• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • THESE ARE THE FINANCIAL TASKS THAT EVERYONE SHOULD COMPLETE AT THE BEGINNING OF THIS NEW FINANCIAL YEAR NS GH

New Financial Year: ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరం.. ఈ 5 కీలక ఆర్థిక పనులను త్వరగా పూర్తి చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

మార్చి 31తో 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం మొదలైంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన పనులేంటో చూద్దాం.

  • Share this:
మార్చి 31తో 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. కంపెనీలకు, ఉద్యోగులకు, ప్రభుత్వాలకు ఈ తేదీ నుంచే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతుంటాయి. పన్ను చెల్లింపుదారులకు ఈ తేదీ ఎంతో ముఖ్యమైనది. వారు గతంలో పెట్టిన పెట్టుబడులను కొనసాగడానికి, ఎక్కువ పన్ను ప్రయోజనాలను పొందడానికి అనుసరించాల్సిన వ్యూహాలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలి. అందువల్ల, ముఖ్యమైన ఆర్థిక పనులను ఇప్పుడే ప్రారంభించాల్సి ఉంటుంది. కాబట్టి, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన పనులను పరిశీలిద్దాం.

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చేయాల్సినవి..
1. ఫారం 15 జి / 15 హెచ్ సమర్పణ
ఒకవేళ మీ ఆదాయం పన్ను పరిధిలోకి రాకపోతే.. మీ బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీలో టీడీఎస్ కట్​ చేయడాన్ని ఆపడానికి మీరు సంబంధింత బ్యాంకులో ఫారం 15జీ లేదా ఫారం 15 హెచ్​ను సబ్​మిట్​ చేయాలి. తద్వారా మీ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి ఎటువంటి పన్నులు చెల్లించనవసరం లేదు. కాగా, ఈ ఫారాలను ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే సబ్​మిట్​ చేయాల్సి ఉంటుంది. లేదంతే టీడీఎస్​ కోతకు గురయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా, అన్ని బ్యాంకులు పన్ను పరిధిలోకి వచ్చే కస్టమర్ల డిపాజిట్లపై లభించే వడ్డీ నుంచి ముందుగానే టిడిఎస్‌ను మినహాయిస్తాయి.

2. పన్ను విధానాన్ని ఎంచుకోవడం
పన్ను చెల్లింపుదారుడు ఎంచుకోవడానికి ప్రస్తుతం, రెండు పన్ను నియమాలు అందుబాటులో ఉంటాయి. తక్కువ స్లాబ్ రేటులో ఉన్న చెల్లింపుదారుడు.. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే మంచి పన్ను ప్రణాళికను ఎంచుకుంటే 70 శాతం వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఏదేమైనా, ఆదాయపు పన్ను చట్టం క్రింద, ఎక్కువ పన్ను మిహాయింపు ప్రయోజనాలను పొందాలనుకునే పాత పన్ను విధానాన్ని ఎంచుకోవడం లాభిస్తుంది.

3. పన్ను ప్రణాళికను సిద్ధం చేసుకోవడం
పన్ను ఆదా కోసం చాలా మంది ఆర్థిక సంత్సరం ముగింపులో పెట్టుబడులు పెడుతుంటారు. చివరి నిమిషంలో ఇలా చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అందువల్ల, మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ఉపయోగపడే విధంగా.. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పన్ను ప్రణాళికను సిద్ధం చేసుకోండి. చివరి నిమిషంలో పన్ను మినహాయింపు పొందటానికి.. మీ పెట్టుబడులు రిస్క్ -ప్రొఫైల్‌కు అనుగుణంగా ఉండకపోవచ్చు. లేదా ఎక్కువ కాలం లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉండవచ్చని గుర్తించుకోండి.

4. రిటర్న్స్​ కోసం డాక్యుమెంట్స్​ సిద్ధం చేసుకోండి
ఏదైనా ఆర్థిక సంవత్సరంలో, ఆదాయపు పన్ను రిటర్న్​ దాఖలుకు గడువు తేదీ సాధారణంగా జూలై 31గా ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి గడువు పొడిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి, ప్రస్తుతానికి మీరు మీ పెట్టుబడులకు సంబంధించిన అన్ని పత్రాలను సేకరించుకోండి. ఇన్వెస్ట్​మెంట్ స్టేట్​మెంట్స్, బ్యాంక్ స్టేట్​మెంట్స్, హౌస్ లోన్ ప్రిన్సిపాల్ రీపేమెంట్ సర్టిఫికేట్ వంటి వాటిని సిద్ధం చేసుకోండి.

5. పీపీఎఫ్‌లో పెట్టుబడి
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) అనేది చాలా పాలపులర్​ లాంగ్​ టర్మ్​ ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్​. దీనికి కేంద్ర ప్రభుత్వ హామీ కూడా ఉంటుది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుండి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్​ చేయవచ్చు. అయితే, పీపీఎఫ్​ వడ్డీ రేట్లను మాత్రం కేంద్ర నిర్ణయిస్తుంది. అయితే, మీ పన్ను ప్రయోజనాల కోసం పీపీఎఫ్​లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఆ దిశగా అడుగులు వేయండి. ఎందుకంటే, ఆర్థిక సంవత్సరం చివర్లో పెట్టుబడి పెడితే.. మీరు మీ వడ్డీ భాగాన్ని కోల్పోతారని గుర్తించుకోండి.
Published by:Nikhil Kumar S
First published: