Business Ideas: పెట్టుబడి రూ.25వేలు.. నెలకు రూ.1.5 లక్షల ఆదాయం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas: కొన్ని వ్యాపారాల్లో కనిపించని లాభాలు ఉంటాయి. అంత సంపాదించవచ్చని కూడా చాలా మందికి తెలియదు. అలాంటి ఓ వ్యాపార ప్లాన్ ఇది.

  • Share this:
    Business Ideas: ప్రజలు రోజువారీ తినే స్నాక్స్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు అని చాలా మందికి తెలియదు. అటుకులతో తయారుచేసే స్నాక్ పోహా (Poha - అటుకులు). దాదాపు పులిహోర లాగా ఉంటుంది. ఇదంతా ఉత్తరాది రాష్ట్రాల వారికి విపరీతమైన ఇష్టం. ఇందులో ఇడ్లీ చెట్నీ వేసుకొని ఆనందంగా తింటారు. క్రమంగా ఇది సౌత్ ఇండియా మొత్తం పాకింది. ఇప్పుడు ఇండియా మొత్తం ఇది డైలీ సాయంత్రం స్నాక్‌లా, ఉదయం టిఫిన్‌లా తింటున్నారు. అందువల్ల అటుకుల తయారీ వ్యాపారం చేస్తే మంచి లాభాలు ఉంటాయి. అందుకు ఏం చెయ్యాలో, ఎలా ప్లాన్ వేసుకోవాలో చూద్దాం.

    తక్కువ పెట్టుబడి:
    ఇలాంటి వ్యాపారాలకు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) ప్రోత్సాహం ఫుల్లుగా ఉంటుంది. బియ్యంతోనే అటుకులు తయారవుతాయని మనకు తెలుసు. ఇందుకోసం పోహా మిల్ సెటప్ చేసుకోవాలి. ఇందుకు రూ.2.43 లక్షలు ఖర్చవుతుంది. ఐతే... మీరు అంత ఖర్చు చెయ్యాల్సిన పని లేదు. చిన్న పరిశ్రమలకు ఆర్థిక సాయం కింద ప్రభుత్వం మీకు 90 శాతం లోన్ ఇస్తుంది. అందువల్ల మీరు రూ.25వేల పెట్టుబడి పెడితే సరిపోతుంది.

    అటుకుల తయారీ వ్యాపారం


    ఏయే యంత్రాలు కావాలి:
    ఈ మిల్లు కోసం ఎక్కువ స్థలం అవసరం లేదు. 500 చదరపు అడుగుల్లోనే మిల్లు సెట్ చేసుకోవచ్చు. ఈ యూనిట్ కోసం రూ.లక్ష ఖర్చవుతుంది. దీంతోపాటూ పోహా తయారీ యంత్రం, ఫర్నేస్, సీమ్స్, ప్యాకింగ్ యంత్రం, డ్రమ్ వంటివి కావాలి. ఇవన్నీ కలిపి మరో రూ.లక్ష అవుతాయి. అదనంగా వర్కింగ్ క్యాపిటల్ కింద రూ.43,000 నుంచి రూ.50,000 దాకా అవుతాయి.

    ఇది కూడా చదవండి: Business Ideas: ఆ ఘటనే మార్చేసింది... ఓ మహిళ విజయ గాథ

    లోన్ ఎలా పొందాలి:
    లోన్ పొందే ముందు... మీకు మీరుగా ఈ వ్యాపార ప్రాజెక్టు రిపోర్ట్ రెడీ చేసుకోవాలి. ఆ రిపోర్టుతో... విలేజ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ కింద లోన్ కోసం అప్లై చేసుకోవాలి. KVIC వారు రిపోర్టును చూసి... మీరు ఆసక్తిగా ఉన్నారని గ్రహించి.. లోన్ ఇచ్చి... బిజినెస్ ఎలా ప్రారంభించాలో, యంత్రాలు ఎలా కొనాలో, ఏం చెయ్యాలో అన్నీ చెబుతారు.

    లాభాలు ఎలా ఉంటాయి?
    వ్యాపారం ప్రారంభించాక... అటుకుల తయారీ కోసం... ముడి సరుకు కొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు వెయ్యి క్వింటాళ్ల పోహా తయారుచేసి అమ్మితే... మీకు ఆదాయం రూ.10 లక్షల దాకా వస్తుంది. అందులో మీరు తీసుకున్న లోన్, ముడి సరుకు కొనుగోళ్లు, సిబ్బందికి జీతాలు, కరెంటు ఇలా అన్నింటికీ కలిపి ఖర్చులు రూ.8.60 లక్షల దాకా అవుతాయి. ఆదాయం నుంచి ఖర్చులు పోగా మీకు రూ.1.40 లక్షల లాభం వస్తుంది.

    విస్తరణ:
    అటుకులు త్వరగా పాడవ్వవు. అందువల్ల దేశంలోని ఏ ప్రాంతానికైనా వాటిని సప్లై చెయ్యవచ్చు. సూపర్ మార్కెట్లలో వాటిని ఎక్కువ ధరకు కొనుక్కుంటారు. వాళ్లతో డీల్ మాట్లాడుకొని వారికి సప్లై చెయ్యవచ్చు. అలాగే డోర్ డెలివరీ కింద ఇళ్లకు సప్లై చెయ్యవచ్చు. తక్కువ రేటుకు ఇస్తారు కాబట్టి... వాళ్లు మీ దగ్గరే కొంటారు. అలాగే... ఆలయాల్లో అటుకుల ప్రసాదం ఇస్తుంటారు. అలాంటి చోట... ఈ అటుకులను అమ్మితే... మంచి లాభాలు పొందవచ్చు. ఇక షాపులకు కూడా తక్కువ రేటుకి ఎక్కువ సరుకు వేసి... మంచి లాభాలు రాబట్టవచ్చు. వీళ్లతోపాటూ... ముంతలో మిక్స్చర్ అమ్మేవాళ్లతో డీల్ కుదుర్చుకుంటే... వ్యాపారం బాగా పెరుగుతుంది.

    ఇది కూడా చదవండి: Business Ideas: సరికొత్త ఆలోచన.. నెలకు రూ.2.5 లక్షల సంపాదన

    (Disclaimer: The material provided on this page is for information purposes only and should not be understood as an investment advice. Any opinion that may be provided on this page does not constitute a recommendation by telugu.news18.com We do not make any representations or warranty on the accuracy or completeness of the information that is provided on this page. If you rely on the information on this page then you do so entirely on your own risk.)
    Published by:Krishna Kumar N
    First published: