Renault India : ఫ్రెంచ్ కంపెనీ రెనాల్ట్ కార్లకు(Renault cars) ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ప్రభావంతో వస్తువుల ధరలు పెరిగి.. ఆటో మొబైల్ కంపెనీలు తమ ప్రొడక్టుల ధరలను పెంచుతున్నాయి. అయితే రెనాల్ట్ ఇండియా(Renault India) కొన్ని రకాల మోడల్స్‌పై ఈ డిసెంబర్లో భారీ డిస్కౌంట్ల(Discounts)ను ప్రకటించింది. రెనాల్ట్ ట్రైబర్, రెనాల్ట్ క్విడ్, రెనాల్ట్ కిగర్ల మోడల్స్‌పై కంపెనీ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెనాల్ట్ ట్రైబర్‌పై గరిష్టంగా రూ.50,000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్లు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్, కార్పొరేట్ బెనిఫిట్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఆఫర్లో ఉన్న మూడు మోడల్స్‌లో దేన్నైనా కొనుగోలు చేయాలని భావిస్తుంటే.. సమీపంలోని రెనాల్ట్ ఇండియా డీలర్‌షిప్‌లను సందర్శించవచ్చు. ఈ ఆఫర్లు 2022 డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయని వినియోగదారులు గుర్తించాలని కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్ల పూర్తి వివరాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.
రెనాల్ట్ క్విడ్(Renault Kwid)
రెనాల్ట్ క్విడ్ మోడల్ణు డిసెంబర్ నెలలో రూ.35,000 వరకు డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. ఇందులో రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉన్నాయి. వినియోగదారులకు RXE మినహా అన్ని మోడల్స్‌పై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌పై ఇతర డిస్కౌంట్లలో గరిష్టంగా రూ.10,000 కార్పొరేట్ బెనిఫిట్ అందుతుంది. అదే విధంగా రూరల్ బెనిఫిట్ కింద రూ.5,000, RELIVE స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ.10,000 వరకు డిస్కౌంట్‌ను వినియోగదారులు పొందే అవకాశం ఉంది.
రెనాల్ట్ కిగర్(Renault Kiger)
రెనాల్ట్ క్విడ్ తరహాలోనే రెనాల్ట్ కిగర్ SUVని రూ.35,000 వరకు డిస్కౌంట్లో కొనుగోలు చేయవచ్చు. ఇందులో కార్పొరేట్ బెనిఫిట్ కింద రూ.10,000 డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ కింద రూ.15,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ SUVపై వినియోగదారులకు ఎలాంటి క్యాష్ డిస్కౌంట్‌ను కంపెనీ అందించడం లేదు. రూరల్ డిస్కౌంట్ కింద రూ.5,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే RELIVE స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ.10,000 వరకు బెనిఫిట్స్ అందుతాయి.
రెనాల్ట్ ట్రైబర్(Renault Triber)
రెనాల్ట్ ట్రైబర్ సెలక్టెడ్ వేరియంట్లపై రూ.15,000 క్యాష్ డిస్కౌంట్ అందుకునే అవకాశం ఉంది. ఈ మోడల్స్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.25,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అదే విధంగా కార్పొరేట్ బెనిఫిట్స్ కింద ఎంపిక చేసిన మోడల్స్‌పై రూ.10,000 వరకు డిస్కౌంట్‌ను వినియోగదారులు అందుకోవచ్చు. అదే విధంగా అందుబాటులో ఉన్న రూరల్ డిస్కౌంట్ కింద.. రైతులు, సర్పంచ్, గ్రామ పంచాయతీ సభ్యులు రూ.5,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. RELIVE స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద మరో రూ.10,000 అదనపు డిస్కౌంట్‌ను వినియోగదారులు అందుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.