PM Kisan Yojana | కేంద్రం ప్రభుత్వం 13వ విడత పీఎం కిసాన్ డబ్బులను రైతులకు అందించడానికి రెడీ అవుతోంది. త్వరలోనే ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే ఈ డబ్బులు కొంత మంది రైతులకు (Farmers) లభించపోవచ్చని నివేదికలు వెలువడుతున్నాయి. దీని వల్ల కొంత మంది రైతులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా ఫిబ్రవరి 10లోపు పీఎం కిసాన్ స్కీమ్ రైతులు కచ్చితంగా ఆధార్ (Aadhaar) నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్, ఎన్‌పీసీఐతో లింక్ చేసుకోవాలి.
డీబీటీ అగ్రికల్చర్ బీహార్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. ఒకవేళ ఎవరైతే రైతులు వారి బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ నెంబర్‌ను లింక్ చేసుకోకపోతే.. వారికి పీఎం కిసాన్ డబ్బులు రాకపోవచ్చు. బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ కాకపోతే అప్పుడు డీబీటీ అనేది ఎనెబుల్ కాదు. ఇలాంటి రైతులు వెంటనే పోస్టాఫీస్‌కు వెళ్లి డీబీటీ ఎనెబుల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ)లో ఖాతా తెరవాలి.
నిర్మలా సీతారామన్ పండుగ శుభవార్త.. జీఎస్‌టీ భారీగా తగ్గింపు.. దిగిరానున్న వీటి ధరలు!
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హత కలిగిన రైతులు డబ్బులు పొందాలని భావిస్తే.. కచ్చితంగా ఇకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆధార్ కార్డు సాయంతో ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. దీనికి రూ. 15 ఖర్చు అవుతుంది.
ఎలక్ట్రిక్ కారు కొంటే రూ.లక్షా 65 వేల డిస్కౌంట్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 430 కి.మి వెళ్లొచ్చు!
ఇలా బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ చేసుకున్న వారికి, అలాగే ఇకేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే వచ్చే విడత పీఎం కిసాన్ డబ్బులు అందుతాయని చెప్పుకోవచ్చు. ఈ రెండూ చేసుకోని వారికి, లేదంటే ఒకటి చేసి మరొకటి చేసుకోని వారికి కూడా డబ్బులు రావని గుర్తించుకోవాలి. అందువల్ల ఆలస్యం చేయకుండా రైతులు ఇంకా ఎవరైనా ఉంటే.. ఈ పనులు వెంటనే పూర్తి చేసుకోండి.
కాగా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24న పీఎం కిసాన్ స్కీమ్ 13వ విడత డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయొచ్చనే అంచనాలు ఉన్నాయి. అందువల్ల మీరు మీరు వెంటనే ఇకేవైసీ వంటివి పూర్తి చేసుకోండి. కాగా జగన్ సర్కార్ కూడా రైతు భరోసా డబ్బులను ఫిబ్రవరి 24న రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. రైతులు ఒకేసారి డబుల్ ధమాకా పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, Bank account, Banks, Farmers, PM KISAN, PM Kisan Scheme