COCONUT SHELL: అమెజాన్‌లో కొబ్బరిచిప్ప... సోషల్ మీడియాలో రచ్చరచ్చ...

కొబ్బరి చిప్ప అసలు ధర రూ.3,000, డిస్కౌంట్ 55% ఇవ్వగా ఆఫర్ ధర రూ.1365 కనిపించడంతో ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి ఆశ్చర్యపోయారు. సీరియస్‌లీ అంటూ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో పెద్ద చర్చే మొదలైంది.

news18-telugu
Updated: January 16, 2019, 8:42 PM IST
COCONUT SHELL: అమెజాన్‌లో కొబ్బరిచిప్ప... సోషల్ మీడియాలో రచ్చరచ్చ...
అమెజాన్‌లో కొబ్బరిచిప్ప... సోషల్ మీడియాలో రచ్చరచ్చ... (Image credits: Century Novelty / Amazon)
  • Share this:
అమెజాన్‌లో అమ్మకానికి పెట్టిన కొబ్బరిచిప్ప ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీస్తోంది. కారణం కొబ్బరిచిప్పను అమ్మకానికి పెట్టడం ఓ కారణమైతే, ఆ కొబ్బరిచిప్ప ధర మరో కారణం. ఆ కొబ్బరిచిప్ప ధర రూ.1365. అవును... అంత డబ్బుతో మంచి పవర్ బ్యాంకు కొనొచ్చు. లేదా బ్రాండెడ్ హెడ్‌సెట్ కొనొచ్చు. నోకియా ఫీచర్ ఫోన్ కూడా కొనొచ్చు. రెండు సోనీ హెడ్‌సెట్స్ కూడా వస్తాయి. కానీ అమెజాన్‌లో ఓ కొబ్బరిచిప్ప ధర రూ.3,000 ఉంటే ఆఫర్‌ రేటు రూ.1365. షాకయ్యారా? మీరే కాదు అది చూసి అందరూ అలాగే షాకయ్యారు. అమెజాన్‌లో కొబ్బరిచిప్పను అమ్మడం, అది కూడా రూ.3,000 ధర, 55% డిస్కౌంట్ ఇవ్వగా ఆఫర్ ధర రూ.1365 కనిపించడంతో ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి ఆశ్చర్యపోయారు. సీరియస్‌లీ అంటూ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో పెద్ద చర్చే మొదలైంది.

కొబ్బరిచిప్ప ధర రూ.3,000... ఆఫర్‌లో రూ.1365... ట్విట్టర్‌లో వైరల్ | This Coconut on Amazon is Costlier Than Two Sony Headphones and Twitter is Shell-Shocked

కొబ్బరి చిప్పకు రూ.3,000 ధర నిర్ణయించడం, ఆఫర్‌లో రూ.1,365 ఫిక్స్ చేయడమేంటో ఎవరికీ అంతుచిక్కట్లేదు. ఈ కొబ్బరి చిప్పల్ని హవాయియన్ లువావ్ పార్టీలకు అమ్ముతారట. ఆ పార్టీలో ఈ కొబ్బరిచిప్పలు తప్పనిసరి. అందుకే వాటి ధర అంత ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రెండు రోజులుగా ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఇదే చర్చ.






అంతేకాదు... అమెజాన్‌లో కొబ్బరిచిప్ప ధర రూ.1365 ఉందని తెలుసుకొని, ఆ కొబ్బరిచిప్ప ప్రత్యేకత ఏంటో కనుక్కునేందుకు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. దీంతో 'coconut shell' గూగుల్ ట్రెండ్స్‌లో ఒక్కసారిగా ఇలా దూసుకెళ్తోంది.

అమెజాన్‌లో కొబ్బరిచిప్ప... సోషల్ మీడియాలో రచ్చరచ్చ... | This Coconut on Amazon is Costlier Than Two Sony Headphones and Twitter is Shell-Shocked
అసలు అమెజాన్‌ ఆ కొబ్బరిచిప్ప అమ్మడం వింతగా మారిపోయింది.



ఇవి కూడా చదవండి:

SANKRANTI 2019: వాట్సప్‌లో సంక్రాంతి స్టిక్కర్లు ఇలా పంపండి

Paytm Petrol Offer: పేటీఎంతో పెట్రోల్ కొంటే రూ.7,500 క్యాష్ బ్యాక్

Donkey's Milk Soap: గాడిద పాల సబ్బుకు ఫుల్ డిమాండ్... ధర రూ.499

Jio Effect: వొడాఫోన్ రూ.396 కొత్త ప్లాన్... 69 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్
First published: January 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>