Home /News /business /

THESE ARE THE TAX RULES THAT CAME INTO FORCE IN THE NEW FINANCIAL YEAR MK GH

New income tax rules: కొత్త ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వచ్చిన ట్యాక్స్ నియమాలు ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఏప్రిల్ ఒకటి నుంచి 2021 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో కొత్త ఇన్‌కం ట్యాక్స్ నియమాలపై ట్యాక్స్ చెల్లింపుదారులు అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన కొత్త ప్రతిపాదనలు, ప్రజల ఆర్థిక లక్ష్యాలపై వాటి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్ను నియమాలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని మార్పులను ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి సంబంధిత ప్రతిపాదనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఏప్రిల్ ఒకటి నుంచి 2021 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో కొత్త ఇన్‌కం ట్యాక్స్ నియమాలపై ట్యాక్స్ చెల్లింపుదారులు అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన కొత్త ప్రతిపాదనలు, ప్రజల ఆర్థిక లక్ష్యాలపై వాటి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

రిటర్నుల దాఖలుకు సమయం కుదింపు
ఆలస్యమైన లేదా సవరించిన రిటర్నులను దాఖలు చేయడానికి కాల పరిమితిని ప్రభుత్వం తగ్గించింది. ఇంతకు ముందు ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నులను దాఖలు చేయడానికి జూలై 31 ఆఖరు తేదీగా ఉండేది. ఒకవేళ ఆలోపు రిటర్నులు సమర్పించకపోతే, ఆలస్య రుసుముతో తరువాతి సంవత్సరంలోని మార్చి 31 లోగా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఈ గడువు లోపు పాత రిటర్నులను సవరించుకోవచ్చు కూడా. కానీ 2021-2022 ఆర్థిక బిల్లులో ఈ సమయాన్ని మూడు నెలలు తగ్గించాలనే ప్రతిపాదన ఉంది. అంటే ఇప్పటి నుంచి ఆలస్యమైన, సవరించిన రిటర్నులను ఆ సంవత్సరంలోని డిసెంబరు 31 లోపు సమర్పించాల్సి ఉంటుంది.

యులిప్ పెట్టుబడులు
ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రూ.2.5 లక్షలు దాటిన యులిప్‌ల వార్షిక ప్రీమియంపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు యులిప్ ఇన్వెస్ట్‌మెంట్లు EEE విభాగంలోకి వచ్చేవి. వీటిపై ఎలాంటి ట్యాక్స్ ఉండేది కాదు. అంటే ట్యాక్స్ పాలసీలకు సంబంధించిన మూడు దశల్లోనూ ఈ పెట్టుబడులకు ట్యాక్స్‌ మినహాయింపు ఉండేది. పెట్టుబడుల సమయంలో, పాలసీ అందించే ఆదాయంపై, మెచూరిటీ తరువాత అందే మొత్తంపై గతంలో ట్యాక్స్ ఉండేది కాదు. కానీ ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలు దాటిన యులిప్‌లపై ట్యాక్స్ వర్తిస్తుంది.

రెండు రకాల ట్యాక్స్ చెల్లింపు ఆప్షన్లు
ట్యాక్స్ చెల్లింపుదారులకు ఎక్కువ పన్ను భారం నుంచి ఉపశమనం కల్పించేందుకు 2020-21 బడ్జెట్లో కొత్త ట్యాక్స్ చెల్లింపు విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పాత, కొత్త విధానాల్లో ట్యాక్స్ భారం తగ్గే ఆప్షన్‌ను పన్ను చెల్లింపుదారులు ఎంచుకోవచ్చు. తగ్గింపులు, మినహాయింపులు, అలవెన్సుల ప్రయోజనాలను ట్యాక్స్ పేయర్లు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం నుంచి రెండింట్లో ఎక్కువ లబ్ధి చేకూర్చే ఏదో ఒక ఆప్షన్‌ను ట్యాక్స్ చెల్లింపుదారులు ఎంచుకోవచ్చు.

EPF కాంట్రిబ్యూషన్లపై ట్యాక్స్
ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఒక సంవత్సరంలో ఈపీఎఫ్‌లో జమ అయ్యే ఉద్యోగి వాటా రూ.2.5 లక్షలు దాటితే.. నిధులు విత్ డ్రా చేసే దశలో ట్యాక్స్ వర్తిస్తుంది. ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే ఉద్యోగులు, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌కు ఎక్కువ నిధులు కేటాయించేవారు ఇప్పుడు ట్యాక్స్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగి తరఫున ఈపీఎఫ్‌లో నిధులు జమ చేయని యాజమాన్యాల విషయంలో ఈ ట్యాక్స్ మినహాయింపు పరిమితి రూ.5 లక్షలుగా ఉంది.

డివిడెండ్‌పై ట్యాక్స్
ఇంతకు ముందు కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ హౌజ్‌ల నుంచి వ్యక్తులు అందుకునే డివిడెండ్‌ ట్యాక్స్ పరిధిలో లేదు. ఎందుకంటే డివిడెండ్‌పై ట్యాక్స్‌ను కంపెనీలే చెల్లించేవి. కానీ 2020 బడ్జెట్‌లో డివిడెండ్ ఆదాయంపై మినహాయింపులను ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు లబ్ధిదారులు డివిడెండ్ రూపంలో పొందే ఆదాయంపై ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.
First published:

Tags: Income tax, Money

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు