హోమ్ /వార్తలు /బిజినెస్ /

Interest Rates: లెండింగ్ వడ్డీ రేట్లను మళ్లీ పెంచిన బ్యాంకులు.. రుణ గ్రహీతలపై మరింత భారం..

Interest Rates: లెండింగ్ వడ్డీ రేట్లను మళ్లీ పెంచిన బ్యాంకులు.. రుణ గ్రహీతలపై మరింత భారం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Banks: హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్‌బీ, యూనియన్ బ్యాంక్, ఆర్‌బీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్ తమ బెంచ్‌మార్క్ లెండింగ్ వడ్డీ రేట్ల (Interest Rates)ను భారీగా పెంచేశాయి. ఏ బ్యాంకులు ఎంత మేర రేట్లు పెంచాయి? దీనివల్ల కస్టమర్లపై ఎలాంటి ప్రభావం పడనుంది? వంటి వివరాలు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Delhi, India

ఇటీవల కాలంలో ఆర్‌బీఐ (RBI) ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసేందుకు రేపో రేటు భారీగా పెంచుతోంది. గత శుక్రవారం (సెప్టెంబర్ 30) కూడా ఆర్‌బీఐ రేపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆ వెంటనే చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు షాక్ ఇచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్‌బీ, యూనియన్ బ్యాంక్, ఆర్‌బీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్ తమ బెంచ్‌మార్క్ లెండింగ్ వడ్డీ రేట్ల (Interest Rates)ను భారీగా పెంచేశాయి. ఏ బ్యాంకులు ఎంత మేర రేట్లు పెంచాయి? దీనివల్ల కస్టమర్లపై ఎలాంటి ప్రభావం పడనుంది? వంటి వివరాలు తెలుసుకుందాం.

లెండింగ్ వడ్డీ రేట్లను బ్యాంకులు పెంచడం వల్ల రుణగ్రహీతలు తమ లోన్ల ఈఎంఐలకు ఎక్కువ మనీ చెల్లించాల్సి వస్తుంది. ఆర్‌బీఐ శుక్రవారం రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచగా అది 5.9 శాతానికి చేరుకుంది. రెపో రేటు అనేది కమర్షియల్ బ్యాంక్స్‌కి ఇచ్చే లోన్లపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటు. ఈ రేటు పెరగడం వల్ల బ్యాంక్స్‌పై కూడా ప్రభావం పడుతుంది.

* డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపు

లెండింగ్ వడ్డీరేట్లతోపాటు బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచుతున్నాయి. వీటివల్ల డబ్బులు దాచిన వారికి ఎక్కువ వడ్డీ అందుతుంది. ఆర్‌బీఐ రేపో రేటు పెరిగాక RBL బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి.

* బీఓబీ, పీఎన్‌బీ లెండింగ్ రేట్లు పెంపు

తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా తన రేపో-లింక్డ్‌ లెండింగ్ రేటును 50 బేసిక్ పాయింట్ పెంచగా ఇప్పుడు ఆ బ్యాంక్ లెండింగ్ రేట్ 8.45 శాతానికి ఎగబాకింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ని సవరించింది. అక్టోబర్ 1 నుంచి ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి. పీఎన్‌బీలో ఒక నెల MCLR ఇప్పుడు 7.15 శాతంగా ఉంది. బ్యాంక్ బేస్ రేటు కూడా 8.75 శాతం నుంచి 8.80 శాతానికి పెరిగింది. రెపో-లింక్డ్ లెండింగ్ రేటు (RLLR) కింద వడ్డీ రేటు 7.90 శాతం నుంచి 8.40 శాతానికి మారుతుంది.

* హెచ్‌డీఎఫ్‌సీ

హెచ్‌డీఎఫ్‌సీ తన లెండింగ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు మేర పెంచింది. "హెచ్‌డీఎఫ్‌సీ హౌసింగ్ లోన్లపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (RPLR)ని 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఈ రేట్లు అక్టోబరు 1, 2022 నుంచి అమల్లోకి వస్తాయి" అని ఆ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.

* ప్రైవేట్ బ్యాంక్స్

ప్రైవేట్ రంగ ఇండస్‌ఇండ్ బ్యాంక్ తన MCLRని వివిధ కాల పరిమితులకు 5-10 బేసిస్ పాయింట్లు పెంచింది. పెరిగిన రేట్ల వల్ల ఓవర్‌నైట్ నుంచి మూడేళ్ల వరకు MCLR ఇప్పుడు 8.30 శాతం - 9.80 శాతం మధ్య ఉంది. RBL బ్యాంక్ తన లెండింగ్ రేటును 20 బేసిస్ పాయింట్ల మేరకు పెంచింది. దీని ఓవర్‌నైట్ నుంచి వన్ ఇయర్ MCLR ఇప్పుడు 8.25-9.45 శాతం మధ్య ఉంటుంది. LIC హౌసింగ్ ఫైనాన్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా తమ రుణ రేట్లను వరుసగా 15 బేసిస్ పాయింట్లు, 10 బేసిస్ పాయింట్లు పెంచాయి.

Published by:Paresh Inamdar
First published:

Tags: Banks, Delhi, Interest rates