HOME »NEWS »BUSINESS »these are the fees charged for unsuccessful atm charges by sbi icici axis hdfc banks ba gh

ATM: ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా?, ఈ చిన్న పొరపాటుతో మీ బ్యాలెన్స్ కట్

ATM: ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా?, ఈ చిన్న పొరపాటుతో మీ బ్యాలెన్స్ కట్
ప్రతీకాత్మక చిత్రం

మనలో చాలా మంది తరచూ బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. ఈ విషయం ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్లో చూసుకునే వరకు దానికి గల కారణం చాలా మందికి తెలియదు.

  • Share this:
మనలో చాలా మంది తరచూ బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. ఈ విషయం ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్లో చూసుకునే వరకు దానికి గల కారణం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఏటీఎం లావాదేవీలపై సరైన అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మీరు ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకోవాలి అని భావిస్తే, ముందుగా మీరు ఏటీఎం ట్రాన్సాక్షన్ నియమ నిబంధనల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే ముందు మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం చాలా కీలకం. మీ ఖాతాలో తగినంత డబ్బు ఉందని నిర్థారించుకున్న తర్వాతే ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకోవాలని గుర్తించుకోండి.

ఒకవేళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తగినంత డబ్బులు లేకపోయినప్పటికీ ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తే.. ట్రాన్సాక్షన్ ఫెయిల్ (failed ATM transaction) అవుతుంది. ఇలా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మాత్రం బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయి. అందువల్ల, ట్రాన్సాక్షన్స్ నుంచి బయటపడాలంటే ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే ముందు మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఉత్తమం. దీనికి గాను ఆయా బ్యాంకులు అందజేసే ఎస్ఎంఎస్ (SMS), కాల్ సౌకర్యం లేదా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి వివిధ మార్గాలను కూడా ఎంచుకోవచ్చు. ఎందుకంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్, హెచ్‌‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank), యెస్ (Yes) బ్యాంక్, యాక్సిస్ (Axis) బ్యాంక్ వంటి బ్యాంకులు ఇలాంటి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.

































బ్యాంకులు ట్రాన్సాక్షన్ ఫెయిల్ ఫీజు
SBI తగినంత బ్యాలెన్స్ లేనందున ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే రూ .20తో పాటు జీఎస్టీ (GST) వసూలు
HDFC తగినంత బ్యాలెన్స్ లేనందున ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే రూ .25తో పాటు జీఎస్టీ (GST) వసూలు
ICICI తగినంత బ్యాలెన్స్ లేనందున ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే రూ .25తో పాటు జీఎస్టీ (GST) వసూలు
Kotak Mahindra Bank తగినంత బ్యాలెన్స్ లేనందున ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే రూ .25తో పాటు జీఎస్టీ (GST) వసూలు
Yes Bank తగినంత బ్యాలెన్స్ లేనందున ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే రూ .25తో పాటు జీఎస్టీ (GST) వసూలు
Axis Bank తగినంత బ్యాలెన్స్ లేనందున ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే రూ .25తో పాటు జీఎస్టీ (GST) వసూలు



కాబట్టి, ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ ఫీజు చెల్లించకుండా ఉండేందుకు, ముందుగానే మీ అకౌంట్లో తగిన బ్యాలెన్స్ ఉందని నిర్ధారించుకోండి.
Published by:Ashok Kumar Bonepalli
First published:December 28, 2020, 19:10 IST