భవిష్యత్తులో రోబోలదే హవా అని చాలాసార్లు మనం వినే ఉంటాం. రానున్న రోజుల్లో రోబోలే అన్ని పనులు చేస్తాయని, ఉద్యోగాల కోసం వాటినే నియమించుకుంటారంటే ఆశ్చర్యపోయాం. కానీ ఆ రోజులు వచ్చేశాయి. యూఏఈలో ఓ సూపర్ మార్కెట్ సంస్థ రోబోలను ఉద్యోగులుగా నియమించుకుంది. అదే క్యారీ ఫోర్. ఈ సంస్థకు చెందిన డిపార్ట్మెంటల్ స్టోర్లో వీటిని నియమించింది. 11 రోబోలను కొత్తగా ఉద్యోగంలో తీసుకుంది. టాలీ రోబోలైన ఇవి స్టోర్లలో వివిధ రకాల పని కోసం ఉపయోగిస్తున్నారు. సపోర్ట్ స్టాక్ మేనేజ్ మెంట్, స్టాక్ నియంత్రణ, నిర్వహణ కోసం వీటిని వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఇవి మానవుల కంటే పరిపూర్ణంగా పనిచేయడంలో సిద్ధహస్తులు. కెమేరాలు కలిగి ఉన్న ఈ రోబోలు 163 సెంటిమీటర్లు పొడవు, 30 కిలోల బరువు కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఇవి స్టాక్ లోపాలను తనిఖీ చేయగలవు. ఉత్పత్తుల స్టాక్ లేనప్పుడు, స్పాట్ ధర అసమతుల్యత, తప్పుడు బార్ కోడ్స్, స్టాక్ మిస్ ప్లేస్ మెంట్ లాంటి వ్యవహారాలను చక్కబెట్టడంలో సహాయపడతాయి.
మనుషుల కంటే సులంభంగా పనిచేస్తాయి..
సూపర్ మార్కెట్లో పనిచేసే ఈ రోబోలు మనుషుల కంటే పనిని సులభమైన మార్గంలో పూర్తి చేస్తాయి. వర్క్ లోడ్ తగ్గించడంలో, స్టాక్ విధులు చక్కపెట్టడంలో మానవుల కంటే మెరుగైన పనితీరును ప్రదర్శిస్తున్నాయి. ఎంతో సులభకరమైన రీతిలో పనిచేసే ఈ రోబోలు ఎక్కువ ఫలితాన్ని తీసుకొస్తున్నాయి.
పనితీరు మెరుగుపరిచేందుకు మరింత కృషి...
ఈ విషయంపై క్యారీ ఫోర్ సంస్థ యూఏఈ కంట్రీ మేనేజర్ ఫిలిప్ పెగ్విలిహాన్ మాట్లాడుతూ.. తాము పనితీరు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరింత కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తమ కార్యాకలాపాలను డిజిటలైజ్ చేయడానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే టాలీ రోబో సాధించిందని, ఉత్పత్తి లభ్యత, ప్లేస్ మెంట్, ధరల డేటాను పూర్తి ఆటోమేటెడ్ టేయడంతో క్యారీఫోర్ స్టోర్లలో మరింత సమర్థవంతమైన, సౌకర్యవంతమైన సేవలను అందించకగలుగుతున్నామని స్పష్టం చేశారు. తమ సహోద్యోగులు.. వినియోగదారులకు వారి షాపింగ్ లో సహాయం చేయడంలో ఎక్కువగా దృష్టి పెడుతున్నామని చెప్పారు.
ఈ రోబోల పట్ల ఆసక్తి గలిగినవారు, వీటిని చూసేందుకు ఉత్సుకత చూపేవారు యునైటెడ్ ఎమిరేట్స్ లోని.. సిటీ సెంటర్ డీరా, సిటీ సెంట్ మిర్డిఫ్, సిటీ సెంటర్ , దుబాయ్ ఫెస్టివల్ తో సహా యూఏఈలోని క్యారీఫోర్ స్టోర్లలో చూడవచ్చు. ఇవికాకుండా బటూటా మాల్, సిటీ సెంటర్ అజ్మాన్, యాస్ మాల్, జిమీ మాల్, సిటీ సెంటర్ అల్ జాహియా, సిటీల్యాండ్ లాంటి మాల్స్ లో కూడా గమనించవచ్చు. అయితే, ఎవరైనా దొంగలు తెలివిగా ఏవైనా వస్తువులు నొక్కేయటానికి ట్రై చేస్తే ఏం చేస్తాయి? ఈ డౌట్ మీక్కూడా వచ్చిందా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.