THESE STEPS PLEASE CHECK BEFORE TAKING A JOINT HOME LOAN UMG GH
Joint Home Loan: జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటున్నారా..? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
సొంత ఇంటి (own house) కలను సాకారం చేసుకోవడానికి చాలామంది జాయింట్ (Joint) హోమ్‌లోన్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటారు. ఇంటిని కొనుగోలు చేయడానికి నిధుల కొరత ఉన్నప్పుడు జాయింట్ హోమ్‌లోన్ ఉపయోగపడుతుంది.
భారతదేశంలో దాదాపు అందరికీ సొంతింటి (own house) కల ఉంటుంది. ఓ ఇంటికి యజమాని (owner) అనిపించుకోవడాన్ని సమాజంగా గౌరవంగా భావిస్తారు. పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది కాబట్టి.. ఎక్కువ మంది హోమ్లోన్లపై ఆధారపడతారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఆస్తుల ధరల కారణంగా హోమ్లోన్లు పొందడంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి జాయింట్ హోమ్‌లోన్ (Joint Home Loan) ఉపయోగపడుతుంది. రెట్టింపు ఆదాయం పొందుతున్న కుటుంబాలు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడానికి జాయింట్ హోమ్‌లోన్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటారు. ఇంటిని కొనుగోలు చేయడానికి నిధుల కొరత ఉన్నప్పుడు జాయింట్ హోమ్‌లోన్ ఉపయోగపడుతుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు లేదా లోన్ అర్హత తక్కువగా ఉన్న సందర్భాల్లో కూడా ఇది సహాయపడుతుంది. జాయింట్ హోమ్లోన్లు కుటుంబ సభ్యులు, భార్యభర్తలు తీసుకుంటారు. అయితే, జాయింట్ హోమ్‌లోన్ తీసుకునే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
సహ-రుణగ్రహీతను (Co-Borrower) జాగ్రత్తగా ఎంచుకోండి
దగ్గరి బంధువులు లేదా కుటుంబ సభ్యులు చట్టబద్ధమైన ఆదాయ వనరు లేదా ఆస్తిలో సహ-యాజమాన్యాన్ని కలిగి ఉన్నవారు హోమ్‌లోన్‌లో మీతో రుణగ్రహీతగా ఉండవచ్చు. ఉదాహరణకు జీవిత భాగస్వామి, కొడుకు, తండ్రి, సోదరులు, తండ్రి/తల్లితో పెళ్లికాని కుమార్తెలు జాయింట్ హోమ్‌లోన్ తీసుకోవచ్చు. అయితే సోదరీమణులు, స్నేహితులు, దూరపు బంధువులు సహ రుణగ్రహీతగా ఉండే అవకాశం లేదు. సహ-రుణగ్రహీతను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం అవసరం. జీవిత భాగస్వామి సహ-రుణగ్రహీత అయితే, భవిష్యత్తులో విడాకులు తీసుకుంటే, EMIలకు ఎవరు బాధ్యులు అవుతారనే దానిపై అవగాహన ఉండాలి.
సహ రుణగ్రహీత లోన్ ఎలిజిబిలిటీ పరిశీలించాలి
సహ-రుణగ్రహీతతో హోమ్‌లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు, తప్పనిసరిగా లోన్ తీసుకోవడానికి అతని/ఆమె ఎలిజిబిలిటీ తెలుసుకోవాలి. Bankbazaar.com సీఈవో ఆదిల్ శెట్టి మాట్లాడుతూ.‘సహ-రుణగ్రహీత రుణ అర్హతను మెరుగుపరుస్తారు. అయితే సహ-రుణగ్రహీతకు బ్యాడ్ క్రెడిట్ ప్రొఫైల్ ఉంటే, వాటిని లేకుండా చేయడం మంచిది. సహ-రుణగ్రహీతను ఎంచుకున్నప్పుడు, హోమ్‌లోన్ ప్రయాణంలో భాగం కావడానికి వారి ఆదాయం, క్రెడిట్ స్కోర్, రీపేమెంట్ సామర్థ్యం, నిబద్ధత స్థాయిని పరిశీలించాలి.
లోన్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవాలి
సహ-రుణగ్రహీతతో హోమ్‌లోన్ తీసుకోవడానికి గల కారణాలలో ఒకటి ఈఎంఐ భారం తగ్గించడం. అయితే సహ-రుణగ్రహీత ఆర్థిక లేదా ఆరోగ్య అత్యవసర పరిస్థితి కారణంగా చెల్లించలేకపోతే లేదా చెల్లించలేకపోతే ఏం చేయాలి? అలాగే, సహ-రుణగ్రహీతలలో ఒకరు ముందస్తుగా మరణించిన సందర్భంలో, మొత్తం తిరిగి చెల్లింపు బాధ్యత మిగిలిన సహ-రుణగ్రహీత/రుణగ్రహీతలకు బదిలీ అవుతుంది. అయినప్పటికీ, రుణగ్రహీతలందరి జీవితానికి ఇన్సూరెన్స్ చేయడం ద్వారా అలాంటి ప్రమాదాలను నివారించవచ్చు.
అందుబాటులో ఉన్న పన్ను ప్రయోజనాలు
సహ-రుణగ్రహీత, ఆస్తి ఉమ్మడి యజమాని అయితే, హోమ్‌లోన్‌పై వివిధ పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం.. ఆస్తికి జాయింట్ ఓనర్‌గా ఉన్న ప్రతి సహ-రుణగ్రహీత, ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.