మీ డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి 5 బెస్ట్ ఆప్షన్స్ ఇవే...

ఇన్వెస్ట్‌మెంట్స్, సేవింగ్స్ కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే రూ.6.5 లక్షల వార్షికాదాయం ఉన్నా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి రాదు. మరి మీ డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ ఆప్షన్స్ ఏవో తెలుసుకోండి.

news18-telugu
Updated: February 5, 2019, 12:13 PM IST
మీ డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి 5 బెస్ట్ ఆప్షన్స్ ఇవే...
మీ డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి 5 బెస్ట్ ఆప్షన్స్ ఇవే...
  • Share this:
ఈ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి ట్యాక్స్ రిబేట్ ప్రకటించింది. ఇది పూర్తిగా మినహాయింపు కాకపోయినా ముందుగా చెల్లించిన పన్ను రిబేట్ రూపంలో వెనక్కి వస్తుంది. కాబట్టి ఆ మేరకు పన్ను చెల్లింపుదారులకు మిగిలినట్టే. ఎంతో కొంత పన్నుభారం తగ్గినట్టే. ఇదే కాదు... ఇన్వెస్ట్‌మెంట్స్, సేవింగ్స్ కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే రూ.6.5 లక్షల వార్షికాదాయం ఉన్నా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి రాదు. మరి మీ డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ ఆప్షన్స్ ఏవో తెలుసుకోండి.

1. స్టాక్ మార్కెట్
మీరు దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? మీకు స్టాక్ మార్కెట్‌పై అవగాహన ఉందా? అయితే స్టాక్ మార్కెట్‌లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టొచ్చు. స్టాక్ మార్కెట్ అయినా, మ్యూచువల్ ఫండ్ అయినా మీ పెట్టుబడికి భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయని మీరు విశ్లేషించుకోగలిగితేనే ముందడుగు వేయడం మంచిది.

Read this: IRCTC Booking: రైలులో ఖాళీ సీట్ల లెక్క ఇలా తెలుసుకోండి



2. రియల్ ఎస్టేట్
భూముల ధరలు పెరుగుతున్నాయని, రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతోందని మీరు గత పదేళ్లుగా వినే ఉంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం రియల్ ఎస్టేట్ కూడా మంచి పెట్టుబడే. ఒకవేళ మీరు మీ ఇంటికి భారీ అద్దె చెల్లిస్తున్నట్టయితే హోమ్ లోన్‌పై ఇల్లు తీసుకొని ఈఎంఐలు చెల్లించడం ఉత్తమం.

3. బంగారం
Loading...
బంగారం భారతీయులకు పెట్టుబడి మాత్రమే కాదు సెంటిమెంట్ కూడా. ప్రస్తుతం బంగారం ధరల్లో పెరుగుదల భారీగా లేకపోయినా... భవిష్యత్తులో గోల్డ్ రేట్ పెరుగుతుందన్న అంచనాలున్నాయి. మీరు ఫిజికల్ గోల్డ్ మాత్రమే కొనాల్సిన అవసరం లేదు. గోల్డ్ డిపాజిట్ స్కీమ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ బాండ్స్ రూపంలో బంగారం కొనొచ్చు.

Read this: Photos: అక్కడికి వెళ్తే ప్యాంటు విప్పాల్సిందే... ఎందుకో తెలుసా?

4. ఇన్వెస్ట్‌మెంట్ బాండ్స్
పైన చెప్పిన వాటిలో ప్రయోగాలు చేయడం ఇష్టం లేకపోతే మీ డబ్బుకు సురక్షితమైన పెట్టుబడి బాండ్స్. వడ్డీ తక్కువగా వచ్చినా మీ డబ్బుకు ఢోకా ఉండదు. పన్ను లాభాలు కూడా ఉంటాయి.

5. కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్స్
బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ తక్కువేనని తెలుసు. అయితే కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ ఎక్కువగానే వస్తుంది. మెచ్యూరిటీ కన్నా ముందే మీకు డబ్బు అవసరమైనా విత్‌డ్రా చేసుకోలేరు. అందుకే ఈ ఆప్షన్ ఎంచుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి.

ఇవి కూడా చదవండి:

Alert: ఫోటో ఎడిటింగ్ యాప్స్‌లో వైరస్... ఈ యాప్స్ మీ దగ్గరున్నాయా?

I love you, Thank you... గూగుల్ ఎక్కువగా ట్రాన్స్‌లేట్ చేసినవి ఇవే

టెన్త్ మాత్రమే చదివాడు... ఆల్కహాల్ డిటెక్టర్ కనిపెట్టాడు... కేటీఆర్‌ని మెప్పించాడు
First published: February 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...