హోమ్ /వార్తలు /బిజినెస్ /

ITR Filing: ఇన్‌కమ్ ట్యాక్స్ ముందే ఫైల్ చేస్తే బోల్డెన్ని బెనిఫిట్స్.. అవేంటో తెలుసుకోండి..!

ITR Filing: ఇన్‌కమ్ ట్యాక్స్ ముందే ఫైల్ చేస్తే బోల్డెన్ని బెనిఫిట్స్.. అవేంటో తెలుసుకోండి..!

గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేస్తే.. బెనిఫిట్స్ ఇవే

గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేస్తే.. బెనిఫిట్స్ ఇవే

ఆదాయ పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయడానికి చివరి తేదీ (జులై 31) సమీపిస్తోంది. జీతం పొందే వ్యక్తులు ఆదాయ పన్ను రిటర్నులు (Income Tax Returns) దాఖలు చేసేందుకు 31 వరకే అవకాశం ఉంది. అంటే ఇంకా కొద్ది రోజుల సమయమే ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఐటీఆర్ (ITR) ఫైల్ చేయడం ప్రారంభించాలి.

ఇంకా చదవండి ...

ఆదాయ పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయడానికి చివరి తేదీ (జులై 31) సమీపిస్తోంది. జీతం పొందే వ్యక్తులు ఆదాయ పన్ను రిటర్నులు (Income Tax Returns) దాఖలు చేసేందుకు 31 వరకే అవకాశం ఉంది. అంటే ఇంకా కొద్ది రోజుల సమయమే ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఐటీఆర్ (ITR) ఫైల్ చేయడం ప్రారంభించాలి. వేతన జీవులు చివరి నిమిషం వరకు ఆలస్యం చేస్తే తప్పులు దొర్లే అవకాశం ఎక్కువ. అందుకే నిపుణులు ఐటీఆర్‌ను గడువుకు ముందే ఫైల్ చేయాలని సూచిస్తున్నారు. చెల్లింపుదారులకు ఐటీఆర్ ఫైల్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐటీ డిపార్ట్‌మెంట్ ముందుగా నింపిన ఓ పన్ను రిటర్న్‌ల ఫారాన్ని అందిస్తుంది. అయితే ట్యాక్స్ పేయర్లు రిటర్న్‌ను ఫైల్ చేసేటప్పుడు అన్ని డాక్యుమెంట్లను రెడీగా ఉంచుకోవాలి. అలానే ఫారంలో ముందుగా ఫిల్ చేసిన ప్రతి ఫీల్డ్‌ను క్రాస్ చెక్ చేసుకోవాలి. మొదటి సారి ఐటీఆర్‌ ఫైల్ చేస్తున్నవారైతే ఈ కింది విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ITRలను ఫైల్ చేయడానికి ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ www.incometaxindiaefiling.gov.in సందర్శించవచ్చు. ITRను సకాలంలో దాఖలు చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకోండి.

* ఐడెంటిటీ ప్రూఫ్‌

ఆదాయ పన్ను రిటర్న్ ఏదైనా బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ఇతర డాక్యుమెంట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వివిధ రూపాల్లో ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఉపయోగపడుతుంది. కళాశాలల్లో ప్రవేశం పొందడం, వివిధ ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలను పొందడం వంటి ప్రయోజనాల కోసం ఇది ప్రూఫ్‌గా పని చేస్తుంది.

* ఇన్‌కం ప్రూఫ్‌

వార్షిక ఆదాయం ఆధారంగా ఐటీఆర్ ఫైల్ చేస్తారు. ఐటీఆర్‌లో ఇన్‌కమ్ సోర్సెస్‌కి సంబంధించిన ప్రతి వివరాలు ఉంటాయి. కాబట్టి ఇది ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లావాదేవీలు చేయడానికి ప్రూఫ్‌గా ఉపయోగపడుతుంది.

ఇదీ చదవండి: వారెవ్వా.. ఫేస్ బుక్ లో టిక్ టాక్.. ఇక పండగే పండుగ.. ఎప్పటి నుంచి అంటే!


* ఈజీ లోన్స్

లోన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, బ్యాంకులు సాధారణంగా కొన్ని సంవత్సరాల ఆదాయ రుజువు, ITR పత్రాలను అడుగుతాయి. తద్వారా లోన్‌ తిరిగి చెల్లించగలరా లేదా అని నిర్ధారించుకుంటాయి. ఐటీఆర్‌ పత్రాల ఆధారంగానే ప్రస్తుత ఆర్థిక స్థితిని అంచనా వేస్తాయి.

* వీసా పొందడం కోసం

దరఖాస్తును అంచనా వేస్తున్నప్పుడు ఎంబసీ వ్యక్తి ఫైనాన్షియల్ స్టేటస్ గమనించడం వల్ల ఐటీఆర్‌ ఫైలింగ్ వీసాను పొందడం సులభం చేస్తుంది. ITRని సకాలంలో ఫైల్ చేసి, సకాలంలో చేసినందుకు మంచి ఫైనాన్షియ్‌ హిస్టరీ ఉంటే, వీసాను సులభంగా పొందడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

నష్టాలతో కొనసాగండి

భవిష్యత్ ఆదాయంపై పన్ను బాధ్యతలను తగ్గించడానికి, ఆదాయ పన్ను నియమం పన్ను చెల్లింపుదారులకు నష్టాలను వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఫార్వర్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి భవిష్యత్తు ఆదాయంపై చెల్లించాల్సిన నష్టాలను ముందుకు తీసుకు వెళ్ళవచ్చు.

First published:

Tags: Income tax, IT Returns, ITR, ITR Filing

ఉత్తమ కథలు