హోమ్ /వార్తలు /బిజినెస్ /

Third Party Insurance: వాహనదారులకు శుభవార్త.. ఆ ఇన్సూరెన్స్‌ ప్రీమియం ఛార్జీల పెంపు ఇప్పట్లో లేనట్లే..

Third Party Insurance: వాహనదారులకు శుభవార్త.. ఆ ఇన్సూరెన్స్‌ ప్రీమియం ఛార్జీల పెంపు ఇప్పట్లో లేనట్లే..

గత కొంత కాలంగా థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు పెరగనున్నాయనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మార్చి నెలాఖరులోగా కొత్త ప్రీమియం ఛార్జీలు అమల్లోకి వస్తాయని అంతా భావించారు. అయితే, ప్రాథమిక సమాచారం మేరకు ఇది నెలాఖరులోగా జరిగే అవకాశం లేదు.

గత కొంత కాలంగా థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు పెరగనున్నాయనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మార్చి నెలాఖరులోగా కొత్త ప్రీమియం ఛార్జీలు అమల్లోకి వస్తాయని అంతా భావించారు. అయితే, ప్రాథమిక సమాచారం మేరకు ఇది నెలాఖరులోగా జరిగే అవకాశం లేదు.

గత కొంత కాలంగా థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు పెరగనున్నాయనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మార్చి నెలాఖరులోగా కొత్త ప్రీమియం ఛార్జీలు అమల్లోకి వస్తాయని అంతా భావించారు. అయితే, ప్రాథమిక సమాచారం మేరకు ఇది నెలాఖరులోగా జరిగే అవకాశం లేదు.

ఇంకా చదవండి ...

  గత కొంత కాలంగా థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం(Premium) రేట్లు పెరగనున్నాయనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మార్చి నెలాఖరులోగా కొత్త ప్రీమియం ఛార్జీలు అమల్లోకి వస్తాయని అంతా భావించారు. అయితే, ప్రాథమిక సమాచారం మేరకు ఇది నెలాఖరులోగా జరిగే అవకాశం లేదు. దీంతో వాహన యజమానులకు లబ్ది చేకూరనుంది. అయితే, థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం(third Party insurance premium) ఛార్జీలపెంపు ఏప్రిల్‌ చివరి నాటికి పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు మార్చి 21న రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మ్యాండేటెడ్‌ మోటార్‌ వెహికల్‌ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ప్రీమియం రేట్లను ప్రతిపాదిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల మేరకు.. గెజిట్‌ ఆఫ్‌ ఇండియాలో నోటిఫికేషన్‌ ప్రచురించి, 30 రోజులు గడిచిన తర్వాత కొత్త రేట్లు, నిబంధనలు అమల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కొత్తగా తీసుకురానున్న ఈ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం.. మోటార్‌ థర్డ్‌ పార్టీ ప్రీమియం అండ్‌ లయబిలిటీ రూల్స్‌ ఫర్‌ ది ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2022-2023గా పేర్కొంది.

  Business Ideas: రైతులకు వరం.. ఈ పంటకు ఫుల్ డిమాండ్.. మార్కెట్లో మంచి రేటు.. లక్షల్లో ఆదాయం

  వెహికల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు రెండు రకాలు. ఒకటి ఓన్‌ డ్యామేజ్‌, రెండోది థర్డ్‌ పార్టీ లయబిలిటీ. ఓన్‌ డ్యామేజ్‌లో వాహనాలు ప్రమాదాల్లో దెబ్బతిన్నా, ఎవరైనా దొంగిలించినా ఇన్సూరెన్స్‌ లభిస్తుంది. థర్డ్‌ పార్టీ లయబిలిటీలో మూడో వ్యక్తులకు కవరేజ్‌ లభిస్తుంది. ఓన్‌ డ్యామేజ్‌ ఇన్సూరెన్స్‌ కచ్చితంగా చేయించుకోవాలనే నిబంధనలు ఏవీ లేవు. అయితే థర్డ్‌ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్‌ మాత్రం కచ్చితంగా చేయించాలి. ఈ ఇన్సూరెన్స్‌లకు చెల్లించాల్సిన ప్రీమియం.. ఖర్చు, క్లెయిమ్‌ చేసుకొనే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. మోటార్‌ థర్డ్‌ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్‌ కింద చాలా తక్కువగా క్లెయిమ్‌ను నాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు చెల్లిస్తున్నాయి. మరోవైపు కోట్లాది రూపాయలను ప్రీమియం కింద వసూలు చేస్తున్నాయి.

