THESE ARE THE MOST PREFERRED PAYMENT METHODS IN INDIA GH VB
Payments Methods: పేపాల్ నుంచి పేటీఎం వరకు... భారత్‌లో బెస్ట్ పేమెంట్ మెథడ్స్ ఇవే..
(ప్రతీకాత్మక చిత్రం)
ప్రపంచ దేశాల్లో చాలా వరకు నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తుంటే భారత్ ఆలస్యంగా ఆ జాబితాలోకి చేరింది. 2016లో ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత పెరిగింది.
డబ్బు(Money).. ప్రపంచ వ్యాప్తంగా పేర్లు వేరు కానీ ఉపయోగించే విధానం మాత్రం ఒకటే. కాగితాలు లేదా నాణేల రూపంలో క్రయ, విక్రయాలకు దీన్ని వినియోగిస్తారు. ప్రాచీన కాలం నుంచి లావాదేవీలు నిర్వహించడానికి భౌతిక రూపంలోనే వీటిని అధికంగా వాడుతున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. డిజిటల్ చెల్లింపులకు(Digital Payments) ప్రాధాన్యం పెరిగింది. చాలా వరకు ఫిజికల్‌గా సొమ్ము(Physical Money) చెల్లించకుండానే సులభమైన రీతిలో లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా డబ్బును జేబులో పెట్టుకోవాల్సిన పనిలేదు. సులభంగా మీ చేతిలో ఫోన్ లేదా పర్సులో కార్డు ఉంటే సరిపోతుంది.ప్రపంచ దేశాల్లో చాలా వరకు నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తుంటే భారత్ ఆలస్యంగా ఆ జాబితాలోకి చేరింది.
2016లో ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత పెరిగింది. అయితే ఈ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ మనదేశంలో 93 శాతం శ్రామిక శక్తికి పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నవారు ఇప్పటికీ నగదుతోనే లావాదేవీలు చేస్తున్నారు. చాలామందికి డిజిటల్ చెల్లింపులపై అవగాహన లేదు. కనీసం సెల్‌ఫోన్ సదుపాయం కూడా కలిగిలేరు.
ప్లాస్టిక్, నగదు రహిత చెల్లింపులు..
సిద్ధాంతపరంగా నగదు రహిత విధానం వల్ల దోపిడీల నుంచి రక్షణ ఉంటుంది. ఒకవేళ కార్డు, ఫోన్ ఎవరైనా తస్కరించినా బయోమెట్రిక్ భద్రతా విధానం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. ఎక్కువ మంది కార్డ్ లేదా నగదు రహిత చెల్లింపులు నిర్వహిస్తే రిటైలర్ల వద్ద క్యాష్ తక్కువగా ఉంటుంది. ఫలితంగా వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ విధానం వల్ల చెలామణిలో ఉన్న నల్లదనాన్ని తగ్గించవచ్చు.
భారత్‌లో పాపులర్ పేమెంట్స్..
డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు..
అత్యంత సౌకర్యంగా ఉండే లావాదేవీల్లో ఇది ఒకటి. ఆన్ లైన్ లేదా దుకాణంలో ఎక్కడైనా కార్డు ద్వారా సులభంగా పేమెంట్ చేయవచ్చు. భారత్‌లో చాలా స్టోర్లలో క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులపై డిస్కౌంట్లు కూడా ఉంటున్నాయి. 2017 నాటికి క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కలిగిన 15 ఏళ్ల వయస్సు పైబడిన వారి శాతం 32.72గా ఉంది. 2020లో దేశంలో 860 మిలియన్లకు పైగా యాక్టివ్ డెబిట్ కార్డులు ఉన్నాయి. కేవలం 60 మిలియన్లు మాత్రమే క్రెడిట్ కార్డులు ఉన్నాయి.
పేపాల్ (PayPal)
పేపాల్ ద్వారా చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే గతేడాది ఏప్రిల్ నెలలో దేశీయ చెల్లింపులను ఇకపై సులభతరం చేయలేమని ఈ సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయ వ్యాపారాల్లో పేపాల్ అతి ముఖ్యమైన చెల్లింపు విధానం.
పేటీఎం (PayTm)
వినియోగాదారులు పేటీఎం యాప్‌లో బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వవచ్చు. ఇది మొబైల్ ఆధారిత వాలెట్ పేమెంట్ పద్ధతి. యుటిలిటీ బిల్లులు, షాపింగ్, ఇతరులకు డబ్బు పంపడం ఇలా పలు రకాల సేవలు ఇందులో ఉంటాయి. 70 కంటే విదేశీ కరెన్సీలకు ఎలాంటి లావాదేవీ రుసుము లేకుండానే నిర్వహిస్తుంది. ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే లాంటి ఇతర వాలెట్ ఆధారిత పేమెంట్స్ ను కూడా భారత్ లో అధికంగా వినియోగిస్తున్నారు.
పే యూ మనీ (Pay U Money)
ఈ చెల్లింపు పద్ధతిని వ్యాపారాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. డబ్బు పంపడానికి లేదా స్వీకరించడానికి అనుమతిస్తుంది. నమోదు చేయని వ్యాపారాలు కూడా ఇక్కడ చెల్లింపులు చేయవచ్చు. పేమెంట్స్ కోసం అభ్యర్థించవచ్చు. ఈ యాప్‌లో ఇన్ వాయిస్ జనరేటర్ ఉంటుంది. కస్టమర్ సపోర్ట్ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.
క్యాష్ ఫ్రీ (Cash Free)
ఈ యాప్‌లో మీరు క్యాష్ గ్రామ్ని ఉపయోగించి పేమెంట్ లింక్ రూపొందిస్తారు. పేమెంట్స్ కోసం బిజినెస్‌లు తమ కస్టమర్లకు లింక్‌లను పంపుతాయి. పేమెంట్ చేయడానికి కస్టమర్ లింక్‌ను క్లిక్ చేస్తారు.
ఇన్‌స్టామోజో (Instamojo)
ఇది యూత్ ఫ్రెండ్లీ యాప్. ఇది ప్రధానంగా వీడియోలు, మ్యూజిక్ కోసం ఆన్లైన్ పేమెంట్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా Instagram, Facebook, Whatsapp వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నుంచి కస్టమర్లు పేమెంట్స్ చేసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు Apple Pay, Google Pay, Samsung Pay వంటి ఇతర పేమెంట్ మెథడ్స్ భారత్‌లో వినియోగంలో ఉన్నాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.