హోమ్ /వార్తలు /బిజినెస్ /

1 Rupee Coin: అలర్ట్.. ఇక ఈ రూపాయి కాయిన్లు కనిపించవు, బ్యాంక్ కీలక ప్రకటన!

1 Rupee Coin: అలర్ట్.. ఇక ఈ రూపాయి కాయిన్లు కనిపించవు, బ్యాంక్ కీలక ప్రకటన!

1 Rupee Coin: అలర్ట్.. ఇక ఈ రూపాయి కాయిన్లు కనిపించవు, బ్యాంక్ కీలక ప్రకటన!

1 Rupee Coin: అలర్ట్.. ఇక ఈ రూపాయి కాయిన్లు కనిపించవు, బ్యాంక్ కీలక ప్రకటన!

One Rupee Coin | బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. ఇక రానున్న రోజుల్లో కొన్ని రూపాయి, 50 పైసలు నాణేలు కనిపించవు. బ్యాంకులు కొన్ని కాయిన్లను రీఇష్యూ చేయడం లేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Rs 1 Coin | మీ వద్ద రూపాయి కాయిన్లు ఉన్నాయా? లేదంటే 50 పైసలు నాణేలను కలిగి ఉన్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. కొన్నిరూపాయి, 50 పైసలు నాణేలు ఇక కనిపించవు. ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ఈ విషయాన్ని వెల్లడించింది. న్యూఢిల్లీలోని ఒక ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్ కొన్ని రూపాయి (Rupee) నాణేలు, 50 పైసలు కాయిన్లను రీఇష్యూ చేయడం కుదరదని తెలియజేసింది. అంటే ఒక్కసారి ఆ రూపాయి, 50 పైసలు నాణేలు బ్యాంక్‌లోకి వెలితే.. మళ్లీ తిరిగి వెనక్కి రావు. బ్యాంకులు వాటిని మళ్లీ కస్టమర్లకు జారీ చేయవు. కొత్త కాయిన్లు లభిస్తాయి.

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ నాణేలను తిరిగి బ్యాంకుల నుంచి వెనక్కి తీసుకుంటుంది. అంటే ఈ కాయిన్లు చెల్లుబాటు కావని అనుకోవద్దు. ఇవి వ్యవస్థలో ఉన్నంత వరకు చెల్లుబాటు అవుతూనే ఉంటాయి. ఒక్కసారి బ్యాంక్‌లోక వెలితే.. బయటకు రావు. బ్యాంక్‌లోని వెళ్లిన తర్వాత వాటిని ఆర్‌బీఐ తీసేసుకుంటుంది.

కొత్త ఇల్లు కొనే వారికి బంపరాఫర్.. బజాజ్ రూ.4,999 ఈఎంఐ స్కీమ్!

1990, 2000 సంవత్సరాల్లో చెలామణిలో ఉన్న పాత కాయిన్లను బ్యాంకులు రిఇష్యూ చేయడం లేదు. ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్ నోటీసు ప్రకారం ఏ ఏ కాయిన్లను రీఇష్యూ చేయడం లేదో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

1. రూ. 1 కాపర్ నికెల్ నాణేలు

2. 25 పైసల కాపర్ నికెల్ నాణేలు

3. 10 పైసల స్టెయిన్‌లెస్ స్టీల్ నాణేలు

4. 10 పైసల అల్యూమినియం కాంస్య నాణేలు

5. 20 పైసల అల్యూమినియం నాణేలు

6. 10 పైసల అల్యూమినియం నాణేలు

7. 5 పైసల అల్యూమినియం నాణేలు

100 ఏళ్లు పూర్తి చేసుకున్న బ్యాంక్.. కస్టమర్లకు అదిరే గిఫ్ట్!

ఈ కాయిన్లను బ్యాంకులు తిరిగి వెనక్కి జారీ చేయడం లేదు. అందువల్ల మీ దగ్గర ఈ కాయిన్లు ఉంటే ఈ విషయాన్ని తెలుసుకోవడం ఉత్తమం. అయితే బ్యాంక్ నోటీసు ప్రకారం.. ఈ కాయిన్లు ఎప్పటిలాగానే చెల్లుబాటు అవుతాయని గుర్తించాలి. కేవలం ఈ కాయిన్లను బ్యాంకులు చెలామణిలో నుంచి తొలగిస్తున్నాయి. ఇప్పుడు ఎలాగైతే ఈ కాయిన్లు చెల్లుబాటు అవుతున్నాయో.. తర్వాత కూడా ఈ కాయిన్లు అలానే చెల్లుబాటు అవుతాయి. అందువల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదు.

50 పైసలు, రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 కాయిన్లు అన్నీ కూడా చెల్లుబాటు అవుతాయి. ప్రభుత్వం కాలక్రమేనా వివిధ డిజైన్లలో కొత్త కొత్త కాయిన్లను తీసుకువస్తూ ఉంటాయి. ఇవ్వన్నీ కూడా చెల్లుతాయి. ఆర్‌బీఐ 2004 సర్క్యూలర్‌లోనే కాపర్ నికెల్, అల్యూమినియం రూపాయి కాయిన్లను చెలామణిలో నుంచి తొలగిస్తామని వెల్లడించింది.

First published:

Tags: Coins, Icici, Icici bank, Indian rupee, Rbi, Rupee value

ఉత్తమ కథలు