హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mutual Fund SIP: 3 ఏళ్లలోనే చేతికి రూ.9 లక్షలు.. ఈ 2 మ్యూచువల్ ఫండ్స్‌తో భారీ లాభాలు!

Mutual Fund SIP: 3 ఏళ్లలోనే చేతికి రూ.9 లక్షలు.. ఈ 2 మ్యూచువల్ ఫండ్స్‌తో భారీ లాభాలు!

 Mutual Fund SIP: 3 ఏళ్లలో చేతికి రూ.9 లక్షలు.. ఈ 2 మ్యూచువల్ ఫండ్స్‌తో భారీ లాభాలు!

Mutual Fund SIP: 3 ఏళ్లలో చేతికి రూ.9 లక్షలు.. ఈ 2 మ్యూచువల్ ఫండ్స్‌తో భారీ లాభాలు!

SIP | మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. రెండు ఫండ్స్ అదిరే రాబడిని ఇచ్చాయి. మూడేళ్ల కాలంలోనే కళ్లుచెదిరే ప్రాఫిట్ అందించాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

MF SIP| దీర్ఘకాలంలో అధిక రాబడి అందించే ఫండ్స్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) ముందు వరుసలో ఉంటాయని చెప్పుకోవచ్చు. చాలా మంది వీటిల్లో డబ్బులు పెడుతూ ఉంటారు. దీర్ఘకాల లక్ష్యాలు కలిగిన వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (MF) బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే డబ్బులు పెట్టే వారు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. వీటిల్లో కూడా రిస్క్ ఉంటుంది. అందువల్ల రిస్క్ తీసుకునే వారు మాత్రమే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లొచ్చు. ద్రవ్యోల్బణం కన్నా అధిక రాబడి పొందాలని భావించే వారు ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వాల్యూ రీసెర్చ్ 5 స్టార్ రేటింగ్ కలిగిన రెండు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించాయి. మూడేళ్ల కాలంలో రూ.లక్ష ముందుస్తు పెట్టుబడితో నెలకు రూ. 10 వేల సిప్‌ను రూ. 9 లక్షలుగా మార్చాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.

జనాలు ఎక్కువగా కొంటున్న టాప్ 10 బైక్స్‌ ఇవే.. వీటి క్రేజ్ వేరే లెవెల్!

కెనరా రొబెకో స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ 2019 ఫిబ్రవరి నెలలో మార్కెట్‌లోకి వచ్చింది. అంటే ఈ ఫండ్ వచ్చి 3 ఏళ్ల 8 నెలలు అయ్యింది. 2022 సెప్టెంబర్ 30 నాటికి ఈ ఫండ్ ఏయూఎం విలువ రూ. 3767 కోట్లుగా ఉంది. 2022 అక్టోబర్ 28 నాటికి ఈ ఫండ్ ఎన్ఏవీ రూ. 26.17. గత ఏడాది కాలంలో ఈ ఫండ్ 12.7 శాతం రాబడిని ఇచ్చింది. అదే ఫండ్ ఆరంభం నుంచి చూస్తే దాదాపు 30 శాతం ప్రాఫిట్ అందించింది. సిటీ యూనియన్ బ్యాంక్, సెరా శానిటరీవేర్, ఇండియన్ హోటల్స్, సెంచురీ టెక్స్‌టైల్స్ వంటి స్టాక్స్‌లో ఈ ఫండ్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది.

రూ.10 లక్షల కన్నా తక్కువ ధరకే లభిస్తున్న టాప్ ఎస్‌యూవీ కార్లు ఇవే!

అలాగే క్వాంట్ ట్యాక్స్ ప్లాన్ డైరెక్ట్ ప్లాన్ కూడా అదిరే రాబడి ఇచచింది. ఈ ఫండ్ 2000 మార్చి నుంచే అందుబాటులో ఉంది. 2022 సెప్టెంబర్ చివరి నాటికి ఈ ఫండ్ ఏయూఎం రూ. 1943 కోట్లు. 2022 అక్టోబర్ 28 నాటికి ఈ ఫండ్ ఎన్ఏవీ రూ. 267గా ఉంది. ఈ ఫండ్ ఆరంభం నుంచి చూస్తే 21 శాతం రాబడిని ఇచ్చింది. గత ఏడాది కాలంలో అయితే 17 శాతం దాకా ప్రాఫిట్ ఇచ్చింది. ఈ ఫండ్ అంబుజా సిమెంట్, ఐటీసీ, ఎస్‌బీఐ , అదానీ పోర్ట్స్ వంటి స్టాక్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది.

First published:

Tags: Money, Mutual Funds, SIP, Stock Market

ఉత్తమ కథలు