సురక్షితమైన పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు (Fixed Deposits) ముందు వరుసలో ఉంటాయి. ఈ వడ్డీరేట్లు మార్కెట్ ఒడిదొడుకుల ప్రభావానికి గురికావు. అందువల్ల నష్టభయం తక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు (FD Interest Rates) తగ్గుతున్నాయి. ప్రధాన బ్యాంకుల ఎఫ్డీ రేట్లు చాలావరకు తగ్గాయి. ప్రస్తుతం సాధారణ వడ్డీ రేటు 2 నుంచి 6 శాతం మధ్య ఊగిసలాడుతుండగా.. తమిళనాడు ప్రభుత్వ అనుబంధ సంస్థలు రికార్డు స్థాయిలో వడ్డీ అందిస్తున్నాయి. తమిళనాడు పవర్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తమిళనాడు ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థలు FDలపై 8 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లు అత్యధికంగా 8.5 శాతం వరకు వడ్డీ పొందవచ్చు. ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న సంస్థలు కాబట్టి.. లిక్విడిటీ, డిఫాల్ట్, ఇతర భయాలు ఉండవు.
Post Office Scheme: మీ జీతంలో కాస్త పొదుపు చేస్తే రూ.16,00,000 రిటర్న్స్... స్కీమ్ వివరాలివే
ఈ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా రిజిస్టర్ అయింది. ఈ కార్పొరేషన్ 12 నుంచి 60 నెలల మెచ్యూరిటీతో క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌ను అందిస్తోంది. నెలవారీ, త్రైమాసికం వారీగా వడ్డీ చెల్లించే ఆప్షన్‌ను సైతం ఖాతాదారులు ఎంచుకోవచ్చు. ఒక సంవత్సరం మెచ్యూరిటీ ఉండే ఎఫ్డీలపై సంస్థ 7 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. మెచ్యూరిటీ వ్యవధి పెరిగే కొద్దీ వడ్డీ రేటు 0.25 శాతం చొప్పున పెరుగుతుంది. ఇలా 5 సంవత్సరాల కాలానికి డిపాజిటర్లు FDపై 8 శాతం వడ్డీ పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.25 శాతం నుంచి వడ్డీరేటు ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం 0.25 శాతం చొప్పున పెరుగుతుంది. వీరు ఐదేళ్ల ఎఫ్డీలపై అత్యధికంగా 8.5 శాతం వరకు వడ్డీరేటును పొందవచ్చు.
Home Loan: హోమ్ లోన్ ఈఎంఐ చెల్లిస్తున్నారా? రూ.10 లక్షల వడ్డీ తగ్గించుకోండి ఇలా
తమిళనాడు ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీరేట్లను అందిస్తోంది. రెండు సంవత్సరాల కనీస మెచ్యూరిటీతో ప్రారంభమయ్యే ఎఫ్డీలపై ఈ సంస్థ 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. మెచ్యూరిటీ వ్యవధిని మూడు సంవత్సరాల వరకు పొడిగిస్తే.. వడ్డీ రేటు 0.50 శాతం పెరుగుతుంది. ఐదు సంవత్సరాల పాటు అందించే ఎఫ్డీలపై వడ్డీ రేటు 8 శాతం వరకు ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు 7.5 శాతం నుంచి ప్రారంభమవుతాయి. మెచ్యూరిటీ వ్యవధి పెరిగే కొద్దీ 0.25 శాతం చొప్పున వడ్డీ పెరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Banking, Personal Finance, Save Money