రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్(Investment) ఆప్షన్‌గా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)కు మంచి పేరుంది. పదవీ విరమణ తర్వాత వృద్దాప్యంలో పెన్షన్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఉద్యోగం చేస్తున్న కాలంలో ప్రతి నెలా కొంత డబ్బును ఇందులో జమ చేయడం ద్వారా రిటైర్మెంట్ తర్వాత ఈ స్కీమ్ కింద పెన్షన్ పొందవచ్చు. అయితే, ఎన్పీఎస్ నిర్వహణకు ఎక్కువ ఖర్చు కానప్పటికీ.. కొన్ని ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు కొన్ని పాయింట్ ఆప్ పర్చేజ్ (POP), మరికొన్ని CRA స్థాయిలో ఉంటాయి. ఎన్పీఎస్ ఖాతాలు తెరిచేందుకు, నిర్వహించేందుకు కొన్ని బ్యాంకులను ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) నియమించింది. ఈ బ్యాంకులు POP సబ్‌స్క్రైబర్ రిజిస్ట్రేషన్, స్టేట్మెంట్ల జారీ వంటి సేవలను అందిస్తాయి.
ఈ ఎన్‌పిఎస్ ఛార్జీలను ఎన్‌పిఎస్ సబ్‌స్క్రైబర్ ముందస్తుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో విధించే అనేక ఛార్జీలలో పాయింట్ ఆఫ్ పర్చేజ్ (POP) సర్వీస్ ఛార్జీ కూడా ఒకటి. POP ఛార్జీలను ఇటీవల PFRDA సవరించింది. 2022 ఫిబ్రవరి 1 నుండి కొత్త ఛార్జీలు వర్తిస్తాయి.
ఎన్పీఎస్ కొత్త ఛార్జీలు ఇవే..
చందాదారుడు తన ఎన్‌పీఎస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు చెల్లించాల్సిన ఫీజు రూ. 200 నుంచి రూ. 400 మధ్య ఉంటుంది. శ్లాబుల ప్రకారం దీన్ని వసూలు చేస్తారు. గతంలో ఈ ఫీజు రూ. 200 మాత్రమే ఉండేది. చందాదారుడి కంట్రిబ్యూషన్‌ను బట్టి రుసుములు ఉంటాయి. ఈ కంట్రిబ్యూషన్ 0.50% వరకు (కనిష్ట రూ. 30 నుంచి గరిష్టంగా రూ. 25000) వరకు ఉంటుంది. గతంలో ఇది 0.25 శాతమే ఉండేది. ఒక ఆర్థిక సంవత్సరంలో 6 నెలల కంట్రిబ్యూషన్ రూ. 1000 నుండి రూ. 2999 ఉంటే దానికి వార్షికంగా రూ. 50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మినిమం కంట్రిబ్యూషన్ రూ. 3000 నుండి రూ. 2999 వరకైతే రూ. 50 ఛార్జీ, రూ. 3000 నుండి రూ. 6000 వరకు మినిమం కంట్రిబ్యూషన్‌కు రూ. 75 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
LIC Credit Card: ఎల్ఐసీ పాలసీ ఉందా? మీకు ఈక్రెడిట్ కార్డ్ ఉచితం
ఇక, రూ. 6000 పైన మినిమం కంట్రిబ్యూషన్‌ను సంవత్సరానికి రూ. 100 ఛార్జీ చెల్లించాలి. చందాదారులు eNPS కింద 0.20% (కనిష్టంగా రూ. 15 గరిష్టంగా రూ. 10,000) చెల్లించాల్సి ఉంటుంది. ఎన్పీఎస్ నుంచి ఎగ్జిట్ లేదా కొంత డబ్బును వెనక్కి తీసుకునేందుకు ఈ మధ్యే ప్రాసెసింగ్ ఫీజును ప్రవేశపెట్టారు. ఈ సేవల కనీస రుసుము రూ. 125 నుంచి రూ. 500 వరకు ఉంటుంది. లేదా కార్పస్ మొత్తంలో 0.125 శాతం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Employees, NPS Scheme, Pensions, Service charges