Home /News /business /

THINGS TO BE NOTICED BEFORE FILLING YOUR TAX RETURNS UMG GH

ITR: ట్యాక్స్ ఫైల్ చేసే ముందు ఇవి కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆదాయపన్ను(IT) విభాగం ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో 2022-23 (2021-22 ఆర్థిక సంవత్సరానికి) టాక్స్‌ ఫైలింగ్ గత వారం ప్రారంభమైంది. రిటర్న్‌లను దాఖలు చేయడానికి తుడి గడువు జులై 31. ట్యాక్స్ రిటర్న్ ముందుగానే ఫైల్‌ చేయడం వల్ల పన్నులను సరిగ్గా ఫైల్ చేయడానికి తగినంత సమయం లభిస్తుంది.

ఇంకా చదవండి ...
ఆదాయపన్ను(IT) విభాగం ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో 2022-23 (2021-22 ఆర్థిక సంవత్సరానికి) టాక్స్‌ ఫైలింగ్ గత వారం ప్రారంభమైంది. రిటర్న్‌లను దాఖలు చేయడానికి తుడి గడువు జులై 31. ట్యాక్స్ (Tax) రిటర్న్ ముందుగానే ఫైల్‌ చేయడం వల్ల పన్నులను సరిగ్గా ఫైల్ చేయడానికి తగినంత సమయం లభిస్తుంది. ముందు సంబంధిత పత్రాలు సేకరించడం ప్రధానం. వాటిలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా అదనపు సమాచారం కోరుతూ ITR ఫారమ్‌లలో అనేక మార్పులు చేశారు.

ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు జీతం ఆదాయం వివరణాత్మక విభజనను ఇవ్వాలి. జీతం, జీతానికి బదులుగా లాభాలు, అనుమతులు, మినహాయింపు అలవెన్సులు, తగ్గింపులను పేర్కొనాలి. దీని గురించి క్లియర్ వ్యవస్థాపకుడు, సీఈవో అర్చిత్ గుప్తా మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ఫారమ్ 16 కొత్త ఫార్మాట్‌ను నోటిఫై చేసింది, దీనిలో శాలరీ డివిజన్‌ను యజమాని తప్పకుండా పేర్కొనాలి’ అని తెలిపారు. యజమానికి అన్ని పన్ను ఆదా పెట్టుబడి రుజువులను సమర్పించని వారు ఏదైనా పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయడానికి సంబంధిత పత్రాలను స్వయంగా సేకరించాలి.

పీఎఫ్‌పై వడ్డీ
ప్రస్తుత అసెస్‌మెంట్ సంవత్సరంలో మొదటిసారి పన్ను చెల్లింపుదారులు తమ ప్రావిడెంట్ ఫండ్(PF) ఖాతాలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్‌లపై పొందిన వడ్డీని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు చేసిన కంట్రిబ్యూషన్‌లకు ఈ థ్రెషోల్డ్ వర్తిస్తుంది. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF)కి చేసిన కాంట్రిబ్యూషన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ లిమిట్ రూ.5 లక్షలు.

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) రూ.2.5 లక్షల కంటే ఎక్కువ కంట్రిబ్యూట్‌ చేసే సభ్యుల కోసం రెండు వేర్వేరు ఖాతాలు- పన్ను విధించని, పన్ను విధించే ఖాతాలను నిర్వహిస్తుంది. తరువాత వచ్చిన వడ్డీపై పన్నును లెక్కిస్తుంది. EPFO మార్గదర్శకాల ప్రకారం.. EPF ఖాతాలకు PAN లింక్ చేసిన వార్షిక వడ్డీపై 10% TDS వర్తిస్తుంది. అయితే పాన్ లింక్ చేయని పక్షంలో TDS 20% ఉంటుంది. TDS మొత్తం రూ.5,000 వరకు ఉంటే, EPFO వచ్చే వడ్డీపై పన్నును తీసివేయదని పన్ను చెల్లింపుదారులు గమనించాలి. అదనపు వడ్డీని ఇతర సోర్సెస్‌ నుంచి వచ్చే ఆదాయం కింద సూచించాలి. TDS తీసివేయకపోతే, అది మొత్తం ఆదాయానికి యాడ్‌ అవుతుంది, స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను విధిస్తారు.

ఇదీ చదవండి: జాయింట్‌ హోమ్‌ లోన్‌ తీసుకుంటున్నారా..? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..


క్యాపిటల్‌ గెయిన్స్‌
ఆర్థిక సంవత్సరం 2021-22లో భవనం లేదా భూమిని విక్రయించిన పన్ను చెల్లింపుదారులు ఈ సంవత్సరం నుంచి వచ్చిన విక్రయానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ITR ఫారమ్‌లోని దీర్ఘకాలిక మూలధన లాభాల(LTCG) సెక్షన్ కింద, పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఆస్తి అమ్మకం, కొనుగోలు తేదీ రెండింటినీ తప్పనిసరిగా ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ నుండి ఎల్‌టీసీజీ అనేది.. పన్ను చెల్లింపుదారుడు 24 సంవత్సరాలకు పైగా ఆస్తిని కలిగి ఉన్నప్పుడు వర్తిస్తుంది. సెక్షన్ 54 (రెసిడెన్షియల్ ప్రాపర్టీలో పెట్టుబడి, రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మకపు ఆదాయం), 54EC(ప్రభుత్వ నిర్దేశిత బాండ్లలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మకం ఆదాయం), 54F(రెసిడెన్షియల్ ప్రాపర్టీలో నాన్-రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మకం ఆదాయం) ప్రకారం పన్ను మినహాయింపు అర్హత పొందుతుంది.

AIS రెన్యువల్
2021 నవంబర్‌లో యాన్యువల్‌ ఇన్‌ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ను తీసుకువచ్చారు. ఇందులో వివిధ వనరుల నుండి వచ్చే ఆదాయం, విదేశీ కరెన్సీ కొనుగోలు, TDS, TCS, ప్రభుత్వానికి చెల్లించిన ముందస్తు లేదా స్వీయ-అంచనా పన్ను సహా పన్ను చెల్లింపుదారు అన్ని ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని ప్రకటించాలి. AISలో పేర్కొన్న వివరాలను IT విభాగం పరిశీలిస్తుంది కాబట్టి.. పన్ను చెల్లింపుదారులు TDS సర్టిఫికేట్లు, వడ్డీ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఫారమ్ 26ASతో AISలో ఇచ్చిన అన్ని ఆదాయాలను క్రాస్ చెక్ చేయడం ముఖ్యం.

AISలోని ఏదైనా సమాచారం తప్పు అని పన్ను చెల్లింపుదారు విశ్వసిస్తే, ITR ఫైల్ చేసే ముందు లోపాన్ని సరిదిద్దడానికి వారు IT విభాగానికి ఫీడ్‌బ్యాక్‌ సమర్పించాలి. ఏదైనా వివాద పరిష్కారానికి 1-2 వారాలు పట్టవచ్చు. కాబట్టి ITR ఫైలింగ్ గడువులో డిఫాల్ట్ కాకుండా ఉండేందుకు ఏదైనా సమస్య ఉంటే.. వెంటనే సంబంధిత శాఖను సంప్రదించాలి.
Published by:Mahesh
First published:

Tags: Income tax, ITR, ITR Filing, Taxes

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు