హోమ్ /వార్తలు /బిజినెస్ /

రోజూ 3జీబీ డేటా ఇచ్చే Jio, Airtel, Vi ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే...

రోజూ 3జీబీ డేటా ఇచ్చే Jio, Airtel, Vi ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jio, Airtel, Vi prepaid plans | ఎక్కువ డేటా ఉపయోగించే వారికి రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా-Vi పలు ప్లాన్స్ అందిస్తోంది. బెనిఫిట్స్ తెలుసుకోండి.

  మీరు స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువగా సినిమాలు, వీడియోలు చూస్తుంటారా? అయితే మీకు ఎక్కువ డేటా ఉన్న ప్లాన్స్ అవసరం. రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా-Vi రోజూ 3జీబీ డేటాతో అనేక ప్లాన్స్ అందిస్తున్నాయి. ఈ ప్లాన్స్ రూ.500 లోపే ఉంటాయి. ఎక్కువ డేటా వాడేవారికి ఈ ప్లాన్స్ ఉపయోగకరంగా ఉంటాయి. రోజూ 3జీబీ డేటాతో పాటు కాలింగ్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఈ ప్లాన్స్ వివరాలు తెలుసుకోండి.

  Jio Rs 349 Plan: రిలయెన్స్ జియోలో రూ.349 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజులకు రోజూ 3జీబీ డేటా పొందొచ్చు. వేలిడిటీ 28 రోజులు. అంటే మొత్తం 84జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. జియో నుంచి నాన్ జియోకు 1000 నిమిషాలు లభిస్తాయి. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

  Jio Rs 401 Plan: రిలయెన్స్ జియోలో రూ.401 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజులకు రోజూ 3జీబీ డేటా పొందొచ్చు. అదనంగా మరో 6జీబీ డేటా కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తం 90జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. జియో నుంచి నాన్ జియోకు 1000 నిమిషాలు లభిస్తాయి. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

  December New Rules: డిసెంబర్‌లో అమలులోకి వచ్చే రూల్స్ ఇవే... తెలుసుకోండి

  Aadhaar-PAN: మీ పాన్ కార్డు, ఆధార్ కార్డులో పేర్లు వేర్వేరుగా ఉంటే సరిచేయండి ఇలా

  Jio Rs 999 Plan: రిలయెన్స్ జియోలో రూ.999 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజులకు రోజూ 3జీబీ డేటా పొందొచ్చు. అంటే మొత్తం 252జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. జియో నుంచి నాన్ జియోకు 3000 నిమిషాలు లభిస్తాయి. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

  Airtel Rs 398 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.398 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా చొప్పున 84జీబీ డేటా ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లబిస్తాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంతో పాటు వింక్ మ్యూజిక్, షా అకాడమీ సబ్‌స్క్రిప్షన్స్ లభిస్తాయి. హెలోట్యూన్స్ ఉచితం. ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలపై రూ.150 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

  Airtel Rs 448 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.448 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా చొప్పున 84జీబీ డేటా ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లబిస్తాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంతో పాటు వింక్ మ్యూజిక్, షా అకాడమీ సబ్‌స్క్రిప్షన్స్ లభిస్తాయి. హెలోట్యూన్స్ ఉచితం. ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలపై రూ.150 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

  SBI Credit Card: గుడ్ న్యూస్... ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు తీసుకునేవారికి రూ.6500 బెనిఫిట్స్

  Jio New Plans: జియోలో రూ.75 నుంచే ఆల్ ఇన్ వన్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే

  Vi Rs 299 plan: డబుల్ డేటా ప్లాన్ ఇది. వొడాఫోన్ ఐడియా-Vi రూ.299 రీఛార్జ్ చేస్తే రోజూ 4జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. అన్‌లిమిటెడ్ కాల్స్, నేషనల్ కాల్స్ చేసుకోవచ్చు. 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. రోల్ఓవర్ డేటా బెనిఫిట్స్ లభిస్తాయి. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మీరు ఉపయోగించని డేటాను వీకెండ్‌లో ఉపయోగించుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ చేయొచ్చు.

  Vi Rs 405 plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.405 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా చొప్పున 84జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అదనంగా మరో 6జీబీ డేటా లభిస్తుంది. మొత్తం 90జీబీ డేటా వాడుకోవచ్చు. లోకల్, నేషనల్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. ఏడాది జీ5 ప్రీమియం యాక్సెస్ లభిస్తుంది. వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ చేయొచ్చు.

  Vi Rs 449 plan: డబుల్ డేటా ప్లాన్ ఇది. వొడాఫోన్ ఐడియా-Vi రూ.449 రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 4జీబీ డేటా వాడుకోవచ్చు. లోకల్, నేషనల్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. ఏడాది జీ5 ప్రీమియం యాక్సెస్ లభిస్తుంది. వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ చేయొచ్చు. రోల్ఓవర్ డేటా బెనిఫిట్స్ లభిస్తాయి. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మీరు ఉపయోగించని డేటాను వీకెండ్‌లో ఉపయోగించుకోవచ్చు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: AIRTEL, Airtel recharge plans, IDEA, Jio, Reliance Jio, VODAFONE, Vodafone Idea

  ఉత్తమ కథలు