THESE CENTRAL GOVERNMENT EMPLOYEES DEARNESS ALLOWANCE IS HIKED CHECK FULL DETAILS BA GH
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. డీఏ పెంపు.. ఎంత?, ఎప్పటి నుంచి అమల్లోకి.. వివరాలివే
ప్రతీకాత్మకచిత్రం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శుభవార్త. 5వ సెంట్రల్ పే కమీషన్, 6వ సెంట్రల్ పే కమీషన్ (CPC) ప్రీ-రివైజ్డ్ పే స్కేల్ లేదా గ్రేడ్ పేలో తమ వేతనాన్ని డ్రా చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శుభవార్త. 5వ సెంట్రల్ పే కమీషన్, 6వ సెంట్రల్ పే కమీషన్ (CPC) ప్రీ- రివైజ్డ్ పే స్కేల్ లేదా గ్రేడ్ పేలో తమ వేతనాన్ని డ్రా చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance hike) పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు డీఏ పెంపు వర్తిస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను ఆఫీస్ మెమోరాండం రూపంలో కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది.
5వ CPCకి సంబంధించిన ప్రీ-రివైజ్డ్ పే స్కేల్ లేదా గ్రేడ్ పేలో వేతనాన్ని డ్రా చేసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. ఇప్పటికే ఉన్న 368 శాతం నుంచి 381 శాతానికి కేంద్రం DAను పెంచింది. 6వ CPC కి సంబంధించిన ప్రీ-రివైజ్డ్ పే స్కేల్ లేదా గ్రేడ్ పేలో వేతనాన్ని డ్రా చేసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. డీఏను 196 శాతం నుంచి 203 శాతానికి కేంద్రం పెంచింది. ఈ కొత్త DA జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం తెలియజేసింది.
మెమోరాండంలో ఏముందంటే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు.. 6వ CPC ప్రీ-రివైజ్డ్ పే స్కేల్లో వేతనాలు తీసుకునే వారికి డీఏ పెంచినట్లు ఆర్థిక శాఖ మెమోరాండం తెలిపింది. ‘6వ కేంద్ర వేతన సంఘం ప్రకారం ప్రీ-రివైజ్డ్ పే స్కేల్/గ్రేడ్ పేలో తమ వేతనాన్ని కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వ, కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థల ఉద్యోగులకు సంబంధించి డియర్నెస్ అలవెన్స్ రేటు ప్రస్తుతమున్న 196% నుంచి 203 % వరకు పెరుగుతుంది. ఈ పెంపు జనవరి 1, 2022 నుంచి వర్తిస్తుంది’ అని మెమోరాండం పేర్కొంది.
ఆర్థిక శాఖ ఆఫీస్ మెమోరాండంలో.. ‘5వ సెంట్రల్ పే కమీషన్ ప్రకారం ప్రీ-రివైజ్డ్ పే స్కేల్/గ్రేడ్ పేలో వేతనాలను డ్రా చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ, కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థల ఉద్యోగులకు సంబంధించి డియర్నెస్ అలవెన్స్ (DA) ప్రస్తుతం ఉన్న 368% నుంచి 381% వరకు పెరిగింది. ఇది జనవరి 1, 2022 నుంచి వర్తిస్తుంది’ అని వెల్లడించింది. దీంతో ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.