IRCTC... ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అంట్ టూరిజం కార్పొరేషన్. ఈ సంస్థ గురించి తెలియనివాళ్లుండరు. రైలు టికెట్ బుక్ చేయాలంటే మొదట గుర్తొచ్చేది ఐఆర్సీటీసీ. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఐఆర్సీటీసీ ఇటీవల సాంకేతికంగా అనేక మార్పులు తీసుకొస్తోంది. కొన్ని రోజుల క్రితమే వెబ్సైట్, యాప్ ఇంటర్ఫేస్ మార్చింది. అధికారిక వెబ్సైట్(www.irctc.co.in)ని టీఎల్ఎస్ 1.2కి మార్చుతున్నందున ఇకపై విండోస్ ఎక్స్పీ, విండోస్ సర్వర్ 2003 ఉన్నవాళ్లు వెబ్‌సైట్‌ని ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. వెబ్సైట్లో సెక్యూరిటీ ఫీచర్స్ పెంచేందుకే ఐఆర్సీటీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విండోస్ ఎక్స్పీ, సర్వర్ 2003 ఉన్నవాళ్లు తమ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని అప్‌గ్రేడ్ చేస్తేనే ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఉపయోగించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Flipkart Republic Day Sale: ఈ 15 స్మార్ట్ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్స్
WHATSAPP BUG: వాట్సప్‌లో మీ మెసేజెస్ మాయం... ఎందుకో తెలుసా?
మరోవైపు ఐఆర్సీటీసీ ప్లాట్‌ఫామ్‌పై ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నవారికి రూ.50 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉచితంగా ఇస్తున్నట్టు ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఇది డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణికులకు వర్తిస్తుంది. విమాన ప్రయాణికులు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబాలకు, ప్రమాదంలో వైకల్యం బారినపడితే ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఈ స్కీమ్ ప్రకటించింది ఐఆర్సీటీసీ. భారతీ ఆక్సా జెనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి ఈ పథకాన్ని ప్రకటించింది. ప్రయాణికుల తరఫున ఐఆర్‌సీటీసీనే ప్రీమియం చెల్లిస్తుంది.
ఇవి కూడా చదవండి:
Amazon vs Flipkart: పోటాపోటీగా సేల్స్... ఆఫర్లు ఇవే తెలుసుకోండి
మొబైల్ బ్యాంకింగ్ చేస్తున్నారా? ఈ 12 టిప్స్ మీ కోసమే