THESE SMALL FINANCE BANKS OFFERING OVER 7 PER CENT INTEREST ON FIXED DEPOSITS SS
FD Rates: ఈ బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే ఎక్కువ లాభం... ఎఫ్డీ రేట్స్ తెలుసుకోండి
FD Rates: ఈ బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే ఎక్కువ లాభం... ఎఫ్డీ రేట్స్ తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)
FD Rates | ఫిక్స్డ్ డిపాజిట్లపై 7 శాతం పైనే వడ్డీ ఇస్తున్నాయి కొన్ని బ్యాంకులు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై (Fixed Deposits) ఎక్కువ వడ్డీ ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.
వడ్డీ కోసం బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడం సామాన్యులకు అలవాటే. అందుకే ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఇస్తుందా అని చెక్ చేస్తూ ఉంటారు. అన్ని బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను (FD Rates) పోల్చి చూస్తుంటారు. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ ఇస్తుంటే ఇంకొన్ని బ్యాంకులు ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తుంటాయి. ఈ వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఏ బ్యాంకులు ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయో ఆ వివరాలను బ్యాంక్ బజార్ వెబ్సైట్ అందిస్తోంది. bankbazaar.com అందిస్తున్న సమాచారం ప్రకారం ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇవే.
AU Small Finance Bank: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఒక ఏడాదిలోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 5.25 శాతం, 1 నుంచి 2 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.50 శాతం, 2 నుంచి 3 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.75 శాతం, 3 నుంచి 5 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.75 శాతం వడ్డీ లభిస్తుంది. ఫిబ్రవరి 23 నుంచి ఇవే వడ్డీ రేట్లు అమలులో ఉన్నాయి.
Equitas Small Finance Bank: ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఒక ఏడాదిలోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 5 శాతం, 1 నుంచి 2 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.50 శాతం, 2 నుంచి 3 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.75 శాతం, 3 నుంచి 5 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 6 శాతం వడ్డీ లభిస్తుంది. మార్చి 21 నుంచి ఇవే వడ్డీ రేట్లు అమలులో ఉన్నాయి.
Fincare Small Finance Bank: ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఒక ఏడాదిలోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 5.4 శాతం, 1 నుంచి 2 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.50 శాతం, 2 నుంచి 3 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.5 శాతం, 3 నుంచి 5 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 7 శాతం వడ్డీ లభిస్తుంది. మే 24 నుంచి ఇవే వడ్డీ రేట్లు అమలులో ఉన్నాయి.
Jana Small Finance Bank: జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఒక ఏడాదిలోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 5.5 శాతం, 1 నుంచి 2 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.50 శాతం, 2 నుంచి 3 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.75 శాతం, 3 నుంచి 5 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.75 శాతం వడ్డీ లభిస్తుంది. ఏప్రిల్ 12 నుంచి ఇవే వడ్డీ రేట్లు అమలులో ఉన్నాయి.
Suryoday Small Finance Bank: సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఒక ఏడాదిలోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 5.75 శాతం, 1 నుంచి 2 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.50 శాతం, 2 నుంచి 3 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 7 శాతం, 3 నుంచి 5 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.75 శాతం వడ్డీ లభిస్తుంది. మార్చి 10 నుంచి ఇవే వడ్డీ రేట్లు అమలులో ఉన్నాయి.
Ujjivan Small Finance Bank: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఒక ఏడాదిలోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.5 శాతం, 1 నుంచి 2 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.90 శాతం, 2 నుంచి 3 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 7.1 శాతం, 3 నుంచి 5 ఏళ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.25 శాతం వడ్డీ లభిస్తుంది. మే 19 నుంచి ఇవే వడ్డీ రేట్లు అమలులో ఉన్నాయి.
ఆయా బ్యాంకుల నుంచి 2022 జూన్ 3న bankbazaar.com సేకరించిన వివరాలు ఇవి. ఈ వడ్డీ రేట్లన్నీ రూ.1 కోటి లోపు సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్లకు వర్తిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.