హోమ్ /వార్తలు /బిజినెస్ /

Best Selling Cars: జనాలు తెగ కొంటున్న టాప్ 3 మారుతీ కార్లు ఇవే!

Best Selling Cars: జనాలు తెగ కొంటున్న టాప్ 3 మారుతీ కార్లు ఇవే!

 Best Selling Cars: జనాలు తెగ కొంటున్న టాప్ 3 మారుతీ కార్లు ఇవే!

Best Selling Cars: జనాలు తెగ కొంటున్న టాప్ 3 మారుతీ కార్లు ఇవే!

Maruti Cars | మీరు మారుతీ సుజుకీ కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మారుతీ కంపెనీ కార్లలోనే ఏ ఏ కార్లకు ఫుల్ డిమాండ్ ఉందో ఇప్పుడు తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Maruti Suzuki | కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏ కారు కొనుగోలు చేయాలో అర్థం కావడం లేదా? మార్కెట్‌లో ప్రస్తుతం చాలా కార్లు (Cars) అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కంపెనీనే పలు రకాల మోడళ్లను అందిస్తూ వస్తున్నాయి. మారుతీ సుజుకీ నుంచి కియా (Kia) వరకు చాలా కంపెనీల కార్లు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. అందువల్ల ఏ కారు ఎంచుకోవాలో? ఏ మోడల్ కొనాలో? తెలియకపోవచ్చు.

అయితే ఇప్పుడు మనం జనాలు ఎక్కువగా కొంటున్నా కార్లు ఏంటివో తెలుసుకుందాం. టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల విషయానికి వస్తే.. ఈ జాబితాలో ఉన్న కార్లలో ఎక్కువ శాతం మారుతీ సుజుకీ కార్లే ఉంటాయి. 6 నుంచి 7 కార్లు ఈ కంపెనీయే ఉంటాయని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మారుతీ కార్లు చాలా పాపులర్. చాలా మంది ఈ కంపెనీ కార్లనే కొనుగోలు చేస్తూ ఉంటారు. అందుకే ఇది దిగ్గజ కార్ల తయారీ కంపెనీగా దేశంలో కొనసాగుతూ వస్తోంది.

గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు .. ఇవాల్టి రేట్లు ఇలా!

మారుతీ సుజుకీ విషయానికి వస్తే.. ఈ కంపెనీ చాలా మోడళ్లను మార్కెట్‌లో విక్రయిస్తోంది. ఈ మోడళ్లలో ఏ ఏ కార్లను జనాలు ఎక్కువగా కొంటున్నారో ఇప్పుడు చూద్దాం. మారుతీ సుజుకీ టాప్ 3 బెస్ట్ సెల్లింగ్ కార్లు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిల్లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఉంది. అక్టోబర్ నెల అమ్మకాల విషయానికి వస్తే.. ఈ కారు అమ్మకాలు 17,231 యూనిట్లుగా ఉన్నాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు అమ్మకాలు వార్షికంగా చూస్తే 88 శాతం పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో అమ్మకాలు కేవలం 9180 యూనిట్లు మాత్రమే.

రోజుకు రూ.10 ఇచ్చి బంగారం కొనండిలా!

అలాగే మరో బెస్ట్ సెల్లింగ్ కారు మారుతీ సుజుకీ వెగనార్. ఈ మోడల్అమ్మకాలు గత నెలలో 17,945 యూనిట్లుగా ఉన్నాయి. వార్షికంగా 45 శాతం పెరుగుదల నమోదు అయ్యింది. గత ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 12,335 యూనిట్లుగా ఉన్నాయి. ఇక మరో బెస్ట్ సెల్లింగ్ కారు అల్టో. మారుతీ సుజుకీ అల్టో అమ్మకాలు ప్రతి నెలా ఎక్కువగానే ఉంటాయి. ఈ కారు అమ్మకాలు గత నెలలో 21,260 యూనిట్లుగా ఉన్నాయి. వార్షికంగా 22 శాతం పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 17,389 యూనిట్లు. కంపెనీ ఇటీవలనే అల్టో కే10 మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇందులో కే సిరీస్ ఇంజిన్ ఉంటుంది. అందువల్ల రానున్న కాలంలో ఈ మోడల్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

First published:

Tags: Cars, Maruti cars, MARUTI SUZUKI

ఉత్తమ కథలు