Home /News /business /

THESE ARE THE TOP 10 BANKS THAT OFFERS LOWEST INTEREST RATES ON CAR LOANS NS GH

Car Loan offers: కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? అయితే, తక్కువ వడ్డీకే రుణాలు అందించే టాప్ 10 బ్యాంకులివే.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కారణంగా వ్యక్తిగత వాహనాలకు డిమాండ్ పెరగడంతో అనేక బ్యాంకులు (Banks) వినియోగదారులను ఆకట్టుకోవడానికి తక్కువ ధరకే వడ్డీ రేట్ల(Interest rate)ను అందిస్తున్నాయి. మార్కెట్లో తక్కువ వడ్డీ రేటుకే కారు లోన్లు అందిస్తున్న టాప్ 10 బ్యాంకులపై ఓలుక్కేద్దాం.

ఇంకా చదవండి ...
ఒకప్పుడు కేవలం ధనవంతులకి మాత్రమే అనుకునే కారు.. ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు స్టేటస్ సింబల్ గా చూసే కారు ప్రస్తుతం కనీస అవసరంగా మారిపోయింది. దీనితో ప్రత్యేక ఆఫర్లతో కంపెనీలు వినియోగదారులను ఆకర్షిస్తుంటే, మరోవైపు బ్యాంకులు అనేక రాయితీ(Discounts)లు, ఆఫర్ల(Offers)ను ప్రకటిస్తున్నాయి. కరోనా కారణంగా వ్యక్తిగత వాహనాలకు డిమాండ్ పెరగడంతో అనేక బ్యాంకులు (Banks) వినియోగదారులను ఆకట్టుకోవడానికి తక్కువ ధరకే వడ్డీ రేట్ల(Interest rate)ను అందిస్తున్నాయి. మార్కెట్లో తక్కువ వడ్డీ రేటుకే కారు లోన్లు అందిస్తున్న టాప్ 10 బ్యాంకులపై ఓలుక్కేద్దాం.

అతి తక్కువ వడ్డీ రేట్లకే కారు లోన్ అందిస్తున్న బ్యాంకులు

బ్యాంకు వడ్డీరేటు (శాతాల్లో)
పంజాబ్ & సింథ్ బ్యాంక్ 7.10
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.25
కెనరా బ్యాంక్ 7.30
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.30
బ్యాంక్ ఆఫ్ బరోడా 7.35

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.40
బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.45
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.50
ఐడీబీఐ బ్యాంక్ 7.50
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 7.55

కారు లోన్ తీసుకోవడానికి కావాల్సిన అర్హత
కారు లోన్(Car Loan) కోసం వివిధ బ్యాంకులు వివిధ అర్హతలను పొందుపర్చాయి. కారు లోనుకు దరఖాస్తు చేసుకునే వ్యక్తికి 25 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. వారి కనీస ఆదాయం(Income) రూ. 20,000 కలిగి ఉండాలి. కనీసం ఏడాది నుంచి ఏదైనా ప్రభుత్వ(Government), ప్రైవేటు(Private) సంస్థలో పనిచేస్తున్న వారై లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారై ఉండాలి.

కావాల్సిన డాక్యుమెంట్స్
ఐడెంటిటీ ప్రూఫ్: ఆధార్(Aadhaar), పాస్‌పోర్ట్(Passport), డ్రైవింగ్ లైసెన్స్(Driving licence), ఓటరు ఐడి కార్డ్, పాన్ కార్డ్.
అడ్రస్ ప్రూఫ్: ఆధార్, వ్యాలిడ్ పాస్‌పోర్ట్(passport), డ్రైవింగ్ లైసెన్స్, గత 3 నెలల నుంచి యుటిలిటీ బిల్లులు.
ఇన్కమ్ ప్రూఫ్: ఫారం 16, గత 3 నెలల కాలానికి సంబంధించిన పే స్లిప్స్, తాజా ఐటి రిటర్న్స్(IT returns), గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్.

మీ లోన్ అప్లికేషన్ ను బ్యాంకులు వేగంగా ఆమోదించడానికి ఈ చిట్కాలను పాటించండి
1. మీరు మెరుగైన క్రెడిట్ స్కోరు(credit rating) ను కలిగి ఉంటే బ్యాంకులు మీ అప్లికేషన్ ను వేగంగా ఆమోదించే అవకాశం ఉంది. 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే రుణాలను అందిస్తాయి. 650 నుండి 750 స్కోరుకు వడ్డీ రేటు స్వల్పంగా ఉంటుంది.
2. మెరుగైన క్రెడిట్ ప్రొఫైల్‌ను రూపొందించడానికి మీ బిల్లులను సకాలంలో చెల్లించండి. ఎందుకంటే మీ క్రెడిట్ స్కోరు బాగుంటే, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ (EMI)లు సకాలంలో చెల్లించగలరని బ్యాంకులు భావిస్తాయి. ఇది త్వరగా రుణం పొందడానికి ఇది మీకు సహాయం చేస్తుంది.

3. ఎక్కువ మొత్తాన్ని డౌన్‌ పేమెంట్‌గా చెల్లించడం ద్వారా మీరు తిరిగి చెల్లించాల్సిన ఖర్చును తగ్గించుకోవచ్చు. తద్వారా మీ లోన్ అప్లికేషన్ త్వరగా పరిష్కరించబడుతుంది.
4. కారు లోన్ మంజూరు విషయంలో, పూర్తి కవరేజీతో కూడిన ఇన్సూరెన్స్ కలిగి ఉండటం కూడా లాభిస్తుంది. ఎందుకంటే, ఈ ఇన్సూరెన్స్తో రుణదాత ప్రమాదంలో ఉన్న సమయంలో బ్యాలెన్స్ రుణాన్ని తిరిగి సులభంగా పొందగలిగే అవకాశం ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Bank loans, CAR, Car loans

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు