థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు మరింత పెరగనున్నాయి. ఈ మేరకు రోడ్లు, హైవేల మంత్రిత్వ శాఖ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI)తో కలిసి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మార్చి 4న విడుదలైంది. కొత్త ధరలు ఖరారు అయిన తర్వాత అమల్లోకి రానున్నాయి. గత రెండేళ్లలో మోటారు వాహనాల విభాగంలో బీమా ప్రీమియం పెంచడం ఇదే తొలిసారి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, అలాగే FY21లో ధరల పెంపు నిలిపివేయబడింది. MoRTH విడుదల చేసిన డ్రాఫ్ట్ ప్రకారం, క్యూబిక్ కెపాసిటీ (CC) 150 కంటే ఎక్కువ కానీ.. 350 కంటే తక్కువ ఉన్న ద్విచక్ర వాహనాలకు రూ. 1,366 థర్డ్-పార్టీ ప్రీమియం ప్రతిపాదించబడింది. 350cc కంటే ఎక్కువ ఇంజన్ ఉన్న బైక్‌లకు రూ. 2,804 ప్రీమియం ప్రతిపాదించబడింది.
డ్రాఫ్ట్ ప్రకారం 1,000 వరకు సీసీ ఉన్న ప్రైవేట్ ఫోర్-వీలర్ కార్లకు రూ. 2,094 చొప్పున వసూలు చేస్తారు. అయితే, 1,000-1,500 సీసీ ఇంజిన్ వాహనాలకు ఇది రూ. 3,416కి పెరుగుతుంది. 1,500సీసీ ఇంజన్‌కు మించిన కార్లకు, ప్రీమియం రూ.7,897గా ప్రతిపాదించారు. పబ్లిక్ వస్తువులను తీసుకువెళ్లడానికి ఉపయోగించే వాణిజ్య వాహనాలకు స్థూల వాహనం బరువు ఆధారంగా రూ. 16,049 నుండి రూ. 44,242 వరకు ప్రీమియం ఉంటుంది. ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం ప్రైవేట్ వస్తువులను తీసుకువెళ్లడానికి ఉపయోగించే వాణిజ్య వాహనాలకు అధిక ప్రీమియం 8,510 నుండి 25,038 వరకు ఉంటుంది.
EPF Rules: ఈపీఎఫ్ డబ్బులు డ్రా చేస్తున్నారా? ట్యాక్స్ రూల్స్ తెలుసుకోండి
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు కార్లు, అలాగే ఎలక్ట్రిక్ ప్యాసింజర్ మరియు వాణిజ్య వాహనాలపై 15 శాతం తగ్గింపును అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, డ్రాఫ్ట్ ప్రకారం.. కిలోవాట్ల రూపంలో పేర్కొన్న సామర్థ్యాన్ని బట్టి రూ. 457 నుండి రూ. 2,383 వరకు ప్రీమియం ఉండనుంది. ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్ల కోసం, వాటి సామర్థ్యాల ఆధారంగా ధర రూ. 1,780 నుండి రూ. 6,712 వరకు ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Insurance, Motor vehicle act