవ్వా అనాల్సిందే. ఎందుకంటే డిజైన్, స్పెసిఫికేషన్స్ అదిరిపోయాయి. హార్విన్ కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను 2019లో ఆవిష్కరించింది.
హార్విన్ సెన్మెన్టి 0 అనేది 400 వీ ఆర్కిటెక్చర్‌పై తయారైంది. అంటే ఈ స్కూటర్ కేవలం 30 నిమిషాల్లోనే 0 నుంచి 80 శాతం చార్జ్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.8 సెకన్లలోనే అందుకుంటుంది. టాప్ స్పీడ్ 200 కిలోమీటర్లు. ఈ స్కూటర్ గంటకు 88 కిలోమీటర్లు వెళ్తుందని, ఒక్కసారి చార్జింగ్ పెడితే 300 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంటోంది.
ఈ 7 కార్లపై భారీ డిస్కౌంట్.. రూ.వేలల్లో తగ్గింపు!
బ్యాటరీ సామర్థ్యం తగ్గుతున్న కూడా స్కూటర్ పనితీరుపై ఆ ప్రభావం ఉండదని కంపెనీ తెలిపింది. రేంజ్ ఎక్స్టెండ్ ఫీచర్ కూడా ఉందని పేర్కొంది. దీని ద్వారా ప్యాసింజర్ ఎక్కువ దూరం ప్రయాణించొచ్చని తెలిపింది. అయితే ఎంత వరకు జర్నీ చేయొచ్చనే అంశాన్ని వెల్లడించలేదు.
ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త.. కొత్త సర్వీసులు అందుబాటులోకి!
సెన్మెన్టి జీరో ఇస్కూటర్ రైడర్ రైడింగ్ స్టైల్‌ను అర్థం చేసుకుంటుందని, దీని వల్ల దీర్ఘకాలంలో స్కూటర్ లైఫ్ పెరుగుతుందని కంపెనీ వివరిస్తోంది. ఈ స్కూటర్లో 30 సెన్సార్లు ఉన్నాయని పేర్కొంది. కెమెరాలు కూడా అమర్చినట్లు కంపెనీ వెల్లడించింది. దీని వల్ల రియల్ టైమ్‌లో సమాచారం పొందొచ్చని తెలిపింది. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో ఏబీఎస్, యాంటీ స్లిప్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, కొలిజన్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వివరించింది. ఇంకా హిల్ క్లైంబ్ అసిస్ట్, స్టార్ట్ అండ్ రివర్స్ అసిస్టెన్స్, కీలెస్ గో, హీటెడ్ గ్రిప్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఈ స్కూటర్లో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఇంకా ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, హీటెడ్ సీట్, టీఎఫ్టీ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్ వంటి ఫీచర్లను గమనించొచ్చు. అంటే ఫీచర్లు అదిరిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ స్కూటర్ మన దేశంలో అందుబాటులో ఉంటుందో లేదో తెలియదు. అయితే మన కంపెనీలు కూడా ఇలాంటి స్కూటర్లను తయారు చేస్తే అదిరిపోతుందని చెప్పుకోవచ్చు. ఇస్కూటర్ కొనాలని భావించే వారు ఇలాంటి వాటికి ప్రధాన్యం ఇవ్వొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Scooter, Electric Vehicles, SCOOTER