Lockdown: లాక్‌డౌన్‌లో ఈ బిజినెస్ సూపర్ హిట్... ప్రభుత్వ సాయంతో వ్యాపారం చేయండిలా

Pradhan Mantri Jan Aushadhi Yojana | మీరు తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? లాక్‌డౌన్ లాంటి ఆంక్షలు ఉన్నా ఎలాంటి అడ్డంకులు లేని బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ప్రధాన మంత్రి జన్ ఔషధి యోజన స్కీమ్ గురించి తెలుసుకోండి.

news18-telugu
Updated: May 12, 2020, 10:19 AM IST
Lockdown: లాక్‌డౌన్‌లో ఈ బిజినెస్ సూపర్ హిట్... ప్రభుత్వ సాయంతో వ్యాపారం చేయండిలా
Lockdown: లాక్‌డౌన్‌లో ఈ బిజినెస్ సూపర్ హిట్... ప్రభుత్వ సాయంతో వ్యాపారం చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
లాక్‌డౌన్ కాలంలో దాదాపు అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. కొన్ని వ్యాపారాలకు మాత్రమే అనుమతి ఉంది. అందులో ఒకడి మెడికల్ షాప్. జనరిక్ మెడిసిన్ దొరికే షాపులకు ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది. కారణం... ఇక్కడ తక్కువ ధరకే మెడిసిన్ దొరకడం. జన్ ఔషధి కేంద్రాల్లో మార్చిలో రూ.42 కోట్లు, ఏప్రిల్‌లో రూ.52 కోట్ల వ్యాపారం జరిగింది. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి యోజన పథకంలో భాగంగా ఈ మెడికల్ షాపులు ఏర్పాటవుతున్నాయి. ఈ వ్యాపారం చేసేవారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా ఉంటుంది. మరి మీరు కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే పూర్తి వివరాలు తెలుసుకోండి.

ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి ప్రాజెక్ట్‌నే జన్ ఔషధి యోజన అంటారు. 2015 లో ఈ స్కీమ్ ప్రారంభమైంది. తక్కువ ధరకే జనరిక్ మెడిసిన్స్ అమ్మడం ఈ కేంద్రాల ప్రత్యేకత. మార్కెట్‌ రేటు కన్నా 90 శాతం తక్కువ ధరకే ఇక్కడ మందులు దొరుకుతాయి. మీరు జన్ ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే రూ.2.50 లక్షల పెట్టుబడి అవసరం. ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది. జనఔషధి కేంద్రాలు మూడు రకాలుగా ఉంటాయి. మొదటి కేటగిరీలో ఎవరైనా వ్యక్తిగతంగా లేదా ఫార్మాసిస్ట్, డాక్టర్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ జనఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయొచ్చు. రెండో కేటగిరీలో ట్రస్టులు, ఎన్‌జీఓలు, ప్రైవేట్ ఆస్పత్రులు, సొసైటీలు, స్వయం సహాయక గ్రూపులు జనఔషధి కేంద్రాన్ని తెరవచ్చు. మూడో కేటగిరీలో రాష్ట్ర ప్రభుత్వాలు నామినేట్ చేసిన ఏజెన్సీలు ఏర్పాటు చేయొచ్చు.

మీరు జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 120 చదరపు అడుగుల స్థలం చాలు. జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినవారికి ప్రభుత్వం 900 రకాల మందులను సప్లై చేస్తుంది. మీరు నెలకు రూ.1,00,000 మందులు అమ్మితే మీకు రూ.20,000 లాభం వస్తుంది. వికలాంగులు, ఎస్సీ, ఎస్టీలకు రూ.50,000 మెడిసిన్ అడ్వాన్స్‌గా ఇస్తుంది ప్రభుత్వం. వాట్సప్, ఇమెయిల్ ద్వారా పేషెంట్ల నుంచి ఆర్డర్స్ తీసుకొని మెడిసిన్ సరఫరా చేయొచ్చు. జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రీటైల్ డ్రగ్ సేల్స్ లైసెన్స్ ఉండాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తప్పనిసరి. జనఔషధి అధికారిక వెబ్‌సైట్ http://janaushadhi.gov.in నుంచి దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్‌ను బ్యూరో ఆఫ్ ఫార్మా జనరల్ మేనేజర్‌కు పంపాలి. ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన-PMBJP పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు http://janaushadhi.gov.in వెబ్‌సైట్‌లో ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

LIC Policy Loan: మీ ఎల్ఐసీ పాలసీపై లోన్ తీసుకోవచ్చు ఇలా

Home Loan: హోమ్ లోన్ ఉందా? ఈ టెక్నిక్‌తో ఈఎంఐ తగ్గించుకోండి

Gold: మార్కెట్ ధర కన్నా తక్కువకే బంగారం... నేటి నుంచే సేల్
First published: May 12, 2020, 10:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading