New Rules: ఏప్రిల్ 1 నుంచి మారిన రూల్స్ ఇవే...

New Rules | మీపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెంచనుంది. పన్ను చెల్లింపుదారుల సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లపై నిఘా పెట్టనుంది. ఇందుకోసం రూ.1,000 కోట్లతో ట్యాక్స్ ట్రాకర్ ప్రాజెక్ట్‌ తీర్చిదిద్దింది.

news18-telugu
Updated: April 1, 2019, 6:15 PM IST
New Rules: ఏప్రిల్ 1 నుంచి మారిన రూల్స్ ఇవే...
New Rules: ఏప్రిల్ 1 నుంచి మారిన రూల్స్ ఇవే...
  • Share this:
ఏప్రిల్ 1... కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు. అందుకే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన మార్పుచేర్పుల్లో చాలావరకు ఏప్రిల్ 1 నుంచే అమలులోకి వస్తాయి. రూ.5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారికి కొత్త రిబేట్ అమలులోకి వచ్చింది ఏప్రిల్ 1 నుంచే. అంతే కాదు స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, రెండో ఇంటిపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌లో మార్పులు, వడ్డీ ఆదాయంపై కొత్త నిర్ణయాలన్నీ సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వచ్చేశాయి. ఇవి కాకుండా ఏప్రిల్ 1న మారిన మరిన్ని రూల్స్ ఏంటో తెలుసుకోండి.

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లపై ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నిఘా
మీ వార్షికాదాయం పన్ను పరిధిలోకి వస్తుందా? మీరు పన్ను చెల్లింపుదారులా? గతంలో పన్నులు చెల్లించారా? అయితే మీపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెంచనుంది. పన్ను చెల్లింపుదారుల సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లపై నిఘా పెట్టనుంది. ఇందుకోసం రూ.1,000 కోట్లతో ట్యాక్స్ ట్రాకర్ ప్రాజెక్ట్‌ తీర్చిదిద్దింది.

Read this: SBI: బ్యాంకుకు వెళ్లకుండా మొబైల్ నెంబర్ ఇలా అప్‌డేట్ చేయండి



పెరిగిన కార్ల ధరలు
మహీంద్రా అండ్ మహీంద్రా, టాటామోటార్స్, టొయోటా లాంటి కంపెనీలు కార్ల ధరలు పెంచుతామంటూ గతంలోనే ప్రకటించాయి. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చేశాయి. కాబట్టి ఇకపై మీరు కారు కొనాలంటే కాస్త ఎక్కువగా ఖర్చు చేయాల్సిందే.

ఎయిర్ టికెట్ ధరల పెంపుఇకపై మీరు విమానం ఎక్కాలంటే ఎక్కువ చెల్లించాల్సిందే. ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభంలో ఉంది. ఎయిర్ ఇండియా ప్యాసింజర్లకు సప్లై చేసే వంటకాల్లో కోత విధిస్తోంది. ఫ్లైట్ టికెట్ల ధరలు పెరుగుతున్నాయి.

షేర్ ట్రాన్స్‌ఫర్
లిస్టెడ్ కంపెనీల షేర్ల బదిలీ ఇక డీమ్యాట్ రూపంలోనే జరుగుతాయి. ఫిజికల్ షేర్లను డీమ్యాట్ రూపంలో మార్చుకోవడానికి మార్చి 31న గడువు ముగిసింది.

Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...

ఇవి కూడా చదవండి:

LIC Online Policy: ఆన్‌లైన్‌లో ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే డిస్కౌంట్

PUBG: పబ్‌జీ ఆడటానికి 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

RRB Level-1 Jobs: దరఖాస్తుకు ఏప్రిల్ 12 చివరి తేదీ... సికింద్రాబాద్‌‌లో 9,328 ఖాళీలు
First published: April 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు