Banking Mutual Funds: బ్యాంకింగ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో 50 శాతానికి పైగా రాబడి.. వివరాలివే..

ప్రతీకాత్మాకచిత్రం

వ్యాల్యూ రిసెర్చ్ వెబ్ సైట్ ప్రకారం బ్యాంకింగ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ భాగం గత ఏడాది కాలంగా 50 శాతానికి పైగా రాబడులు సాధించినట్లు తేలింది. వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌పై ఆధారపడి ఉంటాయి. అయితే మీరు మార్కెట్‌ను కచ్చితంగా అంచనా వేసే ఫండ్ మేనేజర్లను కలిగి ఉంటే.. వార్షికాదాయం రాకెట్ మాదిరిగా దూసుకెళ్తుంది. వీటి ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం పొందవచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే సూత్రం బ్యాంక్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు కూడా వర్తిస్తుంది. ఇందులో కూడా మెరుగైన రాబడులు పెట్టుబడిదారులకు అందుతాయి. వ్యాల్యూ రిసెర్చ్ వెబ్ సైట్ ప్రకారం బ్యాంకింగ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ భాగం గత ఏడాది కాలంగా 50 శాతానికి పైగా రాబడులు సాధించాయి. వీటిలో ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ బ్యాంకింగ్ అండ్ పైనాన్షియల్ సర్వీసెస్ ప్లాన్, కోటక్ పీఎస్‌యూ బ్యాంక్, ఈటీఎఫ్, నిప్పాన్ ఇండియా బ్యాంకింగ్, ఎస్బీఐ ఈటీఎఫ్ నిఫ్టీ బ్యాంకింగ్, యూటీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్‌లు ఉన్నాయి. ఈ బ్యాంకింగ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అన్నింటిలోనూ నిప్పాన్ ఇండియా బ్యాంకింగ్ డైరెక్ట్ ఫండ్ ప్లాన్ గత ఏడాదిలో అత్యధికంగా 76.19 శాతం రిటర్న్ సాధించింది.
రోజూ రూ.7 పెట్టుబడి పెట్టండి... నెలకు రూ.5,000 పొందండి... ఇవీ స్కీమ్ పూర్తి వివరాలు

ఏడాదిలో 50 శాతం కంటే ఎక్కువ రాబడినిచ్చిన ఈక్వీటీ మ్యూచువల్ ఫండ్ల జాబితా..

నిప్పాన్ ఇండియా బ్యాంకింగ్ ఫండ్ ప్లాన్..
గత ఏడాది కాలంలో ఇది 76.19 శాతం రాబడిని అందించింది. ఇదే సమయంలో ఈ సంస్థ రెగ్యులర్ ప్లాన్ 74.92 శాతం ఇచ్చింది. రెగ్యులర్ ప్లాన్ లో అధిక వ్యయ నిష్పత్తే ఇందుకు కారణం. నిప్పాన్ ఇండియా బ్యాంకింగ్ రెగ్యులర్ ప్లాన్ వ్యయ నిష్పత్తి 2.01 శాతం కాగా.. నిప్పాన్ ఇండియా బ్యాంకింగ్ ప్రత్యక్ష ప్రణాళిక వ్యయ నిష్పత్తి 1.39 శాతంగా ఉంది.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాన్..
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాన్ రాబడి గత ఏడాది కాలంలో 70.74 శాతంగా నమోదైంది. అయితే దాని రెగ్యులర్ ప్లాన్ 69.24 శాతంగా ఉంది. రెగ్యులర్ ప్లాన్ వ్యయ నిష్పత్తి 2.09 శాతం కాగా.. డైరెక్ట్ ప్లాన్ వ్యయ నిష్పత్తి 1.28 శాతంగా ఉంది.

కోటక్ పీఎస్ యూ బ్యాంక్ ఈటీఎఫ్ ప్లాన్..
ఇది గత ఏడాది కాలంలో 67.17 శాతంగా ఉండగా.. దాని వ్యయ నిష్పత్తి 0.49 శాతంగా ఉంది. ఇదే సమయంలో కోటక్ బ్యాంకింగ్ ఈటీఎఫ్ రెగ్యులర్ ప్లాన్ రిటర్న్ 64.05 శాతం. దీని వ్యయ నిష్పత్తి 0.18 శాతంగా ఉంది.

ఎస్బీఐ ఈటీఎఫ్ నిఫ్టీ బ్యాంక్..
దీని రెగ్యులర్ ప్లాన్ గత ఏడాది కాలంలో 64.41 శాతం రాబడి నమోదు చేయగా.. ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్ట్ ఫండ్ ప్లాన్ రిటర్న్ 62.49 శాతంగా ఉంది. రెగ్యుల్ ప్లాన్ 60.55 శాతం రిటర్న్‌ నమోదు చేసింది.

ఎడెల్విస్ ఈటీఎఫ్ నిఫ్టి బ్యాంకింగ్..
దీని రెగ్యులర్ ప్లాన్ గత ఏడాది కాలంలో 64.48 శాతం రాబడిని సాధించగా.. దాని వ్యయ నిష్పత్తి 0.12 శాతంగా ఉంది.
Published by:Nikhil Kumar S
First published: