Life Insurance | ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడే వారికి తీపికబురు. ఎందుకంటే బ్యాంక్ (Bank) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తన క్రెడిట్ కార్డు కస్టమర్లకు గ్రూప్ క్రెడిట్ షీల్డ్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా క్రెడిట్ కార్డు వాడే వారికి లైఫ్ ఇన్సూరెన్స్ (Insurance) లభించనుంది. క్రెడిట్ కార్డు లిమిట్ ఎంత ఉందో.. అందుకు సమానంగా ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. అయితే కవరేజ్ గరిష్ట పరిమితి రూ. 3 లక్షలుగా ఉంది.
బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడే వారు ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు లేకుండా, అలాగే వైద్య పరీక్షలు లేకుండా ఈ పాలసీని పొందొచ్చు. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. మూడు నిమిషాల్లోనే పాలసీ పొందొచ్చని బ్యాంక్ పేర్కొంటోంది. ఈ పాలసీ టర్మ్ ఏడాది వరకు ఉంటుంది. అంటే ప్రతి ఏటా రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు.
నేటి నుంచి కొత్త రూల్స్.. మారే 12 అంశాలు ఇవే.. మీపై ఎఫెక్ట్!
ప్రస్తుతం ఫెడరల్ బ్యాంక్ మూడు రకాల క్రెడిట్ కార్డులను కస్టమర్లకు అందిస్తోంది. సెలెస్టా, ఇంపెరియో, సిగ్నెట్ అనేవి ఇవి. వీసా, మాస్టర్ కార్డ్, రూపే సంస్థలతో భాగస్వామ్యం ద్వారా ఫెడరల్ బ్యాంక్ ఈ క్రెడిట్ కార్డులను తీసుకువచ్చింది. ఫెడరల్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. ఏజియస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తుంది. ఇది ఫెడరల్ బ్యాంక్, ఏజియస్ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్.
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. కొత్త రేట్లు ఇలా, వారికి మొండి చెయ్యి!
ప్రీమియం విషయానికి వస్తే.. 20 ఏళ్ల వయసులో ఉన్న వారికి రూ. 3 లక్షల కవరేజ్‌కు రూ. 604 ప్రీమియం పడుతుంది. అదే రూ. 2 లక్షలకు అయితే రూ. 403, రూ.లక్షకు అయితే రూ. 201 చెల్లించుకోవాల్సి ఉంటుంది. అదే 60 ఏళ్ల వరకు వయసులో ఉన్న వారికి అయితే రూ.లక్షకు రూ. 1958, రూ. 2 లక్షలకు రూ. 3916, రూ. 3 లక్షలకు రూ. 5874 ప్రీమియం కట్టాలి.
అలాగే 30 ఏళ్ల వయసులో ఉన్న వారు అయితే రూ. 3 లక్షల మొత్తానికి రూ. 631 కడితే సరిపోతుంది. రూ.లక్షకు రూ. 210, రూ. 2 లక్షలకు రూ. 421 ప్రీమియం చెల్లించాలి. క్రెడిట్ కార్డు వాడే వారు మరణిస్తే.. ఆ క్రెడిట్ కార్డు బిల్లు భారం లేకుండా చూసుకోవాలని భావించే వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. తద్వారా కుబుంబంపై ఆర్థిక భారం పడదు. ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Credit card, Insurance, Life Insurance