హోమ్ /వార్తలు /బిజినెస్ /

Pension: పెన్షనర్లకు శుభవార్త.. ఒకటో తేదీ నుంచి ఆ బెనిఫిట్!

Pension: పెన్షనర్లకు శుభవార్త.. ఒకటో తేదీ నుంచి ఆ బెనిఫిట్!

పెన్షనర్లకు శుభవార్త.. అక్టోబర్ 1 నుంచి ఆ బెనిఫిట్!

పెన్షనర్లకు శుభవార్త.. అక్టోబర్ 1 నుంచి ఆ బెనిఫిట్!

Jeevan Pramaan Patra | పెన్షనర్లకు అలర్ట్. కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. అక్టోబర్ 1 నుంచి కూడా లైఫ్ సర్టిఫికెట్‌ను అందించే వెసులుబాటు కల్పిస్తోంది. అయితే ఇది ఎంపిక చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Life Certificate | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగలు పదవీ విరమణ చేసిన తర్వాత ప్రతి నెలా పెన్షన్ (Pension) పొందాలంటే కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్‌ను (Jeevan Pramaan Patra) అందించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా ఈ పని పూర్తి చేయాల్సిందే. నవంబర్ నెలలో సాధారణంగా లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే పెన్షన్ రాదు. పెన్షన్ పొందే వారు జీవించి ఉన్నారని తెలుసుకోవడానికి ఇలా ప్రతి ఏటా జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పిస్తూ రావాల్సి ఉంటుంది.

  కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌లకు లేదా పోస్టాఫీస్‌లకు వెళ్లి ఈ లైఫ్ సర్టిఫికెట్‌ను అందించొచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా వివిధ మార్గాల్లో జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించే వెలుసుబాటు ఉంది. అయితే ఇప్పుడు కేంద్రం కొంత మందికి ఊరట కలిగే ప్రకటన చేసింది. అక్టోబర్ నెల నుంచి కూడా లైఫ్ సర్టిఫికెట్ అందించే వెసులుబాటు కల్పిస్తోంది.

  బంగారం కొనే వారికి బంపరాఫర్.. రూ.10,000 భారీ డిస్కౌంట్!

  డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ మెమరాండమ్ ప్రకారం.. సూపర్ సీనియర్స్‌కు లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించడానికి ప్రత్యేకమైన కౌంటర్‌ను ఏర్పాటు చేయాలి. నవంబర్ 1 నుంచి కాకుండా అక్టోబర్ 1 నుంచి వీళ్లు జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించొచ్చు. 80 ఏళ్లు లేదా ఆపైన వయసు కలిగిన వారికి ఇది వర్తిస్తుంది. అంటే సూపర్ సీనియర్ సిటిజన్స్‌కు ఈ బెనిఫిట్ అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు.

  ఇది మామూలు వాయింపు కాదు భయ్యా.. ఏకంగా రూ.170 పెరిగిన సిలిండర్ ధర.. ఏడాదిలో 5 సార్లు పెంపు

  పెన్షనర్లు డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా కూడా లైఫ్ సర్టిఫికెట్‌ను అందించొచ్చు. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు అందిస్తున్నాయి. పోస్టల్ డిపార్ట్‌మెంట్ కూడా ఈ సేవలను అందిస్తోంది. పెన్షన్ మంజూరు చేసే బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి లైఫ్ సర్టిఫికెట్‌ను అందించాల్సి ఉంటుంది. లేదంటై ఆన్‌లైన్‌లో కూడా సమర్పించొచ్చు. జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించొచ్చు. యూడీఐఏఐ ఫేస్ అథంటికేషన్ టెక్నాలజీ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించే అవకాశం ఉంది.

  లైఫ్ సర్టిఫికెట్‌ను అందించకపోతే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పెన్షన్ నిలిచిపోతుంది. మళ్లీ లైఫ్ సర్టిఫికెట్ అందించిన తర్వాతనే తిరిగి పెన్షన్ వస్తుంది. అందువల్ల పెన్షన్ పొందడంలో జాప్యం లేకుండా ఉండేందుకు లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పిస్తూ రావాలి. లేదంటే పెన్షన్ పొందంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Money, Pension Scheme, Pensioners, Pensions, Personal Finance

  ఉత్తమ కథలు