• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • THESE INCOME TAX RULES WILL COME INTO EFFECT FROM 2021 APRIL 1 SS GH

Income tax rule: ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి రానున్న ఆదాయ పన్ను కొత్త నిబంధనలివే

Income tax rule: ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి రానున్న ఆదాయ పన్ను కొత్త నిబంధనలివే

Income tax rule: ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి రానున్న ఆదాయ పన్ను కొత్త నిబంధనలివే (ప్రతీకాత్మక చిత్రం)

Income tax rule | ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్నుకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. అవేంటో, మీపై ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకోండి.

  • Share this:
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్​ నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్​లో ఆదాయపు పన్ను నిబంధనలకు సంబంధించి కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త నిబంధనలు 2021 ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆదాయపు పన్ను చెల్లించే వారంతా ఈ కొత్త నిబంధనల గురించి అవగాహన ఏర్పరచుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా జాగ్రత్తపడవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్డెట్​లో ఆదాయపు పన్నుకు సంబంధించిన కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. వేతన జీవులకు అండగా నిలిచేలా.. ఆదాయపు పన్ను దాఖలు చేయని వారిపై కొరడా ఝులింపించేలా ఈ నిబంధనలు ఉన్నాయి.

New Rules: ఏప్రిల్ 1న అమల్లోకి రానున్న 11 కొత్త రూల్స్ ఇవే

Vi New Plans: ఈ వొడాఫోన్ ఐడియా-Vi ప్రీపెయిడ్ ప్లాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ

ఆమె ప్రతిపాదనల ప్రకారం, పన్ను పరిధిలోకి వచ్చే ఏ వ్యక్తి అయినా సరే గడువులోగా ఆదాయపు పన్ను రిటర్న్​ దాఖలు చేయకపోతే వారిపై టీడీఎస్​ రేటు కాస్త అధికంగానే విధించాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇది కూడా ఇన్​కమ్​ టాక్స్​ చట్టంలోని 206 ఎబి, 206 సిసిఎ నిబంధనలకు లోబడే ఉంటుంది. ఎక్కువ మంది ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలను ప్రోత్సహించడానికే ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. అంటే 2021 ఏప్రిల్ 1 నుండి ఒక వ్యక్తి పన్ను పరిధిలోకి వచ్చినా సరే ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్)ను దాఖలు చేయని సందర్భంలో, అతని బ్యాంక్ డిపాజిట్లపై రెట్టింపు టిడిఎస్ వడ్డీ వసూలు చేయబడుతుంది.

Bank Account: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? ఏప్రిల్ 1 నుంచి పాస్‌బుక్, చెక్ బుక్ పనిచేయవు

Price Hike: ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పెరుగుతాయి... కొనాలంటే ఇప్పుడే కొనండి

75 ఏళ్లు పైబడిన సీనియర్​ సిటిజన్లకు పన్ను మినహాయింపు


పన్ను పరిధిలోకి వచ్చినా సరే ఐటిఆర్ దాఖలు చేయని వ్యక్తులకు సంబంధించిన టిడిఎస్, టిసిఎస్‌లపై ఆదాయపు పన్ను నిబంధనలో మార్పు గురించి సెబీ రిజిస్టర్డ్ టాక్స్, ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు జితేంద్ర సోలంకి మాట్లాడుతూ, ‘‘వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడాన్ని ప్రోత్సహించేందుకు యూనియన్ బడ్జెట్ ఈ ప్రతిపాదనలు చేసింది.”అని అన్నారు. ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు తమ పెన్షన్​పై లేదా ఫిక్స్​ డిపాజిట్లపై చెల్లించాల్సిన వడ్డీకి పన్ను మినహాయింపు పొందుతారు. దీనిపై ఆప్టిమా మనీ మేనేజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ మఠపాల్ మాట్లాడుతూ, "ఒకే ఆదాయం కలిగి ఉన్న 75 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు ఐటిఆర్ దాఖలు నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, వారికి పెన్షన్, ఫిక్స్​డ్​ డిపాజిట్ల నుంచి వచ్చే ఆదాయం కాకుండా ఇతరత్రా ఆదాయ మార్గాలు ఉంటే.. వారు కూడా ఐటిఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.”అని అన్నారు.
Published by:Santhosh Kumar S
First published:

అగ్ర కథనాలు