Home /News /business /

THESE PRIVATE BANKS OFFER UP TO 6 30 PERCENT INTEREST ON TAX SAVING FIXED DEPOSITS JNK GH

Fixed deposits: టాక్స్​ సేవింగ్స్​ ఎఫ్​డీలపై అధిక వడ్డీ అందిస్తున్న ప్రైవేట్​ బ్యాంకులు.. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ అంటే?

అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్న ప్రైవేట్ బ్యాంకులు (ప్రతీకాత్మక చిత్రం)

అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్న ప్రైవేట్ బ్యాంకులు (ప్రతీకాత్మక చిత్రం)

Fixed deposits: ఇటీవల అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎఫ్​డీలపై వడ్డీ రేట్లు తగ్గించాయి. దీంతో మెరుగైన వడ్డీ రేట్లు ఇస్తున్న ప్రైవేట్​ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్​ బ్యాంకుల్లో ఎఫ్​డీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. టాక్స్​ సేవింగ్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై ఉత్తమ వడ్డీని అందిస్తున్న ప్రైవేట్ బ్యాంకులను పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
భారత్‌లో ఫిక్స్​డ్​ డిపాజిట్లకు మంచి ఆదరణ ఉంటుంది. తక్కువ నష్టభయం, పన్ను ఆదా చేసుకునే అవకాశంతో ఎక్కువ మంది దీనిలో పెట్టుబడికి ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఆదాయం కోసం చూసే సీనియర్​ సిటిజన్లు ఎఫ్​డీల్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతుంటారు. అయితే ఇటీవల అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎఫ్​డీలపై వడ్డీ రేట్లు తగ్గించాయి. దీంతో మెరుగైన వడ్డీ రేట్లు ఇస్తున్న ప్రైవేట్​ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్​ బ్యాంకుల్లో ఎఫ్​డీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ బ్యాంకులు 6.30 శాతం వరకు ఎఫ్​డీలపై వడ్డీ అందిస్తాయి. టాక్స్​ సేవింగ్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై ఉత్తమ వడ్డీని అందిస్తున్న ప్రైవేట్ బ్యాంకులను పరిశీలిద్దాం.

ఆర్​బీఎల్​ బ్యాంక్

బ్యాంకు టాక్స్​ సేవింగ్స్​ డిపాజిట్లపై 6.30 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో కెల్లా ఎఫ్​డీపై ఉత్తమ వడ్డీ అందిస్తుంది. రూ.1.5 లక్షల పెట్టుబడి ఐదేళ్లలో రూ.2.05 లక్షలకు చేరుకుంటుంది.

యెస్ బ్యాంక్

టాక్స్​ సేవింగ్స్​ డిపాజిట్లపై 6.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఐదేళ్లలో రూ.1.5 లక్షల మొత్తం రూ.2.05 లక్షలకు చేరుకుంటుంది.

IRCTC: వ్యాపార అవకాశం ఇస్తున్న ఐఆర్‌సీటీసీ... నెలకు రూ.80,000 వరకు సంపాదించొచ్చు


ఐడిఎఫ్‌సీ బ్యాంక్

ఇండస్‌ఇండ్ బ్యాంక్ పన్ను ఆదా డిపాజిట్లపై 6 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఐదేళ్లలో రూ.1.5 లక్షల మొత్తం రూ.2.02 లక్షలకు చేరుకుంటుంది.

డీసీబీ బ్యాంక్

డీసీబీ బ్యాంక్ టాక్స్​ సేవింగ్​ డిపాజిట్లపై 5.95 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఐదేళ్లలో రూ.1.5 లక్షల మొత్తం రూ.2.02 లక్షలకు చేరుకుంటుంది.

Maruti Cars Discount: 2021లో ఇదే చివరి బంపర్ ఆఫర్...మారుతి కార్లపై భారీ డిస్కౌంట్...




యాక్సిస్ బ్యాంక్

యాక్సిస్​ బ్యాంక్​, కరూర్ వైశ్యా బ్యాంకులు టాక్స్​ సేవింగ్స్​ డిపాజిట్లపై 5.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. రూ. 1.5 లక్షలు ఐదేళ్లలో రూ.2 లక్షలకు పెరుగుతాయి.

కాగా, స్మాల్​ ఫైనాన్స్​ ప్రైవేట్​ బ్యాంకులు కొత్త డిపాజిట్లను ఆకర్షించేందుకు అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఆర్​బీఐ అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC), రూ. 5 లక్షల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై హామీ ఇస్తుంది. అయితే వడ్డీరేట్లతో పాటు మంచి బ్యాంకింగ్​ నెట్​వర్క్​, ఏటీఎం సేవలు, విస్తృతమైన ఆన్​లైన్​ బ్యాంకింగ్ సేవలను దృష్టిలో పెట్టుకొని బ్యాంకును ఎంచుకోవాలి.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:

Tags: Bank, Fixed deposits, Interest rates

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు