THESE ARE THE 5 CHEAPEST ELECTRIC SCOOTERS YOU CAN SAVE THOUSANDS OF RUPEES MK
Cheapest Electric Scooters Below 50K: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర రూ.50 వేల లోపు మాత్రమే...చెక్ చేసుకోండి...
ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో ఖరీదు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో రూ. 50 వేల కన్నా తక్కువ మొత్తంలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఓ లుక్కేద్దాం. తద్వారా మీకు అతి తక్కువ రేంజ్ లోనే EV టూవీలర్ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో ఖరీదు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో రూ. 50 వేల కన్నా తక్కువ మొత్తంలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఓ లుక్కేద్దాం. తద్వారా మీకు అతి తక్కువ రేంజ్ లోనే EV టూవీలర్ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.
Cheapest Electric Scooters Below 50K: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు కూడా దీనికి కారణం అవుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధర రూ.100 రూపాయలు దాటిపోగా, డీజెల్ కూడా రూ.100 రూపాయల సమీపంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు వాడటం వల్ల ఇంధన ఖర్చు మిగిలే చాన్స్ ఉంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో ఖరీదు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో రూ. 50 వేల కన్నా తక్కువ మొత్తంలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఓ లుక్కేద్దాం. తద్వారా మీకు అతి తక్కువ రేంజ్ లోనే EV టూవీలర్ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.
Hero Electric Dash
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో డాష్ (Hero Electric Dash) దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.62 వేలుగా నిర్ణయించారు. అయితే దీంతో పాటు హీరో నుంచి మరో రెండు స్కూటర్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంచారు. అవి Hero Optima ER ధర రూ. 68,721 (ఎక్స్-షోరూమ్), Hero Nyx ER ధర రూ. 69,754 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. Hero Electric Dash విషయానికి వస్తే ఇందులో 48V సామర్థ్యంతో 28 Ah Li-Ion బ్యాటరీని అందిస్తారు.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ కావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. పూర్తి ఛార్జింగ్ తో 60 కి.మీ దూరం ప్రయాణించవచ్చు.
Bounce Infinity E1
గతంలో బైక్ టాక్సీ సేవలను అందించి మార్కెట్లో సందడి చేసిన బౌన్స్ ఈ సారి మాత్రం ఎలక్ట్రిక్ వాహనంతో మార్కెట్లోకి ప్రవేశించింది. Bounce Infinity E1 పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రవేశపెట్టింది. ఢిల్లీలో బ్యాటరీ లేకుండా ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.45,099 గా నిర్ణయించారు. అయితే బ్యాటరీ, చార్జర్ తో కలిపి ధర రూ. 68,999 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర)గా నిర్ణయించారు.
Ampere Magnus Pro
అంపియర్ మాగ్నస్ ప్రో సంస్థ నుంచి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.49,999 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ వాడుతున్నారు. స్కూటర్ తో పాటుగా 1200W బ్యాటరీని పొందుతారు. దీని బరువు 82 కిలోలు. దీని గరిష్ట వేగం గంటకు 50 కిలోమీటర్లు.
Avon E Scoot
ప్రముఖ సైకిల్ కంపెనీ అయిన ఏవన్ కంపెనీ నుంచి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను 45 వేల రూపాయలుగా నిర్ణయించారు. ఒక సారి చార్జ్ చేస్తే 65 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. ఇదే కంపెనీ నుంచి వచ్చిన Avon E Lite కేవలం రూ. 28,000కే అందుబాటులో ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 కి.మీ వరకు ఉంటుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.