EV | కాలుష్యం దెబ్బకి ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి రాయితీలు కూడా అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వేస్ (Indian Railways) కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ పాయింట్లను (EV Charging Points) ఏర్పాటు చేయనుంది. వచ్చే మూడేళ్ల కాలంలో వీటిని అందుబాటులో ఉంచనుంది. ఇ-మొబిలిటీని ప్రోత్సహించేందుకు తీసుకువచ్చిన కొత్త పాలసీలో భాగంగా రైల్వేస్ ఈవీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది.
పాలసీ డాక్యుమెంట్ ప్రకారం.. మెగా సిటీస్లోని రైల్వే స్టేషన్లలో తొలిగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. దశల వారీగా వీటి ఏర్పాటు జరుగుతుంది. తొలి దశలో 40 లక్షలకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లోని రైల్వే స్టేషన్లలో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు.
ఈరోజు నుంచి ఈ బ్యాంక్ కనిపించదు.. దీపావళి ముందు కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఆర్బీఐ
ముంబై, ఢిల్లీ , బెంగళూరు, హైదరాబాద్ , అహ్మదాబాద్, చెన్నై, కోల్కతా, పుణే, సూరత్ వంటి ప్రాంతాలలో తొలిగా ఈ ఈవీ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు కానున్నాయి. 2024 డిసెంబర్ కల్లా వీటిని ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి కార్బన్ ఉద్గార రహిత లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇండియన్ రైల్వేస్ కూడా 2025 నాటికి అంతర్గతంగా ఉపయోగించే ఇంటర్నల్ కంబ్యూషన్ ఇంజిన్ (ICE) వాహనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఫోన్ కొంటే రూ.10 వేల డిస్కౌంట్!
తొలి దశ తర్వాత రెండో దశలో 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతాల్లో ఉన్న రైల్వే స్టేషన్లలలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. 2025 డిసెంబర్ కల్లా వీటి ఏర్పాటు పూర్తి కానుంది. అలాగే 2026 డిసెంబర్ చివరి కల్లా ఇక మిగిలిన రైల్వే స్టేషన్లలో ఈవీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. స్థానిక పరిస్థితులు, సాధ్యాసాధ్యాలపై వీటి ఏర్పాటు ఆధారపడి ఉంటుంది.
కాగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను బడ్జెట్ గ్రాంట్ ద్వారా ఏర్పాటు చేయవచ్చు. అలాగే మరో ఆప్షన్ కూడా ఉంది. డెవలపర్ మోడ్ కింద వీటిని ఏర్పాటు చేయొచ్చు. ఈ విధానంలో అయితే ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్లు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. వీరే పెట్టుబడి పెడతారు. అంతేకాకుండా రైల్వేలకు లైసెన్స్ రూపంలో అద్దె కూడా చెల్లిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Vehicles, India Railways, Railways, Train