Bank Interest: ఆ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్​పై అధిక వడ్డీ.. ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీల కంటే మెరుగైన వడ్డీ ఆఫర్​..

ప్రతీకాత్మక చిత్రం

Bank Interest: బ్యాంకులో దాచుకున్న డబ్బును అత్యవసర అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి వీలుగా సేవింగ్స్ అకౌంట్‌లో డిపాజిట్ చేస్తుంటారు. సాధారణ బ్యాంకింగ్ అవసరాలకు కూడా సేవింగ్స్ అకౌంట్ అవసరమవుతుంది. ఈ డిపాజిట్లపై వడ్డీ తక్కువగా ఉన్నప్పటికీ దీనితో అనేక ప్రయోజనాలుంటాయి.

  • Share this:
బ్యాంకులో దాచుకున్న డబ్బును అత్యవసర అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి వీలుగా సేవింగ్స్ అకౌంట్‌లో డిపాజిట్ చేస్తుంటారు. సాధారణ బ్యాంకింగ్ అవసరాలకు కూడా సేవింగ్స్ అకౌంట్ అవసరమవుతుంది. ఈ డిపాజిట్లపై వడ్డీ తక్కువగా ఉన్నప్పటికీ దీనితో అనేక ప్రయోజనాలుంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డి)లో వడ్డీ ఎక్కువగా అందిస్తున్నప్పటికీ, ఎఫ్‌డీలను అత్యవసర పరిస్థితిలో విత్​డ్రా చేసుకోవడం కుదరదు. అందుకే మార్కెట్​లో ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ అందిస్తుందో చెక్​ చేసుకోవాలి. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్​ బ్యాంకులు బ్యాంకుల కంటే కొన్ని స్మాల్​, ప్రైవేట్ బ్యాంకులు కస్టమర్లకు అధిక వడ్డీ రేటును ఆఫర్​ చేస్తున్నాయి. వీటిలో డీసీబీ బ్యాంక్​ ముందు వరుసలో ఉంది.

Family Health Insurence: కుటుంబం మొత్తానికి ఒకే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ.. వివరాలివే..


డీసీబీ బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రసిద్ధ బ్యాంకుల కంటే ఎక్కువ సేవింగ్స్ వడ్డీ రేటు ఆఫర్​ చేస్తుండటం విశేషం. డీసీబీ బ్యాంక్​ సేవింగ్స్​ అకౌంట్​పై 6.75 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే ఇది ఉత్తమ వడ్డీ రేటుగా చెప్పవచ్చు. ఉదాహరణకు, డీసీబీ బ్యాంక్​ సేవింగ్స్​ ఖాతాలో రూ. 1 లక్ష వరకు డిపాజిట్​ చేస్తే సంవత్సరానికి 2.75 శాతం వడ్డీ పొందవచ్చు. రూ. 4 లక్షల డిపాజిట్​పై సంవత్సరానికి 4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. రూ.5 లక్షల డిపాజిట్​పై 4.50 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. చివరగా రూ. 10 లక్షల డిపాజిట్​పై సంవత్సరానికి 5 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ప్రతి అడిషనల్​ డిపాజిట్‌తో, మెరుగైన రాబడిని పొందవచ్చు. ఆగస్టు 25, 2021 నాటికి డీసీబీ బ్యాంక్ సేవింగ్స్​ ఖాతా వడ్డీ రేట్లను పరిశీలిద్దాం.

Life and Health Insurence: లైఫ్​, హెల్త్​ను కవర్‌ చేసే వినూత్న టర్మ్ పాలసీ.. పూర్తి వివరాలివే..


డీసీబీ సేవింగ్స్​ ఖాతాపై వడ్డీ రేట్లు
డీసీబీ సేవింగ్స్​ ఖాతాలో రూ. 1 లక్ష వరకు ఉన్న బ్యాలెన్స్‌పై సంవత్సరానికి 2.75 శాతం వడ్డీ లభిస్తుంది. రూ. 1లక్ష నుంచి 2 లక్షల బ్యాలెన్స్‌పై సంవత్సరానికి 4 శాతం.. రూ. 2- 5 లక్షలలోపు బ్యాలెన్స్‌పై సంవత్సరానికి 4 శాతం, రూ. 5- 10 లక్షల లోపు బ్యాలెన్స్‌పై సంవత్సరానికి 4.50 శాతం వడ్డీ పొందవచ్చు.

రూ. 10- రూ. 25 లక్షల లోపు బ్యాలెన్స్‌పై సంవత్సరానికి 5 శాతం, రూ. 25- రూ. 50 లక్షల లోపు బ్యాలెన్స్‌పై సంవత్సరానికి 6 శాతం, రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ఉండే సేవింగ్స్ బ్యాంక్ బ్యాలెన్స్‌పై సంవత్సరానికి 6.50 శాతం వడ్డీ రేటు ఉంది. రూ. 1 కోటి నుంచి రూ. 10 కోట్ల వరకు బ్యాలెన్స్‌పై సంవత్సరానికి 6.75 శాతం.. రూ.10 కోట్లు, అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్‌పై సంవత్సరానికి 6.50 శాతం వడ్డీని కస్టమర్లు పొందవచ్చు.
Published by:Veera Babu
First published: