Home /News /business /

THESE BANK FIXED DEPOSITS GIVE YOU UP TO TAX SAVINGS FD RATES UMG GH

Tax Saving FD Rates: ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఎక్కువ వడ్డీ కావాలా..? ఇదిగో ఈ బ్యాంకులు మీ కోసమే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలపై చక్కటి రాబడి అందించే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, స్మాల్ ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నాయి. ఇవన్నీ పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలపై 7.4 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఇప్పుడు వాటిపై ఓ లుక్కేద్దాం. 

ఇంకా చదవండి ...
పన్ను ఆదా చేసుకోవాలనుకునే వారికి రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (Tax Saving Fixed Deposits) బాగా పాపులర్ అయ్యాయి. ఇటీవలికాలంలో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ సహా చాలా బ్యాంకులు ఈ రకంగా ఎఫ్‌డీ వడ్డీ రేట్లు (Interest Rates) భారీగా పెంచేశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచడమే ఇందుకు కారణం. ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ (Tax Saving Investment) టూల్స్‌గా పనిచేసే ఈ ఎఫ్‌డీ డిపాజిట్స్ ఐదేళ్ల లాక్‌-ఇన్ పీరియడ్‌తో వస్తాయి. ఐటీ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను మినహాయింపు కోసం క్లెయిమ్ చేయవచ్చు. కానీ కేవలం పన్ను ఆదా కోసమే పెట్టుబడి పెట్టవద్దు. ఆ పెట్టుబడితో చక్కటి రాబడి వచ్చేలా కూడా ప్లాన్ చేసుకోవాలి. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలపై అలాంటి చక్కటి రాబడి అందించే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, స్మాల్ ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నాయి. ఇవన్నీ పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలపై 7.4 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఇప్పుడు వాటిపై ఓ లుక్కేద్దాం.

* ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లపై 7.4 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో ఈ బ్యాంక్ అందిస్తున్న వడ్డీనే చాలా అధికం. మీరు ఈ బ్యాంక్‌లో ఇప్పుడు రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడితే ఐదేళ్లలో రూ.2.16 లక్షలు చేతి కందుతుంది.

* డ్యుయిష్ బ్యాంక్
డ్యుయిష్ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లపై 7 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. విదేశీ బ్యాంకులలో ఇదే అత్యధిక వడ్డీ రేటు. ఈ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేసిన రూ.1.5 లక్షల మొత్తం ఐదేళ్లలో రూ.2.12 లక్షలకు పెరుగుతుంది.

* AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో చేసిన ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లపై 6.9 శాతం వరకు వడ్డీ రేటును అందుకోవచ్చు. ఐదేళ్లలో రూ.1.5 లక్షల మొత్తం రూ.2.11 లక్షలు అవుతుంది.

ఇదీ చదవండి: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. సైన్యమే దేశాన్ని చేతుల్లోకి తీసుకోనుందా.. విస్తుపోయే నిజాలు ఇవే !


* సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పన్ను ఆదా చేసే డిపాజిట్లపై 6.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందజేస్తోంది. ఈ బ్యాంకులో పెట్టుబడి పెట్టిన రూ. 1.5 లక్షలు మనీ ఐదేళ్లలో రూ.2.10 లక్షలకు చేరుకుంటుంది.



* డీసీబీ బ్యాంక్
డీసీబీ (DCB) బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లపై 6.6 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఐదేళ్లలో రూ.1.5 లక్షల మొత్తం రూ.2.08 లక్షలకు చేరుకుంది.

* ఇండస్‌ఇండ్, యెస్ బ్యాంక్స్‌
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులైన ఇండస్‌ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లపై 6.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ బ్యాంక్స్‌లో ఐదేళ్లలో రూ.1.5 లక్షల మొత్తానికి రూ.2.07 లక్షలు అందుకోవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Banks, FD rates, Fixed deposits, High interest rates

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు