Multibagger stocks: ఈ షేర్లు కొని ఉంటే కోటీశ్వరులే...1000 శాతం లాభపడిన మల్టీ బ్యాగర్లు ఇవే...

దేశీయ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరగడం, ఎర్నింగ్స్ రికవరీ, ఎమర్జింగ్ మార్కెట్లలో భారత్ పట్ల ఉన్న ఆకర్షణ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం కూడా మార్కెట్ పెరిగేందుకు సానుకూలంశాలుగా ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

news18-telugu
Updated: March 30, 2019, 4:05 PM IST
Multibagger stocks: ఈ షేర్లు కొని ఉంటే కోటీశ్వరులే...1000 శాతం లాభపడిన మల్టీ బ్యాగర్లు ఇవే...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 30, 2019, 4:05 PM IST
ఈ ఆర్థిక సంవత్సరం దేశీయ మార్కెట్ల ప్రయాణం చూస్తే కాస్త ఆశాజనకంగానే కనిపిస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి సెన్సెక్స్ కదలికలు గమనిస్తే శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 17 శాతం పెరుగుదల నమోదు చేసినట్లు కనిపిస్తోంది. నిజానికి గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాలతో పోల్చి చూస్తే ఈ పెరుగుదల రెండో అత్యుత్తమ ప్రదర్శనగా పేర్కొనవచ్చు. 2015 ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ 24.89శాతం పెరుగుదల నమోదు చేసింది.

మరోవైపు ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు మాత్రం నష్టాలను మూట కట్టుకోవడం గమనర్హం. స్మాల్ క్యాప్ సూచీ 12 శాతం నష్టపోతే, మిడ్ క్యాప్ సూచీ 5 శాతం నష్టపోయింది.

ముఖ్యంగా వేల్యూయేషన్స్ క్రమేపీ తగ్గడంతో పాటు, గ్లోబల్ ట్రేడ్ వివాదాలు, భారత్ - పాకిస్థాన్ నడుమ నెలకొన్న టెన్షన్స్, మ్యూచువల్ ఫండ్స్ రీకేటగిరీ చేయాలని సెబీ ఆదేశం, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల్లో అవకతవకలు ఇన్వెస్టర్ల సెంటింమెంట్ ను దెబ్బతీశాయి.

ఇదిలా ఉంటే సూచీలోని టాప్ 100 స్టాక్స్ లో 57 స్టాక్స్ మార్కెట్ క్యాప్ పరంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగింది. లార్జ్ క్యాప్స్‌లో బజాజ్ ఫైనాన్స్ ఈ ఆర్థిక సంవత్సరం 66 శాతం లాభపడి టాప్ గెయినర్ గా నిలిచింది. అలాగే దివీస్ ల్యాబ్స్ కూడా 53శాతం లాభపడింది. అలాగే హవేల్స్ (52 శాతం), రిలయన్స్ ఇండస్ట్రీస్ (50 శాతం), టొరెంట్ ఫార్మా 50 శాతం, యాక్సిస్ బ్యాంక్ (49 శాతం) 2018-19 ఆర్థిక సంవత్సరంలో లాభపడి టాప్ గెయినర్లు నిలిచాయి.అదే సమయంలో టాటా మోటార్స్, ఐడీబీఐ బ్యాంక్, న్యూఇండియా అష్యూరెన్స్, ఇండియా బుల్స్ హెచ్ఎఫ్, వేదాంత, మదర్‌సన్ సుమి, జనరల్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ 30 శాతం మేర పతనమై టాప్ లూజర్లుగా నిలిచాయి. ఇందులో టాటా మోటార్స్ ఏకంగా 46 శాతం నష్టపోయి ఇన్వెస్టర్ల సొమ్మును ఆవిరి చేసింది.

ఇక మిడ్ క్యాప్ విషయానికి వస్తే, అదానీ పవర్ ఏకంగా 107 శాతం లాభపడి టాప్ గెయినర్ గా నిలిచింది. అలాగే బాటా ఇండియా 93 శాతం, ఇన్ఫో ఎడ్జ్ ఇండియా 59 శాతం, టొరెంట్ ఫార్మా 57 శాతం, ఫైజర్ లిమిటెడ్ 52 శాతం లాభపడ్డాయి.

అదే సమయంలో మిడ్ క్యాప్ స్పేస్‌లో వోడాఫోన్ ఐడియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్, పీఎన్బీ హౌజింగ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎన్బీసీసీ 65 శాతం మేర నష్టపోయాయి.

ఇక ఈ ఆర్థిక సంవత్సరం స్మాల్ క్యాప్స్ లో పలు పెన్నీ స్టాక్స్ 97 కర్పూరంలా కరిగిపోయాయి. ఆశాపురా ఇంటిమేట్స్, జె. తపారియా ప్రాజెక్ట్స్, తిరానీ ప్రాజెక్ట్స్, గ్రెన్‌క్రెస్ట్ ఫినాన్షియల్ లాంటి స్టాక్స్ 90 నుంచి 100 శాతం నష్టపోయాయి.

అదే సమయంలో కొన్ని పెన్నీ స్టాక్స్ మాత్రం ఏకంగా 1000 శాతం లాభాలను నమోదు చేశాయి. వాటిలో కోస్టల్ కార్పోరేషన్, విర్గో గ్లోబల్, టియాన్ ఆయుర్వేదిక్, ఓరియంట్ ట్రేడ్ లింక్, వికాస్ ప్రొపాంట్ లాంటి స్టాక్స్ ఈ ఆర్థిక సంవత్సరం 1000 శాతం లాభాలను నమోదు చేశాయి.

అలాగే ఎస్‌పీఎల్ ఇండస్ట్రీస్, దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్ మెంట్స్, ఐవోఎల్ కెమికల్స్, ఉషా మార్టిన్, మెర్క్, కాంటబిల్ రిటైల్, ప్రభాత్ టెలికామ్స్, బిర్లా కేబుల్ వంటి సంస్థలు ఇన్వెస్టర్ల సొమ్మును రెండింతలు చేశాయి.

ముఖ్యంగా దేశీయ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరగడం, ఎర్నింగ్స్ రికవరీ, ఎమర్జింగ్ మార్కెట్లలో భారత్ పట్ల ఉన్న ఆకర్షణ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం కూడా మార్కెట్ పెరిగేందుకు సానుకూలంశాలుగా ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి - మార్చి మధ్య సుమారు రూ.45 వేల కోట్ల విదేశీ సంస్థాగత నిధులు మార్కెట్లలో ప్రవేశించినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
First published: March 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...