Home /News /business /

THESE ARE THE METHODS TO RECOVER HOME LOAN INTEREST USING SYSTEMATIC INVESTMENT PLAN SIP HERE IS THE DETAILS AK GH

Home Loan Interest: ఇలా చేస్తే హోం లోన్ వడ్డీలు రికవరీ చేసుకోవచ్చు ? ఈ ఒక్క పని చేస్తే చాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Home Loan-SIP: వడ్డీరేటు భారాన్ని తగ్గించుకునేందుకు ముందస్తు చెల్లింపులతో పాటు ఇంకా అనేక మార్గాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఆర్థిక స్తోమత లేని వారు సైతం తమ సొంతింటి కలను హోం లోన్ సాయంతో నెరవేర్చుకోవచ్చు. అధిక ఆర్థిక భారం లేకుండా ఈఎంఐ విధానంలో హోం లోన్ తీర్చడం చాలా సులువు. కానీ సిటీ ఏరియాల్లో ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు.. పెద్ద మొత్తంలో గృహ రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి రుణ గ్రహీతలు తీసుకునే రుణాల కాలపరిమితి 20 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ కాలపరిమితిలో గృహ రుణాలపై కట్టాల్సిన వడ్డీ రేటు ఒక్కోసారి రుణ మొత్తానికి సమానమవుతుంది. కొన్ని సందర్భాల్లో రుణ గ్రహీతలు చెల్లించాల్సిన మొత్తానికి రెట్టింపు స్థాయిలో వడ్డీ రేటు కట్టాల్సి వస్తుంది. ఈ భారీ రుణాలను ముందస్తుగా చెల్లిస్తే తప్ప వడ్డీ భారం నుంచి ఉపశమనం కలుగదు. అయితే వడ్డీరేటు భారాన్ని తగ్గించుకునేందుకు ముందస్తు చెల్లింపులతో పాటు ఇంకా అనేక మార్గాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆ మార్గాలు ఏంటో తెలుసుకుందాం.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్లలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ను ప్రారంభించడం ద్వారా వడ్డీ రేట్లను రికవర్ చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రుణగ్రహీతలు గృహ రుణ ఈఎంఐ ప్రారంభమైన వెంటనే ఈఎంఐ మొత్తంలో 10 శాతానికి సమానమైన సిప్(SIP)ను ప్రారంభిస్తే.. పూర్తి గృహ రుణ వ్యయాన్ని తిరిగి పొందవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఉదాహరణకి 25 సంవత్సరాల కాలపరిమితితో 6.75 శాతం వడ్డీతో రూ.30 లక్షల గృహ రుణం మీరు తీసుకుంటే... రూ.62 లక్షలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఈ మొత్తం తీసుకున్న రుణం కంటే ఎక్కువే! అదే 25 ఏళ్లలో ఈఎంఐలో 10 శాతానికి సమానమైన రూ. 6 లక్షలు మ్యూచువల్ ఫండ్స్ సిప్ లలో పెట్టుబడి పెట్టి.. మీరు సుమారు రూ. 66 లక్షల కార్పస్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. 15 శాతం రాబడితో అంచనా వేస్తే రూ.66 లక్షల కార్పస్ నిధిని సులభంగా సృష్టించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అన్ని అవసరాలకు ఖర్చు చేసిన తర్వాత కూడా మీ వద్ద డబ్బు మిగిలి ఉంటే దానిని సిప్ లలో పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయమని అంటున్నారు నిపుణులు.

సిప్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రాబడి సంపాదించవచ్చు. తద్వారా గృహ రుణంపై కడుతున్న వడ్డీలను రికవర్ చేయొచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లోని పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయని పెట్టుబడిదారులు గుర్తించుకోవాలి. పెట్టుబడి పెట్టాలనుకునే ఫండ్‌ ద్వారా ఎంత సమయంలో.. ఎంత మొత్తంలో రాబడి వస్తుందనే అంశాలను విశ్లేషించుకోవాలి. భవిష్యత్తులో మీ ఆర్థిక అవసరాలకు తగినట్లుగా డబ్బు ఏర్పాటు చేసుకోవాలంటే.. సరైన ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

Benefits Of Ghee: నెయ్యి వల్ల ఎన్నో ప్రయోజనాలు.. ఈ రకమైన అనారోగ్యాలకు చెక్ పెట్టండి

TSRTC: తెలంగాణ ఆర్టీసీకి సీఎం కేసీఆర్ బిగ్ షాక్... నాలుగు నెలలే గడువు

సిప్ పెట్టుబడిదారులు ప్రతినెలా లేదా క్రమం తప్పకుండా చిన్న మొత్తాలలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా పొదుపుతో పాటు పెట్టుబడులు పెట్టే అలవాటును అలవర్చుకోవచ్చు. దీని ద్వారా ఆర్థిక క్రమశిక్షణ కూడా పెట్టుబడిదారుల్లో పెరుగుతుంది. సిప్ లలో పెట్టిన పెట్టుబడిని ఫైనాన్సియల్ మార్కెట్లో వివిధ స్థాయిలలో ఉపయోగిస్తారు. తద్వారా పెట్టుబడిదారులు మంచి రాబడి పొందవచ్చు. మార్కెట్లు అధిక రేటు వద్ద కొనసాగుతున్నప్పుడు.. నెలవారీ సిప్ తక్కువ యూనిట్లను కొనుగోలు చేస్తుంది. మార్కెట్లు తక్కువగా ఉన్నప్పుడు, అదే నెలవారీ సిప్ మొత్తం ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేస్తుంది. ఇలా చేయడం ద్వారా సిప్ పెట్టుబడిదారులు చాలా లాభం పొందవచ్చు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Home loan, SIP

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు