Home /News /business /

Success Story: వీళ్ల స్టార్ట్ అప్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! అదిరిపోయే బిజినెస్..

Success Story: వీళ్ల స్టార్ట్ అప్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! అదిరిపోయే బిజినెస్..

హైదరాబాద్ యువకుల వినూత్న స్టార్టప్

హైదరాబాద్ యువకుల వినూత్న స్టార్టప్

వివిధ రకాల కంపెనీలను మనం నిత్యం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా స్టార్ట్ అప్ కంపెనీలు ఎక్కువగా సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ రంగాలపై ఆధారపడి తమ పరిశ్రమలను స్థాపిస్తు ఉంటాయి.

  M. Bala Krishna, Hyderabad, News18

  వివిధ రకాల కంపెనీలను మనం నిత్యం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా స్టార్ట్ అప్ కంపెనీలు (Start up Companies) ఎక్కువగా సాఫ్ట్ వేర్ (Software), హార్డ్ వేర్ (Hard ware)  రంగాలపై ఆధారపడి తమ పరిశ్రమలను స్థాపిస్తు ఉంటాయి. కానీ ఈ నలుగురు తెలివైన వ్యాపారవేత్తలు మాత్రం స్టార్ట్ అప్ లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్యూర్ ఇన్ ఫుడ్ పేరుతో పరిశ్రమ నెలకొల్పారు. వినూత్న స్టార్ట్ అప్ కు నాంది పలకాలని ప్రశాంత్ బండి, అరవింద్ కొలను, కుషాల్ ఎర్రంశెట్టి, రోహిత్ ఎర్రంశెట్టిలు చేతులు కలిపారు. వీరు ప్రారంభించిన పరిశ్రమ ఫుడ్ టెక్ స్టార్టప్. ఇది ఆహారాన్ని శుభ్రపరిచే సాంకేతికతతో కూడిన కంపెనీ. ఆహార పదార్థాలను శుభ్రం చేసి.. పంటలకు వాడే రసాయనాలు, క్రిమి సంహారక మందుల అవసేషాలను తొలగించే యంత్రాలను అందిస్తుంది. ఆలాగే పండించిన ఆహార ఉత్పత్తులు ఆర్గానిక్ అవునా..? కాదా..? అనే సరిఫికేషన్ (Organic Certification) ఇస్తుంది ఈ స్టార్ట్ అప్ కంపెనీ.

  మనం తినే ఆహారం ఎంతో స్వచ్చంగా ఆరోగ్యానికి హాని కలిగించని పదార్థాలను తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం. ప్యూర్ ఇన్ స్టార్ట్ అప్ కంపెనీ ఆహారంలో ఎలాంటి పెస్టిసైడ్స్, కాలుష్య రహిత పదార్థాలను అందించేస్తోంది. అందుకు నిదర్శనంగా వారి వద్ద వివిధ లాబ్స్ లో ఇచ్చిన రిపోర్ట్స్, వారి కార్యాలయంలో ఉంచిన టీ-హబ్ ద్వారా వారు ఎలా ఆహార పార్ధాలను శుద్ధి చేస్తారో తెలుసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు కాలుష్య రహిత ఆహారాన్ని అందించాలని, స్వచ్ఛమైన ఆహార పదార్థాలను ప్రజలు ఆస్వాదించాలనేది కంపెనీ నిర్వాహకుల ముఖ్యకోరిక.

  ఇది చదవండి: విశాఖలో రియల్ ఎస్టేట్ కు రెక్కలు.. భారీగా పెరిగిన ఫ్లాట్ల ధరలు


  అందుకు వీరు ఎంతో కస్టపడి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్రాలను రూపొందించారు. మూడున్నరేళ్లు ఆర్ అండ్ డి ఫలితంగా అధునాతన నానో ఏవోపితో యంత్ర టెక్ ద్వారా సహజసిద్ధమైన ప్యూరిఫైయర్ ను రూపొందించారు. ఇవి ఆహార పదార్ధాల్లో పేరుకున్న పెస్టిసిడ్స్ ను తొలగించి.., పోషకాలను ఉంచేలా చేస్తాయి. USFDA, FSSAI ప్రమాణాలకు అనుగుణంగా సురక్షితమైనదిగా చెప్తున్నారు. పండ్లు కూరగాయల నుంచి మాంసాహారాల వరకు యాంటీ బయోటిక్స్, హార్మోన్స్ లలో ఉండే 90% పురుగుల మందు, రసాయనాలను నిర్మూలిస్తుంది. సజీవంగా ఉండే క్రిములు., సూక్ష్మ జీవులు., వైరస్ లు ఇతర వ్యాధులకు కారకమైయ్యే వ్యాధి కారకాలను ఎటువంటి రసాయనాలు., బ్లీచింగ్ పద్ధతులు లేకుండా తొలగిస్తున్నారు.

  ఇది చదవండి: ఈ కుర్రాడి అభిరుచి చాలా డిఫరెంట్.. అతడి పెరట్లో మొక్కలు చూస్తే నోరెళ్లబెడతారు..


  ‘విప్లవాత్మక నానో AOP ఫార్ములాతో ముందుగా వండిన పండ్లు, కూరగాయలు, మాంసాలు, పౌల్ట్రీ మరియు స్టేపుల్స్‌ను కూడా శుద్ధి చేయడం ద్వారా వినియోగదారు ఆరోగ్యంగా జీవించాలని మా అభిలాష. వాస్తవానికి దానిని సాధించడం పూరిన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉత్పత్తులకు దాని రుచి లేదా పోషక విలువలను ప్రభావితం చేయకుండా అందించబడుతుంది’ అంటూ న్యూస్18 తో పంచుకున్నారు ప్రశాంత్ బండి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Business Ideas, Hyderabad, Start-Up

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు