Home /News /business /

THESE FIVE BANKS OFFERS THE LOWEST INTEREST RATE IN PERSONAL LOANS UMG GH

పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా..? తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తున్న టాప్ 5 బ్యాంకులు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం తక్కువ వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలను అందజేస్తున్న టాప్-5 బ్యాంకుల జాబితాను పరిశీలిద్దాం. 

అత్యవసరమైన సందర్భాల్లో చాలా మంది పర్సనల్ లోన్స్‌ ప్రిఫర్ చేస్తుంటారు. పైగా బ్యాంకులు ఎటువంటి పత్రాలను తాకట్టుపెట్టుకోకుండా, వేగంగా వ్యక్తిగత రుణాలను అంద‌జేస్తున్నాయి. అయితే, క్రెడిట్ స్కోర్ 750 దాటి ఉన్న వారికి మాత్రమే రుణదాతలు ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటప్పుడు వ‌డ్డీ రేట్లు కూడా త‌క్కువ ఉండే అవ‌కాశ‌ముంది. క్రెడిట్ స్కోర్ త‌క్కువున్న వారికి కూడా కొన్ని రుణ సంస్థలు రుణాలు ఇస్తుంటాయి, కానీ అధిక వ‌డ్డీ వ‌సూలు చేస్తాయి. ప్రస్తుతం తక్కువ వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలను అందజేస్తున్న టాప్-5 బ్యాంకుల జాబితాను పరిశీలిద్దాం.

పంజాబ్ నేషనల్ బ్యాంకు
ప్రస్తుతం ఈ బ్యాంకు వ్యక్తిగత రుణాలను సంవత్సరానికి 8.80-15.35 శాతం వడ్డీ రేటుతో అందిస్తోంది. ఐదేళ్ల కాలపరిమితితో రూ.5 లక్షలు పర్సనల్ లోన్ తీసుకుంటే, కస్టమర్లు చెల్లించాల్సిన ఈక్వేటెడ్ మంథ్లీ ఇన్‌స్టాల్‌మెంట్ (EMI) రూ. 10,331-11,987గా ఉంటుంది. ఈ బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజును అదనంగా వసూలు చేస్తుంది. ఇది లోన్ మొత్తంలో ఒక శాతం వరకు ఉంటుంది.

ఇదీ చదవండి: ప్రపంచ కుబేరులు ఊరికే కారు.. ఇవిగో వాళ్లల్లో కామన్ క్వాలిటీస్ ఇవే..!


ఎస్‌బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 9.80-13.80 శాతం వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. ఐదేళ్ల కాలపరిమితితో రూ. 5 లక్షల రుణంపై ఈఎంఐ రూ.10,574-11,582గా ఉంటుంది. ఎస్బీఐ పర్సనల్ లోన్లపై ప్రాసెసింగ్ ఫీజు (మొత్తం లోన్ మొత్తంలో ఒక శాతంగా) కూడా వసూలు చేస్తుంది. 1.5 శాతం లేదా రూ. 15,000, ఏది తక్కువైతే అంత మొత్తాన్ని బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా
ఈ బ్యాంకు వ్యక్తిగత రుణంపై సంవత్సరానికి 9.20-16.55 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తోంది. మీరు ఐదేళ్ల కాలపరిమితితో రూ.5 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంటే, EMI నెలకు దాదాపు రూ.10,428-12,306గా ఉండనుంది. మొత్తం లోన్‌లో 2 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కనిష్టంగా రూ.1,000 గరిష్టంగా రూ.10,000 వరకు ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
ఈ బ్యాంకు 9.35 - 13.70 శాతం మధ్య వడ్డీ రేట్‌తో వ్యక్తిగత రుణాలను అందజేస్తుంది. ఐదేళ్ల కాలపరిమితితో రూ.5 లక్షల రుణంపై నెలవారీ ఈఎంఐ దాదాపు రూ.10,464-11,557గా ఉంటుంది. వీటికి అదనంగా మొత్తంలోన్‌లో ఒక శాతం ప్రాసెస్ ఫీజుగా వసూలు చేయనుంది.



యూనియన్ బ్యాంకు
మిగతా వాటితో పోల్చితే అత్యధిక వడ్డీని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వసూలు చేస్తుంది. ఇది వ్యక్తిగత రుణాలపై సంవత్సరానికి 9.8-13.9 శాతం శ్రేణిలో వడ్డీని వసూలు చేస్తుంది. ఐదేళ్ల కాలపరిమితితో రూ.5 లక్షల రుణం తీసుకుంటే, నెలకు రూ.10,574-11,608 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

కాగా, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లతో సహా దాదాపు అన్ని బ్యాంకులు ఇటీవల తమ డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్లను పెంచాయి. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఇటీవల రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90 శాతానికి పెంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ నిర్ణయం రుణాలపై వడ్డీ రేట్లను పెంచడానికి బ్యాంకులను ప్రేరేపించింది.
Published by:Mahesh
First published:

Tags: Banks, BUSINESS NEWS, Interest rates, Personal Loan

తదుపరి వార్తలు