Good News: ఏప్రిల్ 1 నుంచి ధరలు తగ్గేవి ఇవే...

Good News | కొద్ది రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్‌ను 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించింది ఆర్‌బీఐ. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గించనున్నాయి.

news18-telugu
Updated: March 31, 2019, 8:18 AM IST
Good News: ఏప్రిల్ 1 నుంచి ధరలు తగ్గేవి ఇవే...
Good News: ఏప్రిల్ 1 నుంచి ధరలు తగ్గేవి ఇవే...
news18-telugu
Updated: March 31, 2019, 8:18 AM IST
కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభం అవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం సామాన్యులకు శుభంగా మొదలుకానుంది. ఏప్రిల్ 1 నుంచి సామాన్యుడిపై భారం తగ్గించే, లాభం చేకూర్చే నిర్ణయాలు అమలులోకి వస్తాయి. అయితే సామాన్యులకు భారం కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. మరి ఏప్రిల్ 1 నుంచి సామాన్యుడి జేబుకు ఊరట కలిగించే అంశాలేవో? మరింత భారం మోపేవి ఏంటో తెలుసుకోండి.

సామాన్యుడికి లాభం చేకూర్చేవి ఇవే...


తగ్గనున్న ఇళ్ల ధరలు: ఏప్రిల్ 1 నుంచి ఇళ్ల ధరలు తగ్గనున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. గతంలో నివాస గృహాలపై 12% ఉన్న జీఎస్టీని 5% శ్లాబ్‌లోకి తీసుకొచ్చింది జీఎస్టీ కౌన్సిల్. అదే రూ.45 లక్షల లోపు ఇంటిపై 8% ఉన్న జీఎస్టీని 1% చేయడం మరో శుభవార్త. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల దూరం కాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇల్లు కొనాలనుకునేవారికి కొత్త ఆర్థిక సంవత్సరం భారాన్ని కాస్త తగ్గించనుంది.

తగ్గనున్న బీమా ప్రీమియం: ఏప్రిల్ 1 నుంచి ఇన్స్యూరెన్స్ ప్రీమియం భారం కూడా తగ్గనుంది. ముఖ్యంగా 22 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్నవారికి ఈ ప్రయోజనాలు లభిస్తాయి. ఇప్పటివరకు ఇన్స్యూరెన్స్ ప్రీమియంను నిర్ణయించేందుకు 2006-08 నాటి మరణాల రేటును పరిగణలోకి తీసుకుంటున్నాయి ఇన్స్యూరెన్స్ కంపెనీలు. ఇకపై 2012-2014 నాటి మరణాల రేటు బట్టి ఇన్స్యూరెన్స్ ప్రీమియంను నిర్ణయిస్తాయి. దీంతో ఇన్స్యూరెన్స్ ప్రీమియం తగ్గుతుంది.

లోన్లపై తగ్గనున్న వడ్డీ: కొద్ది రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్‌ను 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించింది ఆర్‌బీఐ. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గించనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు అమలులోకి వస్తాయి. బ్యాంకులు రుణాలు ఇచ్చేప్పుడు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్(MCLR) ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. రెపో రేట్ తగ్గింది కాబట్టి MCLR కూడా తగ్గుతుంది. అంతేకాదు... ఇప్పటికే ఉన్న రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి.



Read this: March 31 Deadline: మార్చి 31 లోగా పూర్తిచేయాల్సిన 10 ముఖ్యమైన పనులివే...

ధరలు పెరిగేవి ఇవే...

Loading...
ధరలు పెరగనున్న కార్లు: టాటా మోటార్స్, రెనాల్ట్ ఇండియా, జాగ్వార్ ల్యాండ్‌రోవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, టొయోటా మోటార్స్ లాంటి కంపెనీలన్నీ తమ కార్లపై ధరల్ని పెంచుతున్నాయి. తయారీ ఖర్చు పెరగడం, ఇతర ఆర్థిక కారణాల వల్ల ధరల్ని పెంచుతున్నట్టు ఆయా కంపెనీలు ప్రకటించాయి.

సీఎన్జీ ధరల పెంపు: సీఎన్జీ వాహనాలు వాడుతున్నవారికి ఇక అదనపు భారం తప్పదు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.

పీఎన్జీ ధరల పెంపు: సీఎన్జీతో పాటు కిచెన్లకు సప్లై చేసే పీఎన్జీ ఇంధనం ధరలు కూడా పెరగనున్నాయి.

Photos: బజాజ్ నుంచి కొత్త ఫోర్‌వీలర్... క్వాడ్రిసైకిల్ క్యూట్

ఇవి కూడా చదవండి:

ONGC Jobs: ఓఎన్జీసీలో 785 ఖాళీలు... వివరాలివే

PM-Kisan Scheme: ఏప్రిల్ 1 నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు

WhatsApp: మీ వాట్సప్‌ని తెలుగులోకి ఇలా మార్చండి
First published: March 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626