Jobs | మన దేశంలో చాలా రోజుల నుంచి కొత్త కార్మిక చట్టాల (New Wage Code) గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ కొత్త చట్టాలు అమలులోకి వస్తే.. వారానికి నాలుగు రోజుల పని విధానం (New Labour Code) అందుబాటులోకి వస్తుందని చాలా మంది చెబుతున్నారు. అంటే మూడు రోజులు సెలవులు లభిస్తాయి. ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయని మనం చదువుతూనే ఉంటాం. అయితే ఈ రూల్స్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో కచ్చితంగా తెలీదు.
కానీ యూకేలో మాత్రం వారానికి మూడు రోజులు సెలవులు, నాలుగు రోజుల పని విధానం అమలులోకి వచ్చింది. ఏకంగా 100 యూకే కంపెనీలు ఈ విధానానికి అంగీకారం తెలిపాయి. శాశ్వతంగా వారానికి నాలుగు రోజుల పని విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అంతేకాకుండా ఉద్యోగులకు ఇప్పుడు ఎంత వేతనం వస్తోందో కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత కూడా అంతే జీతం రానుంది. అంటే ఉద్యోగుల వేతనాల్లో కోత ఉండదు. కానీ పని గంటలు తగ్గుతాయి.
డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. సామాన్యులకు గుడ్ న్యూస్? వారిపై ఎఫెక్ట్!
ఈ 100 కంపెనీల్లో దాదాపు 2,600 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ కంపెనీలు తీసుకున్న నిర్ణయం వల్ల బ్రిటన్‌లో ఐదు రోజుల పని విధానంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక ఈ వ్యవస్థ క్రమక్రమంగా కనుమరుగు కావొచ్చు. ఇతర కంపెనీలు అన్నీ కూడా వీటి దారిలోనే పయనించే అవకాశం ఉంది.
ఏటీఎం కార్డు ఉంటే ఉచితంగా రూ.10 లక్షల వరకు బెనిఫిట్.. వివరాలు ఇలా!
వారానికి నాలుగు రోజుల పని విధానం వల్ల ఉత్పాదకత కూడా పెరుగుతుందని కంపెనీలు పేర్కొంటున్నాయి. అంటే తక్కువ పని దినాల్లో ఒకే రకమైన ఔట్పుట్ ఉంటుందని తెలియజేస్తున్నాయి. ఆటమ్ బ్యాంక్, అవిన్ అనే రెండు పెద్ద కంపెనీలు కూడా వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేయనుంది.
ఈ ఏడాది జూన్‌లో దాదాపు 70 యూకే కంపెనీలు వారానికి నాలుగు రోజుల పని విధనాన్ని ట్రయల్ బేసిస్‌గా అమలు చేశాయి. ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లించాయి. ఆరు నెలల పాటు కొనసాగిన ఈ పైలెట్ ప్రాజెక్ట్‌లో వేల మంది ఉద్యోగులు పని చేశారు. స్థానిక షాపుల నుంచి పెద్ద పెద్ద ఫైనాన్షియల్ కంపెనీల వరకు చాలా సంస్థలు ఈ పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహించాయి. ఈ విధానంలో ఉత్పాదకన పెరిగినట్లు వెల్లడి అయ్యింది. అంతేకాకుండా ఐలాండ్‌లో వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేశారు. ఇక్కడ కూడా ఇది సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో చాలా కంపెనీలు ఈ దారిలో పయనించే అవకాశం ఉందని రీసెర్చర్లు పేర్కొంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Employees, New Labour Codes, Salary Hike