టాటా, బిర్లా అంటే ఒకప్పుడు ఐశ్వర్యానికి ప్రతీక, దేశ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రెండు గ్రూపులకు చెందిన కంపెనీలు తొలితరం కార్పోరేట్ కంపెనీలుగా నిలిచాయి. అంతేకాదు అటు మదుపరులకు కూడా ఈ రెండు కంపెనీలకు చెందిన స్టాక్స్ డబ్బులు కురుపిస్తున్నాయి. అయితే రాను రాను స్టాక్ మార్కెట్లో అనేక కొత్త కంపెనీలు ఈ రెండు కంపెనీ గ్రూపుల కన్నా కూడా మంచి రాబడి అందిస్తున్నాయి. అయితే ఇప్పటికి కూడా ఈ రెండు కంపెనీలకు చెందిన కొన్ని స్టాక్స్ మల్టీ బ్యాగర్లుగా నిలిచాయి. టాటా, బిర్లా గ్రూపులకు చెందిన రెండు కంపెనీల షేర్లు తమ ఇన్వెస్టర్లకు నోట్ల వర్షం కురిపించాయి. ఆఖరికి గత ఏడాదిలో సైతం ఈ రెండు స్టాక్స్ తమ పెట్టుబడిదారులకు ఏకంగా 2700 శాతం కన్నా కూడా ఎక్కువ రాబడిని అందించాయి.
TTML షేర్లపై భారీ రిటర్న్స్
ముంబైకి చెందిన టెలికమ్యూనికేషన్స్ , క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అయిన టాటా టెలిసర్వీసెస్ మహారాష్ట్ర లిమిటెడ్ (TTML) షేరు గత ఏడాది కాలంలో 2,714.97% రాబడిని ఇచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో కంపెనీ షేరు ధర ఏడాది క్రితం రూ.9.35 మాత్రమే. గత శుక్రవారం కంపెనీ షేరు రూ.263.20 వద్ద ముగిసింది.
Xpro ఇండియా షేర్‌పై భారీ రిటర్న్
బిర్లా గ్రూప్‌కు చెందిన పాలిమర్ ప్రాసెసింగ్ కంపెనీ ఎక్స్‌ప్రో ఇండియా వాటా గత ఏడాది కాలంలో 2,743.40% రాబడిని అందించాయి. ఏడాది క్రితం కంపెనీ షేరు ఇదే నెలలో ధర రూ. 38.25. 7, ప్రస్తుతం షేర్ ధర రూ.1,087.60కి పెరిగింది.
Xpro ఇండియా బిర్లా గ్రూప్‌కి చెందిన చిన్న కంపెనీ. ఇది ప్రధానంగా లైనర్‌ల కోసం ప్యాకేజింగ్ మెటీరియల్‌ను , రిఫ్రిజిరేటర్‌ల కోసం కెపాసిటర్‌లను తయారు చేస్తుంది. భారతదేశంలో ఈ రకమైన పనిని చేస్తున్న ఏకైక సంస్థ ఇది , దీనికి పోటీదారులు లేకపోవడం గమనార్హం.
రెండు స్టాక్స్ ఇంకాం బుల్లిష్‌గా ఉన్నాయి
రెండు కంపెనీల షేర్లు ఇప్పటికీ బుల్లిష్‌గా ఉన్నాయి. ఈ స్టాక్స్ మరింత పెరగవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. రెండు కంపెనీల బ్యాలెన్స్ షీట్లు చాలా బలంగా ఉండటమే ఇందుకు కారణం. TTML ఒక పెన్నీ స్టాక్ అయితే Xpro ఇండియా కూడా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. సాధారణంగా, ఈ రకమైన స్టాక్‌లో చాలా అస్థిరత కనిపిస్తుంది. అయితే ఈ తరహా వాటిలో పెట్టుబడి పెట్టే ముందు సలహాదారుని సంప్రదించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Multibagger stock, Stock Market, Tata Group