  ఈ క్రమంలోనే 2022-2023కి సంబంధించి ప్రీమియం పెంపును కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్రం తెలిపిన సమాచారం మేరకు.. ద్విచక్ర వాహనాలు, కార్ల యజమానులు చెల్లించాల్సిన ప్రీమియం తగ్గనుంది. అదే విధంగా ట్యాక్సీ, ట్రక్కులు, బస్‌ శ్రేణిలోకి వచ్చే వాహనాలపై ప్రీమియం పెరగనుంది. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కు 15 శాతం, హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌పై 7.5 శాతం ఇన్సూరెన్స్‌ ప్రీమియంను కేంద్రం ప్రతిపాదించింది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రదిపాదించిన ప్రీమియం రేట్లు మేరకు.. 75 సీసీ నుంచి 150 సీసీ మధ్య ఉన్న ద్విచక్ర వాహనాలకు ఏడాదికి రూ.714(ఇతర ఛార్జీలతో రూ.752) చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇతర విభాగాలకు చెందిన ద్విచక్ర వాహనాల ప్రీమియం పెరిగింది.మూడేళ్లు థర్డ్‌ పార్టీ కవర్‌తో కొన్న కొత్త కార్లు, ఐదేళ్లు థర్ట్‌ పార్టీ కవర్‌తో కొన్న కొత్త ద్విచక్ర వాహనాలకు కూడా ప్రీమియం పెరిగింది.

  ఏప్రిల్ చివరి నాటికి కొత్త ఛార్జీలుఅమల్లోకి..

  మోటార్‌ పోర్టిఫోలియోకు సంబంధించి భారీ నష్టాలను ఎదుర్కొంటున్నామని జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఇన్సూరెన్స్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా(IIB),స్టడీస్‌ బై ఇండస్ట్రీ లాబీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ చెప్పిన వివరాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్(General Insurance Council) ప్రచురించిన ఇండియన్ నాన్-లైఫ్ ఇండస్ట్రీ ఇయర్ బుక్ 2020-21 ప్రకారం.. జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఇండస్ట్రీకి మోటార్‌ ఇన్సూరెన్స్‌ కింద మొత్తం రూ. 67,389 కోట్లు ప్రీమియం అందింది. ఆ మెత్తాన్ని పెట్టుబడులు పెట్టి ఆదాయాన్ని కూడా ఇండస్ట్రీ పొందుతోంది. 2020-21లో చెల్లించిన మొత్తం క్లెయిమ్‌లు రూ.28,726 కోట్లు, వాహన డ్యామేజ్‌లకు రూ. 17,834 కోట్లు, థర్డ్ పార్టీ కవరేజ్‌కు రూ.10,892 కోట్లు చెల్లించగా.. మొత్తం రూ.30,854 కోట్లు మిగిలింది.

  Business Ideas: మట్టి అవసరం లేని పంట.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. నెలకు లక్షల్లో ఆదాయం

  సంవత్సరంలో సెటిల్ అయిన థర్డ్ పార్టీ క్లెయిమ్‌ల మొత్తం సంఖ్య 257,165 గా ఉంది.2019-20కి చెల్లించిన మొత్తం క్లెయిమ్‌ల విలువ రూ.38,071 కోట్లు , వెహికల్‌ డ్యామేజ్‌కు రూ.20,552 కోట్లు, థర్డ్ పార్టీ కవరేజ్‌కు రూ.17,519 కోట్లు చెల్లించాయి. మొత్తంగా మిగిలింది రూ.30,880 కోట్లు. కాగా, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండానే పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపై నడుస్తున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ.. చేసిన పాలసీలపై మాత్రమే వారు క్లెయిమ్‌లు చెల్లిస్తారు. ఉల్లంఘించిన వారికి జరిమానా విధించే బాధ్యత పోలీసులదే కాబట్టి.. అది ఆ సంస్థలను ఎలా ప్రభావితం చేస్తుందని అడిగితే వారి వద్ద సమాధానం లేదు.

  First published:

  Tags: Central Government, General insurance, Premium, Traffic challan

  ఉత్తమ కథలు