Home /News /business /

THESE FOUR CHANGERS ARE LIKELY TO COME IN MAY CHECK HERE BA GH

మేలో బ్యాంకులో 4 రాళ్లు వెనకేసుకుందామనుకున్నారా.. ఈ 4 మార్పులు తెలుసుకోండి.. మీ పాకెట్ చూసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Financial Policy Changes in May | మే నెల ప్రారంభమైంది. ఈ నెలలో రుణాలపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు బ్యాంక్ టారిఫ్‌లను మార్చనున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో, స్వింగ్ ప్రైసింగ్ మెకానిజం అమలు చేసే అవకాశం ఉంది.

మే నెల ప్రారంభమైంది. ఈ నెలలో రుణాలపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు బ్యాంక్ టారిఫ్‌లను మార్చనున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో, స్వింగ్ ప్రైసింగ్ మెకానిజం అమలు చేసే అవకాశం ఉంది. అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు తమ సొంత పథకాలలో ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. మే నెలలో చోటుచేసుకోనున్న కీలక ఆర్థిక పరిణామాలు ఇవే..

గృహ, వాహన రుణాల రేట్లు పెరగవచ్చు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా , కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏప్రిల్‌లో తమ బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచాయి. SBI అన్ని కాల వ్యవధికి సంబంధించిన MCLRను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. మిగిలిన మూడు బ్యాంకులు ఐదు బేసిస్ పాయింట్లు పెంచాయి. ఒక బేస్‌ పాయింట్ అనేది ఒక శాతంలో నూరవ వంతు.
SBI MCLR ఒక సంవత్సరం కాలవ్యవధికి 7.1 శాతం, రెండు సంవత్సరాలకు 7.3 శాతం, మూడు సంవత్సరాలకు 7.4 శాతం. యాక్సిస్ బ్యాంక్ MCLR మూడు సంవత్సరాలు వరుసగా 7.4 శాతం, 7.5 శాతం, 7.55 శాతం.

SBI Car Loan Offer: కొత్త కార్ కొంటే 100 శాతం ఫైనాన్స్... ఆ మోడల్‌పై ఎస్‌బీఐ ఆఫర్MCLR అనేది వివిధ రకాల రుణాలపై కనీస వడ్డీ రేటును నిర్ణయించడంలో సహాయపడటానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చిన అంతర్గత సూచీ రేటు. చివరి రేటులో రిస్క్ ప్రీమియం, బ్యాంకులు వసూలు చేసే స్ప్రెడ్‌లు ఉంటాయి. MCLR లింక్డ్ లోన్ రుణగ్రహీతల కోసం, రుణ ఒప్పందం ప్రకారం వడ్డీ రేటు రీసెట్ చేస్తారు. సాధారణంగా MCLR లింక్డ్ హోమ్ లోన్‌లు తీసుకున్న తర్వాత ప్రతి ఆరు లేదా 12 నెలలకు ఒకసారి రీసెట్ నిబంధనలు అమలవుతాయి.

Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు బంగారు నగలు కొంటున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి


సేవింగ్స్, శాలరీ అకౌంట్‌ ఛార్జీలు
మే 1 నుంచి కోటక్ మహీంద్రా బ్యాంక్ సేవింగ్స్, శాలరీ అకౌంట్‌ ఖాతాదారులకు కొత్త నిబంధనలను వర్తింపజేస్తుంది. మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోతే విధించే ఛార్జీలను బ్యాంకులు పెంచాయి. ఈ మినిమమ్‌ బ్యాలెన్స్‌ అకౌంట్‌ను బట్టి రూ.500 లేదా రూ.600గా ఉంటుంది. ఖాతాలో తక్కువ ఉన్న మొత్తానికి 5 శాతం లెక్కన రూ.50 ఛార్జ్‌ చేస్తారు.

LIC IPO: ఎల్ఐసీ ఐపీఓకి అప్లై చేస్తారా? ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే ఆఫర్


అసంపూర్ణమైన, అస్పష్టమైన సంతకాలతో సహా ఆర్థికేతర కారణాల కోసం జారీ చేసిన, తిరిగి వచ్చిన (రిటర్న్‌డ్) చెక్కుల కోసం బ్యాంక్ రుసుములను కూడా ప్రవేశపెడుతుంది. ఒక్కో సందర్భంలో కస్టమర్‌కు రూ.50 ఖర్చు అవుతుంది. డిపాజిట్ చేసిన, తిరిగి వచ్చిన చెక్కుల ఛార్జీలు అలాగే స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ ఫెయిల్యూర్ ఫీజులు పెరిగాయి.

HDFC బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఆ లోన్లపై వడ్డీ రేట్ల పెంపు.. వివరాలివేమ్యూచువల్‌ ఫండ్స్‌లో స్వింగ్‌ ప్రైసింగ్‌
మే 1 నుంచి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ పథకాలకు స్వింగ్ ధరలను అమలు చేస్తుంది. ఇది పెద్ద పెట్టుబడిదారులు ఆకస్మికంగా పెట్టుబడులను ఉపసంహరించుకోకుండా అడ్డుకొనే లక్ష్యంతో తీసుకొచ్చారు. మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలోకి ప్రవేశించడం, నిష్క్రమించడం.. ప్రత్యేకించి మార్కెట్ డిస్‌లోకేషన్ సమయంలో న్యాయంగా వ్యవహరించే లక్ష్యంతో కొత్త ఫ్రేమ్‌వర్క్ మార్చి 1 నుండి అమలుకావలసి ఉండగా ఆలస్యమైంది. స్వింగ్ ప్రైసింగ్ ఫ్రేమ్‌వర్క్ అధిక రిస్క్, ఓపెన్ ఎండ్ డెట్ స్కీమ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే వాటిల్లో రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. అన్ని అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్‌లలో స్వింగ్‌ ప్రైస్‌ ఎలా పని చేస్తుంది, ఎలాంటి ప్రభావం కనిపిస్తుందనేది నమోదు చేయాలి. సాధారణ సమయాల్లో, మార్కెట్ డిస్‌లోకేషన్ సమయంలో ఒక్కో మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు రూ.2 లక్షల వరకు రిడెంప్షన్‌లకు అనుమతి ఉంటుంది. పాన్ స్థాయిలో యూనిట్ హోల్డర్‌లందరికీ స్వింగ్ ధర వర్తిస్తుంది.

Business Idea: ఇంటి నుంచే ఈ బిజినెస్ చేయొచ్చు.. నెలకు కనీసం రూ. 20 వేలు పొందే ఛాన్స్.. వివరాలివేసొంత పథకాల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు AMCలు
సెబీ నిబంధనల ప్రకారం మే నుంచి ఫండ్ హౌస్‌లు తమ సొంత పథకాల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అసెట్‌ మేనేజర్‌లు, ఇన్వెస్టర్‌లను ఒకే మార్గంలో ఉండేలా చూసేందుకు అమలు చేస్తున్నారు. AMCలు వారి సొంత మ్యూచువల్ ఫండ్ పథకాలలో 0.03 శాతం నుంచి 0.13 శాతం వరకు పెట్టుబడి పెడతాయి. స్కీమ్ రిస్క్ స్థాయిని బట్టి అటువంటి పెట్టుబడుల పరిధి మారుతూ ఉంటుంది. రిస్క్-ఓ-మీటర్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం రిస్క్ స్థాయి నిర్ణయిస్తారు. AMCలు తమ సొంత స్కీమ్‌లలో పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Bank charges, Home loan, Money, Mutual Funds

తదుపరి వార్తలు