Home /News /business /

THESE FOUR THINGS TO REMIND BEFORE GOING FOR A CAR LOAN SU GH

Car Loan: కారు లోన్ తీసుకోవాలనుకుంటున్నారా?.. అయితే, ఈ నాలుగు విషయాలను తప్పక తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రుణాలపై వడ్డీ రేట్లు ఆల్​టైమ్​ కనిష్ఠానికి చేరాయి. దీనికి తోడు పండగ సీజన్ కారణంగా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. మరోవైపు, బ్యాంకులు కారు లోన్లను కూడా చాలా సరళతరం చేశాయి. దీంతో, కారు కొనాలనుకునే వారికి ఇది చక్కటి సమయంగా చెప్పవచ్చు.

ఇంకా చదవండి ...
రుణాలపై వడ్డీ రేట్లు ఆల్​టైమ్​కనిష్ఠానికి చేరాయి. దీనికి తోడుపండగ సీజన్ కారణంగా బ్యాంకులు వడ్డీ రేట్లు (interest rates) తగ్గిస్తున్నాయి. మరోవైపు, బ్యాంకులు కారు లోన్లనుకూడా చాలా సరళతరం చేశాయి. దీంతో,కారు కొనాలనుకునే వారికి ఇది చక్కటి సమయంగా చెప్పవచ్చు. అయితే, ఈఎంఐతో కార్లు కొనాలనుకునే వారు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.ముందుగా కొన్ని అంశాలను చెక్​ చేసుకొని.. కార్​లోన్​ కోసం ముందుకెళ్లాలి.

ఇలా చెక్ చేసుకోండి
కారు కొనాలనుకుంటున్నవారు ముందుగా రుణ అర్హత సామర్థ్యం చెక్ చేసుకోండి. ఏ బ్యాంకులో కారు రుణం తీసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంకు వెబ్ సైటులో కాలుక్యులేటర్ పై రుణ అర్హత తెలుసుకోవచ్చు.

SIP calculator: నెల నెల ఈ ఒక్క పనిచేస్తే రూ.5 కోట్ల భారీ మొత్తం మీ సొంతం..ఎలాగంటే...

వడ్డీ రేట్లు చెక్ చేసుకోండి
ఒక్కో బ్యాంకులో ఒక్కో వడ్డీ రేటు ఉంటుంది. ఏ బ్యాంకు ఎంత వడ్డీకి కారు రుణాలు అందిస్తున్నాయో పరిశీలించండి. ఎందుకంటే కారు డీలర్లు సూచించే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వకపోవచ్చు.

ఎంత అప్పు తీసుకోవాలి
ఎంత లోన్ తీసుకోవాలో ముందే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే కారు ధర కన్నా బడ్జెట్ ఎక్కువ ఉండ కూడదు. రిజిస్ట్రేషన్ ఖర్చులు, బీమా ప్రీమియం, కారు ఎసెసొరీస్ అన్నీ బడ్జెట్లోనే లెక్కించుకోవాలి. షోరూమ్ కు వెళ్లాక సేల్స్ మెన్ ఎక్కువ ధరలుండే కార్లను మీకు సూచించే అవకాశం ఉంది. దీని వల్ల మీ బడ్జెట్ పెరిగిపోయే ప్రమాదం ఉంది. డౌన్ పేమెంటు ఏమీ లేకుండానే కారు మొత్తం లోన్ లో వస్తుందని ఎట్టి పరిస్థితుల్లో బడ్జెట్ పెంచుకోవద్దు. ఈఎంఐ పెరిగిపోతే ఇతర అవసరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. మీ అవసరాలు గుర్తించి, ముందుగా మీరు చెల్లించే డౌన్ పేమెంటు, లోన్ మొత్తం కలపి బడ్జెట్లో కారు కొనుగోలు చేయాలని ఆర్థిక నిపుణుడు సేన్ సూచిస్తున్నారు. ఇక, కారు తీసుకున్న సమయం నుంచి కొత్తగా ఈఎంఐ జతవుతుంది. కాబట్టి ముందుగానే ఇంటి ఖర్చులు, మనమీద ఆధారపడేవారి ఖర్చులు కూడా పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. ఒక వేళ ఈఎంఐ గనుక మీ యొక్క ఆర్థిక సామర్థ్యం దాటిపోతే మాత్రం మీరు అప్పుల్లో కూరుకుపోతునట్టే లెక్క. ఇవన్నీ పరిశీలించి ఈఎంఐ నిర్ణయించుకోవాలి.

Sasikala: నాలుగేళ్ల క్రితం జయలలిత సమాధి వద్ద శపథం చేసిన శశికళ.. నేడు అమ్మ స్మారకం వద్ద భావోద్వేగంతో ఏం చెప్పారంటే...

రుణ కాల పరిమితి
ఎంత కాలానికి రుణం ( Loan tenure) తీసుకోవాలనేది మన ఆర్థిక ప్రణాళికను ప్రభావితం చేస్తుంది. ఒకవేళ ఐదు సంవత్సరాల కాల పరిమితికి తీసుకుంటే ఈఎంఐ తగ్గుతుంది. అయితే వడ్డీ రూపంలో ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ముందు ముందు మన ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి పెరిగే ఖర్చులు, మన ఆదాయం పెరిగే అవకాశాలు అన్నీ అంచనా వేసుకుని రుణం వ్యవధినిర్ణయించుకోవాలని ఆర్థిక నిపుణుడు సేన్ చెబుతున్నారు.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Bank loans, Car loans

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు