భారత్‌లో ఫిక్స్డ్ డిపాజిట్లకు (Fixed Deposits) మంచి ఆదరణ ఉంటుంది. ఈ సంప్రదాయ పెట్టుబడి మార్గంలో నష్టభయం తక్కువగా ఉండటం, టాక్స్ బెనిఫిట్స్ (Tax Benefits) లభిస్తుండటంతో ఎక్కువ మంది వీటిలో పెట్టుబడికి ఆసక్తి చూపిస్తుంటారు. కరోనా తర్వాత వీటికి ఆదరణ మరింతగా పెరిగింది. ఇప్పుడు కరోనా ఓమిక్రాన్ వేరియంట్‌తో (Omicran Variant) ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర కార్పస్‌ను నిర్మించుకునేందుకు ఎక్కువ మంది ఎఫ్‌డీల వైపు చూసే అవకాశం ఉంది. అయితే ఎఫ్‌డీల్లో పెట్టుబడి (Investment) పెట్టేముందు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఏ బ్యాంకు (Bank) ఎంత వడ్డీ చెల్లిస్తుందో తెలుసుకోవాలి.
బ్యాంక్ బజార్ డేటా ప్రకారం, కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు.. ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ అందజేస్తున్నాయి. ఎఫ్డీపై ఏడాది వ్యవధికి గాను 6.50 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లపై ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులను పరిశీలిద్దాం.
* సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈ బ్యాంకు ఏడాది వ్యవధి గల ఎఫ్డీలపై 6.50 శాతం వడ్డీని అందిస్తుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఇదే అత్యధిక వడ్డీ రేటు. మీరు రూ.1 లక్ష మొత్తం ఎఫ్డీ చేస్తే.. అది ఏడాదిలో రూ. 1.07 లక్షలకు పెరుగుతుంది. దీనిలో కనీసం రూ. 1,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
* ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీలపై 6 శాతం వడ్డీని అందిస్తుంది. రూ.1 లక్ష పెట్టుబడి పెడితే ఏడాదికి అది రూ. 1.06 లక్షలకు పెరుగుతుంది. దీనిలో కనీస పెట్టుబడి రూ. 1,000.
Banks Strike: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఎప్పుడు? ఎన్ని రోజులు? డిమాండ్లు ఏంటి?
* ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఎఫ్డీలపై 5.85 శాతం వడ్డీని అందిస్తుంది. రూ. 1 లక్ష మొత్తం పెట్టుబడి ఏడాదిలో రూ. 1.06 లక్షలకు పెరుగుతుంది.
* ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఎఫ్డీలపై 4.85 శాతం వడ్డీని అందిస్తుంది. రూ. 1 లక్ష మొత్తం ఒక సంవత్సరంలో రూ. 1.05 లక్షలకు పెరుగుతుంది. కనీస పెట్టుబడి రూ. 1,000. కాగా, కొత్త డిపాజిటర్లను ఆకర్షించేందుకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ప్రభుత్వ, ఇతర ప్రైవేట్ బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) రూ. 5 లక్షల వరకు ఎఫ్డీ రిటర్న్‌పై హామీ ఇస్తుంది. అయితే వడ్డీరేటుతో పాటు మంచి బ్యాంకింగ్ నెట్వర్క్, ఏటీఎం సేవలు, విస్తృతమైన ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందించే బ్యాంకులను కస్టమర్లు ఎంచుకోవడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Fixed deposits, Interest rates