హోమ్ /వార్తలు /బిజినెస్ /

Employees: ఉద్యోగులకు హెచ్చరిక.. ఈ బిల్లులు పడేయొద్దు.. లేదంటే..

Employees: ఉద్యోగులకు హెచ్చరిక.. ఈ బిల్లులు పడేయొద్దు.. లేదంటే..

Central Employees: కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి మోదీ సర్కార్ శుభవార్త

Central Employees: కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి మోదీ సర్కార్ శుభవార్త

Salary | ఉద్యోగం చేస్తున్నారా? కంపెనీ నుంచి అలవెన్స్‌లు ఏమైనా పొందుతున్నారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే బిల్లులు జాగ్రత్తగా పెట్టుకోండి. లేదంటే ఇబ్బందులు పడాల్సి రావొచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Tax |ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీకు ప్రతి నెలా జీతం వస్తూనే ఉంటుంది. కేవలం శాలరీ మాత్రమే కాకుండా ఉద్యోగుల సీటీసీలో చాలా అంశాలు ఉంటాయి. పలు రకాల అలవెన్స్ కూడా ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. వీటిల్లో కన్వీనియన్స్ అలవెన్స్ కూడా ఒకటి. ఇంకా టూర్ డ్యూటీ అలవెన్స్, మొబైల్ రీయింబర్స్‌మెంట్ వంటివి కూడా ఉన్నాయి. కంపెనీ నుంచి ఉద్యోగులు పొందే ఇలాంటి అలవెన్స్‌లపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే ఈ బెనిఫిట్ పొందాలని భావించే వారు కచ్చితంగా బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఒకవేళ బిల్లులు సమర్పించకపోతే.. కంపెనీ నుంచి పొందే బెనిఫిట్స్‌పై ట్యాక్స్ పడుతుంది. ఇలా అలవెన్స్‌లు ట్యాక్స్ పరిధిలోకి వస్తే అప్పుడు టీడీఎస్ కట్ అవుతుంది. ఉద్యోగులు ఎంచుకున్న ట్యాక్స్ విధానం ప్రకారం టీడీఎస్ రేటు వర్తిస్తుంది.

  ఉద్యోగులు పాత ట్యాక్స్ విధానాన్ని ఎంపిక చేసుకొని ఉంటే.. పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందుతూ ఉండొచ్చు. లేదంటే కొత్త ట్యాక్స్ విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే పన్ను మినహాయింపు బెనిఫిట్స్ మాత్రం ఉండవు. ట్యాక్స్2విన్.ఇన్ సీఈవో అభిషేక్ సోని మాట్లాడుతూ.. ఐటీఆర్ ఫైలింగ్ వెబ్‌సైట్ ప్రకారం ‘ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఉద్యోగ బాధ్యతలరీత్యా ఎంప్లాయీస్ పొందే ఏ అలవెన్స్‌లకు అయిన పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 1961లోని సెక్షన్ 10 (14) ఐ ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది’ అని వివరించారు.

  HDFC Bank MCLR Hike: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు షాక్! ఈరోజు నుంచి..

  ట్యాక్స్ బెనిఫిట్ పొందాలని భావించే వారు కచ్చితంగా బిల్లులను కంపెనీకి సమర్పించాల్సి ఉంటుందన్నారు. అలాగే ఉద్యోగ బాధ్యతలకు సంబంధించి ఖర్చు చేసిన అలవెన్స్‌లకు మాత్రమే ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఇతర ఖర్చులకు పన్ను మినహాయింపు ఉండదని పేర్కొన్నారు. అందువల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ సొంతం చేసుకోవాలని భావించే వారు కచ్చితంగా బిల్లులను కలిగి ఉండాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు అలవెన్స్‌లకు సంబంధించి ఎలాంటి బిల్లులు సమర్పించాల్సిన అవసరం లేకపోయినా కూడా బిల్లును కలిగి ఉండటం ఉత్తమం. ఎందుకంటే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ మీకు ట్యాక్స్ నోటీసు పంపితే అప్పుడు కచ్చితంగా బిల్లులను సమర్పించాలి.

  Credit Card Tips : క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే

  ఐటీఆర్‌లో కచ్చితంగా అలవెన్స్ బ్రేక్ అప్ సహా కంపెనీ నుంచి పొందే ఇతర బెనిఫిట్స్ వివరాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు పొందే అలవెన్స్‌లకు పన్ను మినహాయింపు ఉంటే.. అప్పుడు వాటిని ’మినహాయింపు ఆదాయం‘ అనే కాలమ్ కింద చూపించాలి. సెక్షన్ 10(14) కింద ట్యాక్స్ మినహాయిపుం పొందొచ్చు. ఫామ్ 16 పార్ట్ బి ద్వారా ఉద్యోగి ఎంత పన్ను మినహాయింపు పొందుతున్నారో తెలుసుకోవచ్చు

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Dearness allowance, Employees, Income tax, Salary Hike, Tax deduction

  ఉత్తమ కథలు