THESE BANKS AND HOUSING FINANCE COMPANIES OFFER THE CHEAPEST HOME LOANS GH VB
Home loans: తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్న బ్యాంకులివే.. కనిష్టానికి పడిపోయిన గృహరుణ వడ్డీ రేట్లు..
ప్రతీకాత్మక చిత్రం
Home loans: కొత్త సంవత్సరంలో వడ్డీ రేట్లు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందువల్ల ఇప్పుడే హోమ్ లోన్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ప్రస్తుతం ఏ బ్యాంకు ఎంత వడ్డీకి హోమ్ లోన్ ఆఫర్ చేస్తుందో తెలుసుకుందాం.
సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఎక్కువ మంది హోమ్లోన్లను ఆశ్రయిస్తుంటారు. తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తుండటంతో పాటు, ఎక్కువ రీపేమెంట్(Repayment) వ్యవధి ఉండటంతో హోమ్‌లోన్(Home Loan) వైపు ఎక్కువ మంది మొగ్గుచూపుతుంటారు. అయితే, మీరు కూడా హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే సరైన సమయం. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్‌టైమ్ కనిష్టానికి వడ్డీ రేట్లు(interest Rates) పడిపోయాయి. ప్రస్తుతం అనేక బ్యాంకులు(Banks), ఫైనాన్షియల్(Financial) సంస్థలు అతి తక్కువ వడ్డీకే హోమ్లోన్ల(Home Loans)ను ఆఫర్ చేస్తున్నాయి. అయితే కొత్త సంవత్సరంలో(New Year) వడ్డీ రేట్లు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందువల్ల ఇప్పుడే హోమ్ లోన్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ప్రస్తుతం ఏ బ్యాంకు ఎంత వడ్డీకి హోమ్ లోన్ ఆఫర్ చేస్తుందో తెలుసుకుందాం.
పంజాబ్ అండ్ సింద్, యూనియన్ బ్యాంక్..
ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ & సింద్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లోనే అతి తక్కువ వడ్డీకి హోమ్‌లోన్ ఆఫర్ చేస్తున్నాయి. కేవలం 6.4 శాతం వడ్డీకే హోమ్ లోన్లను మంజూరు చేస్తున్నాయి. తద్వారా, 20 సంవత్సరాల రీపేమెంట్ వ్యవధిలో రూ. 75 లక్షల గృహ రుణాలపై మీరు రూ. 55,477 నెలవారీ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank)..
ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులు కేవలం 6.5 శాతం వడ్డీ రేటు వద్ద గృహరుణాలు మంజూరు చేస్తున్నాయి.
కోటక్ మహీంద్రా బ్యాంక్(Kotak Mahindra Bank)..
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఏడాది ప్రారంభంలో హోమ్‌లోన్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ప్రస్తుతం 6.55 శాతం వడ్డీ రేటుకే హోమ్‌లోన్ ఆఫర్ చేస్తుంది. మీరు 20 సంవత్సరాల కాలవ్యవధితో రూ. 75-లక్షల హోమ్ లోన్ తీసుకుంటే, రూ. 56,139 నెలవారీ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్(Lic Housing Finance)..
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కేవలం 6.66 శాతం వద్ద హోమ్‌లోన్ ఆఫర్ చేస్తుంది. మీరు 20 సంవత్సరాల కాలవ్యవధితో రూ. 75 -లక్షల హోమ్ లోన్ తీసుకుంటే, రూ. 56,627 నెలవారీ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర బ్యాంకుల్లో ఇలా..
అన్ని బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు పండుగ సీజన్లో పోటాపోటీగా హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చాయి. దీంతో, అన్ని బ్యాంకుల్లో హోమ్‌లోన్ వడ్డీ రేట్లు ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయాయి. హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫిన్సర్వ్, టాటా క్యాపిటల్ ప్రస్తుతం 6.7 శాతం వడ్డీకే హోమ్‌లోన్ ఆఫర్ చేస్తున్నాయి. ఈ బ్యాంకుల్లో మీరు 20 ఏళ్ల కాలపరిమితితో రూ. 75 లక్షల గృహ రుణం తీసుకుంటే రూ. 56,805 నెలవారీ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.